Gold Prices: బంగారం ధరలపై భారీ ఊరట.. మళ్లీ తగ్గిన ధరలు.. లేటెస్ట్ రేట్లు ఇవే..
బంగారం ధరలు మళ్లీ తగ్గుముఖం పడుతున్నాయి. రోజురోజుకి ధరలు పడిపోతున్నాయి. అంతర్జాతీయ పరిస్ధితులు, ట్రంప్ ప్రకటనలు గోల్డ్ రేట్లపై తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయి. పసిడి ధరలు తగ్గుతుండటంతో కొనుగోలుదారులు ఊరట చెందుతున్నారు. శుక్రవారం గోల్డ్ రేట్లలో మళ్లీ మార్పులు చోటుచేసుకున్నాయి. అవేంటో చూద్దాం.

బంగారం ధరలు గత కొద్దిరోజులుగా తగ్గుతూ వస్తోన్న విషయం తెలిసిందే. భారత్-అమెరికా మధ్య ట్రేడ్ డీల్, కేంద్ర బడ్జెట్ ప్రకటన తర్వాత పడిసి ధరలు దిగొస్తున్నాయి. ఒకేసారి ధరలు కుప్పకూలుతున్నాయి. దీంతో బంగారం కొనుగోలు చేసేందుకు చాలామందికి ఆసక్తి చూపిస్తున్నారు. ఇక వీటిల్లోకి పెట్టుబడుల ప్రవాహం కూడా కొనసాగుతోంది. శుక్రవారం మరోసారి బంగారం ధరల్లో మార్పులు చోటుచేసుకున్నాయి. గోల్డ్ రేటు స్వల్పంగా తగ్గింది. ఇవాళ దేశంలోని వివిధ నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం.
బంగారం ధరలు ఇలా..
-హైదరాబాద్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం రేటు రూ.1,54,410 వద్ద కొనసాగుతోండగా.. నిన్న ఈ ధర రూ.1,54,420 వద్ద స్ధిరపడింది. 22 క్యారెట్ల రేటు రూ.1,41,540 వద్ద కొనసాగుతుండగా.. గురువారం రూ.1,41,550గా ఉంది.
-విజయవాడ, విశాఖపట్నంలో 24 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.1,54,410 వద్ద కొనసాగుతోండగా.. 22 క్యారెట్ల రేటు రూ.1,41,540గా ఉంది.
-ఇక చెన్నైలో 10 గ్రాముల 24 క్యారెట్ల స్వచ్చమైన బంగారం ధర రూ.1,56,210గా ఉండగా.. గురువారం రూ.1,56,220 వద్ద ఉంది. ఇక 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ.1,43,190 వద్ద కొనసాగుతోండగా.. ఇవాళ రూ.1,43,200 వద్ద స్థిరపడింది.
-బెంగళూరులో 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ.1,54,410 వద్ద కొనసాగుతోండగా.. 22 క్యారెట్ల రేటు రూ.1,41,540గా ఉంది.
-ఢిల్లీలో 24 క్యారెట్ల ప్యూర్ గోల్డ్ రూ.1,54,560 వద్ద కొనసాగుతోండగా.. 22 క్యారెట్ల రేటు రూ.1,41,690గా ఉంది.
వెండి రేట్లు ఇవే..
-ఢిల్లీలో కేజీ వెండి ధర రూ.2.99,900 వద్ద కొనసాగుతోంది. నిన్న రూ.3 లక్షలుగా ఉంది.
-హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలో కేజీ సిల్వర్ రేటు రూ.2,99,900 వద్ద కొనసాగుతోంది.
-చెన్నైలో కేజీ వెండి ధర రూ.2.99 లక్షలుగా కొనసాగుతోంది. ఇక బెంగళూరులో కూడా ఇవే ధరలు కొనసాగుతున్నాయి.
