Horoscope Today: ఆ రాశి నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. 12 రాశుల వారికి రాశిఫలాలు
Today Horoscope in Telugu (February 6, 2026): మేష రాశి వారికి ఈ రోజు ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది. ఏ ప్రయత్నం తలపెట్టినా సఫలం అవుతుంది. వృషభ రాశి వారికి వ్యక్తిగత సమస్య ఒకటి అనుకోకుండా పరిష్కారం అవుతుంది. స్వల్ప అనారోగ్యానికి అవకాశం ఉంది. మిథున రాశి వారికి రోజంతా ప్రశాంతంగా, సానుకూలంగా గడిచిపోతుంది. ఆర్థిక లావాదేవీలు, ఆర్థిక ప్రయత్నాలు ఆశించిన ఫలితాలను ఇస్తాయి. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి శుక్రవారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..?

దిన ఫలాలు (ఫిబ్రవరి 6, 2026): మేష రాశి వారికి ఈ రోజు ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా ఉండే అవకాశముంది. వృషభ రాశి వారికి వ్యక్తిగత సమస్య ఒకటి అనుకోకుండా పరిష్కారం అయ్యే ఛాన్స్ ఉంది. మిథున రాశి వారికి రోజంతా ప్రశాంతంగా, సానుకూలంగా గడిచిపోయే అవకాశముంది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి శుక్రవారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..?
మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)
ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది. ఏ ప్రయత్నం తలపెట్టినా సఫలం అవుతుంది. కుటుంబ సభ్యులతో ఆనందంగా కాలక్షేపం చేయడం, దైవ కార్యాల్లో పాల్గొనడం జరుగుతుంది. ఉద్యోగంలో ప్రాధాన్యం పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాలు వేగం పుంజుకుంటాయి. దూర ప్రాంతం నుంచి శుభ వార్తలు వింటారు. పిల్లలు వృద్ధిలోకి వస్తారు. విద్యార్థులు సునాయాసంగా విజయాలు సాధిస్తారు. ఆరోగ్యానికి లోటు ఉండదు. ప్రేమ వ్యవహారాల్లో సానుకూల పరిణామాలు చోటు చేసుకుంటాయి.
వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)
వ్యక్తిగత సమస్య ఒకటి అనుకోకుండా పరిష్కారం అవుతుంది. స్వల్ప అనారోగ్యానికి అవకాశం ఉంది. చిన్ననాటి మిత్రుల నుంచి సహకారం లభిస్తుంది. ముఖ్యమైన వ్యవహారాలను నిదానంగా పూర్తి చేస్తారు. వృత్తి, వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగ జీవితం సాఫీగా సాగిపోతుంది. కుటుంబ సభ్యులతో దైవ కార్యాల్లో పాల్గొంటారు. బంధువులతో సమస్యలు తలెత్తుతాయి. విద్యార్థులు చదువుల మీద శ్రద్ధ పెంచాల్సి ఉంటుంది. ప్రేమ వ్యవహారాలు ఉత్సాహంగా సాగిపోతాయి.
మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)
రోజంతా ప్రశాంతంగా, సానుకూలంగా గడిచిపోతుంది. ఆర్థిక లావాదేవీలు, ఆర్థిక ప్రయత్నాలు ఆశించిన ఫలితాలను ఇస్తాయి. వృత్తి, వ్యాపారాల్లో లాభాలు పెరుగుతాయి. ఉద్యోగాల్లో మంచి అవ కాశాలు అందివస్తాయి. నిరుద్యోగులకు కూడా ఆఫర్లు అందుతాయి. సమాజంలో మీ మాటకు, చేతకు విలువ పెరుగుతుంది. రాజకీయ నాయకులతో పరిచయాలు పెరుగుతాయి. విద్యార్థులకు సమయం అనుకూలంగా ఉంది. ఆరోగ్యం పరవాలేదు. ప్రేమ వ్యవహారాల్లో దూసుకుపోతారు.
కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)
రోజంతా ఉత్సాహంగా సాగిపోతుంది కానీ. కుటుంబపరంగా కొద్దిగా ఒత్తిడి ఉంటుంది. వృత్తి, ఉద్యోగాల్లో వాతావరణం అనుకూలంగా ఉంటుంది. వ్యాపారంలో బాగా బిజీ అవుతారు. యాక్టివిటీ పెరు గుతుంది. ఇతరుల బాధ్యతల్ని నిర్వర్తించాల్సి వస్తుంది. తలపెట్టిన పనులు వేగంగా పూర్తవుతాయి. రాదనుకుని వదిలేసుకున్న డబ్బు కొద్ది ప్రయత్నంతో వసూలు అవుతుంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది. విద్యార్థులు శ్రద్ధ పెంచాల్సి ఉంటుంది. ప్రేమ వ్యవహారాలు ఉత్సాహంగా సాగు తాయి.
సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)
ఆర్థికంగా కొద్దిపాటి పురోగతి సాధిస్తారు. ఒకటి రెండు శుభ వార్తలు వింటారు. ఉద్యోగంలో పదోన్నతికి అవకాశం ఉంది. నిరుద్యోగుల ప్రయత్నాలకు సానుకూల స్పందన లభిస్తుంది. వృత్తి, వ్యాపారాల్లో సొంత నిర్ణయాలు అమలు చేయడం వల్ల లబ్ధి పొందుతారు. ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోవద్దు. ఇతరుల విమర్శలను పట్టించుకోవద్దు. విద్యార్థులు కాస్తంత శ్రమపడాల్సి ఉంటుంది. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. ప్రేమ వ్యవహారాల్లో ఆచితూచి అడుగువేయడం చాలా మంచిది.
కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)
ఆర్థిక వ్యవహారాలకు ఎక్కువ సమయం కేటాయిస్తారు. వృత్తి, ఉద్యోగాలపరంగా ఆశించిన ప్రయోజనాలను పొందుతారు. ఆర్థిక ప్రయత్నాలు బాగా కలిసి వస్తాయి. వ్యాపారాల్లో మీ ఆలోచనలు, ప్రయత్నాలు లాభాలను తెచ్చిపెడతాయి. నిరుద్యోగులకు సమయం అనుకూలంగా ఉంది. పరిచయస్థుల్లో మంచి పెళ్లి సంబంధం కుదురుతుంది. ఆర్థిక లావాదేవీలు, స్పెక్యులేషన్లు లాభిస్తాయి. విద్యార్థులు విజయాలు సాధిస్తారు. ఆరోగ్యం పరవాలేదు. ప్రేమ వ్యవహారాలు హ్యాపీగా సాగిపోతాయి.
తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)
ఆర్థికంగా అంచనాలకు మించిన పురోగతి ఉంటుంది. సమాజానికి ఉపయోగపడే కొన్ని మంచి పనులు చేస్తారు. బంధుమిత్రులను ఇతోధికంగా ఆదుకుంటారు. తలపెట్టిన కార్యకలాపాలు సజావుగా సాగిపోతాయి. వృత్తి, ఉద్యోగాలు కొత్త పుంతలు తొక్కుతాయి. వ్యాపారాల్లో ఆలోచనలు, వ్యూహాలు లాభాలను తీసుకువస్తాయి. దైవ చింతన పెరుగుతుంది. విద్యార్థులు పురోగతి చెందు తారు. ప్రేమ వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. ఆరోగ్యం విషయంలో జాగ్తత్తగా ఉండడం మంచిది.
వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట)
అనుకున్న పనులు అనుకున్న విధంగా పూర్తవుతాయి. వృత్తి, ఉద్యోగాల రీత్యా ఆకస్మిక ప్రయాణాలు తప్పకపోవచ్చు. ప్రయాణాల్లో మంచి పరిచయాలు ఏర్పడతాయి. కుటుంబ సభ్యులతో ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ముఖ్యమైన వ్యవహారాలు సకాలంలో పూర్తవుతాయి. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. వ్యాపారాల్లో సానుకూల మార్పులు చోటు చేసుకుంటాయి. బంధువులతో పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది. కొద్ది శ్రమతో విద్యార్థులు రాణిస్తారు.
ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)
మీ మాటకు విలువ పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాల్లో ఆర్థిక సమస్యలు, ఒత్తిళ్లు బాగా తగ్గిపోతాయి. అనేక విధాలుగా ఆదాయం పెరుగుతుంది కానీ, కుటుంబ ఖర్చులు కూడా బాగా పెరుగుతాయి. ఉద్యోగంలో సానుకూల వాతావరణం ఉంటుంది. అధికారులు మీ సలహాలతో లబ్ధి పొందుతారు. వ్యక్తిగత సమస్య ఒకటి పరిష్కారం అవుతుంది. ఆస్తిపాస్తులకు సంబంధించిన సమాచారం అందుతుంది. విద్యార్థులు పురోగతి సాధిస్తారు. ప్రేమ వ్యవహారాల్లో ముందడుగు వేస్తారు.
మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2)
ఆర్థిక పరిస్థితి బాగా మెరుగ్గా ఉంటుంది. ఆర్థిక విషయాల్లో తొందరపాటుతో వ్యవహరించవద్దు. నిర్ణయాలు తీసుకునే ముందు ఆలోచించడం మంచిది. అధికారులతో అపార్థాలు తలెత్తే సూచనలున్నాయి. వృత్తి, వ్యాపారాలు సజావుగా సాగిపోతాయి. ముఖ్యమైన వ్యవహారాలు నిదానంగా పూర్తవుతాయి. నిరుద్యోగులకు సొంత ఊర్లోనే ఉద్యోగం లభించే అవకాశం ఉంది. పుణ్యకార్యాల్లో పాల్గొంటారు. విద్యార్థులు కష్టపడాల్సి ఉంటుంది. ప్రేమ వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండడం మంచిది.
కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)
ఆర్థిక పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. ఆర్థిక లావాదేవీలు, ఆర్థిక వ్యవహారాలు సవ్యంగా సాగిపోతాయి. అనుకున్న సమయానికి పనులన్నిటినీ పూర్తి చేస్తారు. పిల్లల చదువుల విష యంలో శుభ వార్తలు అందుకుంటారు. ఉద్యోగ జీవితం సంతృప్తికరంగా సాగిపోతుంది. వృత్తి, వ్యాపారాల్లో రాబడి పెరిగే అవకాశం ఉంది. ఒకటి రెండు శుభవార్తలు వింటారు. మొండి బాకీలు వసూలవుతాయి. విద్యార్థులకు సమయం బాగుంది. ప్రేమ వ్యవహారాలు రొటీన్ గా సాగిపోతాయి.
మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)
ఇంటా బయటా బాగా ఒత్తిడి ఉన్నప్పటికీ, తలపెట్టిన పనులన్నిటినీ పట్టుదలగా పూర్తి చేస్తారు. చిన్ననాటి స్నేహితులు సహాయ సహకారాలు అందజేస్తారు. మంచి పరిచయాలు ఏర్పడతాయి. ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. ఆశించిన పెళ్లి సంబంధం కుదురుతుంది. ఉద్యోగంలో భారీ లక్ష్యాలతో ఇబ్బంది పడతారు. వృత్తి, వ్యాపారాలు నిలకడగా ముందుకు సాగుతాయి. విద్యార్థులు కష్టపడాల్సి ఉంటుంది. ప్రేమ వ్యవహారాలు ఆశించినంత అనుకూలంగా ఉండకపోవచ్చు.