Pelli SandaD: రాఘవేంద్రరావు సినిమాతో రీ ఎంట్రీ ఇవ్వనున్న అప్పటి సౌందర్య లహరి..

తెలుగు ఆడియన్స్‌కి కొత్తకొత్త కాంబినేషన్స్‌ని వండి వడ్డిస్తున్నారు మేకర్స్‌. ఇప్పుడైతే థింక్ డిఫరెంట్ అంటూ... ఆన్‌స్క్రీన్‌ కాంబోస్‌ని సెట్ చేయడంలో మరో స్టెప్ పైకెక్కేశారు.

Pelli SandaD: రాఘవేంద్రరావు సినిమాతో రీ ఎంట్రీ ఇవ్వనున్న అప్పటి సౌందర్య లహరి..
Follow us
Rajeev Rayala

|

Updated on: Aug 30, 2021 | 7:20 AM

Pelli SandaD: తెలుగు ఆడియన్స్‌కి కొత్తకొత్త కాంబినేషన్స్‌ని వండి వడ్డిస్తున్నారు మేకర్స్‌. ఇప్పుడైతే థింక్ డిఫరెంట్ అంటూ… ఆన్‌స్క్రీన్‌ కాంబోస్‌ని సెట్ చేయడంలో మరో స్టెప్ పైకెక్కేశారు. ఆ క్రమంలోనే  ఎప్పుడో పాతికేళ్ల కిందట కనిపించి అలరించిన ఓ ముద్దుగుమ్మను ఇప్పుడు మరోసారి ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చి. సర్‌ప్రైజ్ ఇవ్వబోతున్నారు. ఇంతకీ. అమ్మడు ఎవరు అనుకుంటున్నారా..? ‘కల నుంచి ఇల చేరి కనిపించు ఓసారి’… అంటే అలా కనిపించి ఇలా మాయమైంది ఆ సౌందర్య లహరి. పాతికేళ్ల కిందటి పెళ్లిసందడి సినిమా తర్వాత అడపాదడపా తప్పితే తెలుగులో సాలిడ్ అప్పియరెన్స్ ఇవ్వలేదు దీప్తి భట్నాగర్. ఇప్పుడు పెళ్లిసందడి సీక్వెల్‌తో ఈ వయ్యారి రీఎంట్రీ ఇస్తున్నారట.

నాటి పెళ్లిసందడిలో రవళితో కలిసి శ్రీకాంత్‌కి మరో జోడీగా నటించారు దీప్తి భట్నాగర్. ఇప్పుడు రోషన్ హీరోగా చేస్తున్న ఈ రెండో పెళ్లిసందDలో గెస్ట్ అప్పియరెన్స్‌ ఇవ్వబోతున్నారట శ్రీకాంత్‌ అండ్ దీప్తి భట్నాగర్. పధ్నాలుగేళ్ల నుంచి స్క్రీన్‌కి దూరంగా వున్న దీప్తి… ఇలా దర్శకేంద్రుడి కాల్‌ని ఎటెండ్ చేశారన్నమాట. ఇక ఇప్పటికే ఈ సినిమానుంచి విడుదలైన పాటలు, పోస్టర్లు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఈ సినిమాతో హీరోగా సాలిడ్ ఎంట్రీ ఇవ్వనున్నాడు రోషన్. నిజానికి రోషన్ నిర్మలా కాన్వెంట్ అనే సినిమాతో ప్రేక్షకులకు పరిచయం అయ్యాడు. ఆతర్వాత కొంత గ్యాప్ తీసుకొని స్టడీస్ పురాత్రి చేసి ఇప్పుడు ఫుల్ లెంగ్త్ హీరోగా మారిపోయాడు. ఇక ఈ మూవీని కె కృష్ణ మోహన్ రావు, ఆర్కా మీడియా వర్క్‌ సమర్పిస్తుండగా.. ఆర్కే ఫిలిం అసోసియేషన్ నిర్మించనుంది. గౌరీ రోనంకి దర్శకత్వం వహిస్తోన్న ఈ మూవీకి కీరవాణి సంగీతం అందిస్తున్నారు. రాఘవేంద్రరావు దర్శకత్వ పర్యవేక్షణ చేయనున్నారు.

మరిన్ని ఇక్కడ చదవండి : 

RGV: 40 ఏళ్ల క్రితం ఇలాంటి అమ్మాయి కనిపించి ఉంటే.. నేను ఇప్పుడు ఇలా ఉండేవాడిని కాదు. ఆర్‌జీవీ వ్యాఖ్యలు.

Bigg Boss Telugu Season 5 : ఈ సారి మరింత రసవత్తరంగా సాగనున్న బిగ్ బాస్.. టాస్కుల విషయంలో తగ్గేదే లేదంట..

Anupama Parameswaran: అందానికి అసూయ తెప్పించే అనుపమ ఫోటోలు.. బ్లాక్ డ్రెస్సులో బ్యూటీ