Gaddar: గద్దర్ పై కరాటే కళ్యాణిపై వివాదాస్పద పోస్ట్.. ఎర్ర బ్యాచ్ వెకిలి వ్యాఖ్యలు.. అభిమానుల ఆగ్రహం
తన పాటలతో ప్రత్యేక తెలంగాణ ఉద్యమానికి ఊపిరి పోసిన గద్దర్ అంత్యక్రియలను ప్రభుత్వం అధికారిక లాంఛనాలతో నిర్వహించింది. అశేషమైన అభిమానులు ఆయన అంతిమయాత్రలో పాల్గొన్నారు. ఇదే సమయంలో ప్రముఖ సినీనటి, బిగ్‌బాస్ ఫేమ్ కరాటే కల్యాణి గద్దర్‌పై సోషల్ మీడియా వేదికగా వివాదాస్పద పోస్ట్ పెట్టింది. ఆయనను ఎద్దేవా చేస్తూ కాంట్రవర్సీ కామెంట్లు చేసింది. దీంతో ప్రజా సంఘాల నాయకులు..

ప్రజా యుద్ధనౌక, విప్లవ వీరుడు గద్దర్ అనారోగ్యంతో కన్నమూసిన సంగతి తెలిసిందే. అనారోగ్య సమస్యలతో అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన ఆదివారం తుదిశ్వాస విడిచారు. గద్దర్ మరణవార్తతో ఆయన కుటుంబ సభ్యులతో పాటు అభిమానులు తల్లడిల్లిపోయారు. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, సీఎం కేసీఆర్, సీఎం జగన్, మంత్రి కేటీఆర్, మెగాస్టార్ చిరంజీవి, పవన్ కల్యాణ్, అలీ.. ఇలా రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు గద్దర్ మృతిపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రజాయుద్ధనౌక నిష్క్రమణకు సంతాపం వ్యక్తం చేశారు. గద్దర్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. తన పాటలతో ప్రత్యేక తెలంగాణ ఉద్యమానికి ఊపిరి పోసిన గద్దర్ అంత్యక్రియలను ప్రభుత్వం అధికారిక లాంఛనాలతో నిర్వహించింది. అశేషమైన అభిమానులు ఆయన అంతిమయాత్రలో పాల్గొన్నారు. ఇదే సమయంలో ప్రముఖ సినీనటి, బిగ్‌బాస్ ఫేమ్ కరాటే కల్యాణి గద్దర్‌పై సోషల్ మీడియా వేదికగా వివాదాస్పద పోస్ట్ పెట్టింది. ఆయనను ఎద్దేవా చేస్తూ కాంట్రవర్సీ కామెంట్లు చేసింది. దీంతో ప్రజా సంఘాల నాయకులు, గద్దర్ అభిమానులు, నెటిజన్లు కరాటే కల్యాణిపై మండిపడుతున్నారు.
పోస్టులో ఏముందంటే?
మొదట గద్దర్ ఫొటోను ఫేస్ బుక్‌లో షేర్ చేస్తూ ‘ ఎర్ర పాట.. మూగబోయింది.. కన్నీటి వీడ్కోలు.. ఓం శాంతి’ అంటూ పోస్ట్ చేసింది. ఆ తరువాత మరి కాసేపటికే ‘బాలు గారు విశ్వనాథ్ గారు సిరివెన్నెల గారు వెళ్లిపోయిన రోజున ఎర్ర బ్యాచ్ ఏమన్నారు మర్చిపోలేదు కానీ పోయినోల్లని తిట్టే సంస్కారం మా ధర్మం లో లే’ అంటూ కాంట్రవర్సీ కామెంట్స్‌తో మరోపోస్ట్ పెట్టింది. దీంతో ప్రజా సంఘాల నాయకులు, గద్దర్ అభిమానులు ఆమెపై ఓ రేంజ్‌లో ఫైర్ అయ్యారు. పోయినోళ్లని తిట్టడానికి నీకు మనసెలా వచ్చింది? అంటూ కామెంట్ల వర్షం కురిపించారు. ఈ కామెంట్లపై కూడా రాత్రి ఫేస్‌బుక్ లైవ్ పెట్టింది కల్యాణ్. కారులో ప్రయాణిస్తూనే కామెంట్లపై స్పందిస్తూ మరోసారి గద్దర్, ఆయన ఫ్యామిలీపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. ‘ఏం చేస్తారో చేసుకోండి. పోస్ట్ తీయకపోతే ఏం చేస్తారో చేసుకోండి.. నాకు నచ్చినట్టు నేను ఉంటాను. నన్ను బెదిరిస్తే.. ఇంకా బెదిరిస్తా. నా పోస్ట్‌లు నా ఇష్టం’ అంటూ మాట్లాడింది కల్యాణి.
కరాటే కల్యాణ్ ఫేస్ బుక్ పోస్ట్




మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
