AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Keerthy Suresh: స్నేహితుడిని పెళ్లి చేసుకోబోతున్న మహానటి.. అసలు విషయం చెప్పిన కీర్తి సురేష్ తల్లి.. ఏమన్నారంటే..

తాజాగా తన కూతురి మ్యారెజ్ గురించి వస్తున్న వార్తలపై కీర్తి తల్లి .. ఒకప్పటి నటి మేనక స్పందించారు. తమ కూతురు పెళ్లి.. ప్రేమ గురించి వస్తున్న వార్తలను ఆమె ఖండించారు.

Keerthy Suresh: స్నేహితుడిని పెళ్లి చేసుకోబోతున్న మహానటి.. అసలు విషయం చెప్పిన కీర్తి సురేష్ తల్లి.. ఏమన్నారంటే..
Keerthi Suresh
Rajitha Chanti
|

Updated on: Feb 01, 2023 | 6:43 PM

Share

గత కొద్ది రోజులుగా కీర్తి సురేష్ అప్ కమింగ్ ప్రాజెక్ట్స్ అప్డేట్స్ కంటే ఆమె వ్యక్తిగత విషయాలు నెట్టింట తెగ వైరలవుతున్నాయి. తమిళ్ స్టార్ హీరో విజయ్ దళపతితో ఆమె ప్రేమలో ఉన్నారని వార్తలు హల్చల్ చేశాయి. అంతలోనే కీర్తి తన స్నేహితుడు.. వ్యాపారవేత్తను పెళ్లి చేసుకోబోతున్నట్లు కోలీవుడ్ ఫిల్మ్ వర్గాల్లో టాక్ వినిపించింది. కొన్నేళ్లుగా తన స్నేహితుడితో ప్రేమలో ఉన్నారని.. నాలుగేళ్ల తర్వాత వీరు ఏడడుగులు వేయబోతున్నారనే ప్రచారం నడిచింది. అయితే తన ప్రేమ, పెళ్లి గురించి వస్తున్న రూమర్స్ పై ఇప్పటివరకు కీర్తి నేరుగా స్పందించలేదు. తాజాగా తన కూతురి మ్యారెజ్ గురించి వస్తున్న వార్తలపై కీర్తి తల్లి .. ఒకప్పటి నటి మేనక స్పందించారు. తమ కూతురు పెళ్లి.. ప్రేమ గురించి వస్తున్న వార్తలను ఆమె ఖండించారు.

కీర్తి సురేష్ పెళ్లి గురించి వస్తున్న వార్తలు కేవలం పుకార్లే అని.. ప్రస్తుతం తన కూతురు కేవలం కెరీర్ ను మాత్రమే ప్రేమిస్తోందని అన్నారు. ఇలాంటి వార్తలను.. పుకార్లను నమ్మొద్దన్నారు. కీర్తి పెళ్లి పై వస్తున్న రూమర్స్ పై ఇకపై తాము స్పందంచమని అన్నారు. అయితే కీర్తి పెళ్లి గురించి వార్తలు రావడం ఇది మొదటి సారి కాదు. గతంలో ఆమె మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ తో ప్రేమలో ఉన్నారని ప్రచారం నడిచింది. అదే సమయంలో వీరిద్దరు కలిసి ఉన్న ఫోటోస్ బయటకు రావడంతో ఆ వార్తలకు మరింత బలం చేకూరింది. ఇక ఆ తర్వాత అవి అవాస్తవం అని తెలిసింది.

ప్రస్తుతం కీర్తి సురేష్ న్యాచురల్ స్టార్ నాని నటిస్తోన్న దసరా సినిమాలో నటిస్తోంది. ఇటీవలే ఈ సినిమా చిత్రీకరణ పూర్తైంది. ఇక ఇదే కాకుండా.. మెగాస్టార్ చిరంజీవి నటిస్తోన్న భోళా శంకర్ చిత్రంలో నటిస్తుంది. ఇందులో చిరు చెల్లిగా కనిపించనుంది. ఇవే కాకుండా.. ఆమె చేతిలో నాలుగు చిత్రాలున్నట్లు తెలుస్తోంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.