Most Eligible Bachelor: అఖిల్ సినిమాలో ఆ స్టార్ కపుల్.. స్పెషల్ అట్రాక్షన్ గా ఆ హీరో ఆయన భార్య..

అక్కినేని అఖిల్ వరుస సినిమాలను లైన్ లో పెట్టిన విషయం తెలిసిందే. చాలా కాలం సక్సెస్ కోసం ఎదురుచూస్తున్న అఖిల్ ఇప్పుడు ఆశలన్నీ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమాపైనే పెట్టుకున్నాడు..

Most Eligible Bachelor: అఖిల్ సినిమాలో ఆ స్టార్ కపుల్.. స్పెషల్ అట్రాక్షన్ గా ఆ హీరో ఆయన భార్య..
Akhil
Follow us
Rajeev Rayala

|

Updated on: Aug 30, 2021 | 8:02 AM

Most Eligible Bachelor: అక్కినేని అఖిల్ వరుస సినిమాలను లైన్లో పెట్టిన విషయం తెలిసిందే. చాలా కాలం సక్సెస్ కోసం ఎదురుచూస్తున్న అఖిల్ ఇప్పుడు ఆశలన్నీ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమాపైనే పెట్టుకున్నాడు. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా అందమైన ప్రేమ కథగా ప్రేక్షకుల ముందుకు రాబోతుందని తెలుస్తుంది. ఈ సినిమాలో బుట్టబొమ్మ పూజాహెగ్డే హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమాను జీఏ2 పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై నిర్మిస్తున్నారు. మోస్ట్ సక్సెస్ ఫుల్ నిర్మాతగా క్రేజ్ సొంతం చేసుకున్న‌ బన్నీ వాసు, మరో నిర్మాత ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు వాసు వర్మతో కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’ ప్రకటించిన రోజు నుంచి ఈ సినిమాపై అక్కినేని అభిమానుల్లో ఆసక్తి మొదలైంది. ఈ నేపథ్యంలో ఇప్పటి వరకు మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌ల‌ర్‌ టీం విడుదల చేసిన అఖిల్ అక్కినేని ఫస్ట్ లుక్‌కు, అలానే గోపీ సుంద‌ర్ సంగీత‌ సార‌ధ్యంలో హ్యాపెనింగ్ స్టార్ సింగర్ సిద్ శ్రీరామ్ పాడిన మనసా మ‌న‌సా పాట, ఆ తర్వాత వచ్చిన రెండు పాటలు, అలాగే టీజ‌ర్‌కు అటు సోషల్ మీడియాలో ఇటు అభిమానుల్లో అనూహ్యమైన స్పందన లభించడం యూనిట్‌లో కొత్త ఉత్సాహ‌న్ని తెచ్చింది.

ఇదిలా ఉంటే ఈ సినిమాలో ఓ స్టార్ కపుల్ నటించనున్నారట. ఇలాగే మరో స్టార్‌ కపుల్ తెలుగు ఆడియన్స్‌కి సర్‌ప్రైజ్ ఇవ్వబోతున్నారు. ప్లేబ్యాక్ సింగర్‌గా, డబ్బింగ్ ఆర్టిస్టుగా, సోషల్ యాక్టివిస్ట్‌గా వీటన్నికంటే… రాహుల్ రవీంద్రన్ భార్యగా బాగా పరిచయమున్న పేరు చిన్మయి శ్రీపాద. అప్పుడప్పుడూ రియాలిటీ షోస్‌ మాత్రమే చేసిన చిన్మయి.. ఇప్పుడు.. ఫస్ట్‌ టైమ్ బిగ్‌ స్క్రీన్ అప్పియరెన్స్ ఇస్తున్నారు. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ మూవీలోకీ రోల్ ప్లే చేస్తున్న రాహుల్‌ రవీంద్రన్‌కి రీల్ వైఫ్‌గా నటిస్తున్నారట ఈ రియల్ వైఫ్.

మరిన్ని ఇక్కడ చదవండి : 

RGV: 40 ఏళ్ల క్రితం ఇలాంటి అమ్మాయి కనిపించి ఉంటే.. నేను ఇప్పుడు ఇలా ఉండేవాడిని కాదు. ఆర్‌జీవీ వ్యాఖ్యలు.

Bigg Boss Telugu Season 5 : ఈ సారి మరింత రసవత్తరంగా సాగనున్న బిగ్ బాస్.. టాస్కుల విషయంలో తగ్గేదే లేదంట..

Anupama Parameswaran: అందానికి అసూయ తెప్పించే అనుపమ ఫోటోలు.. బ్లాక్ డ్రెస్సులో బ్యూటీ

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!