శివుడికి , పాములకు ఉన్న సంబంధం ఏంటో తెలిస్తే ఒళ్లు గగుర్పాటే!
Samatha
5 February 2026
శివుడి మెడలో నాగు పాము ఉంటుంది. అయితే ఇది ప్రతి ఒక్కరికీ తెలుసు. కానీ అసలు శివుడి మెడలో పాము ఎందుకు ఉంటుంది? దీని గల కారణం తెలియదు.
శివుడు
అయితే ఇప్పుడు మనం అసలు శివుడికి, సర్పాలకు గల సంబంధం ఏంటి? శివుడు తన మెడలో పామును ఆభరణంలా ఎందుకు ధరిస్తాడో తెలుసుకుందాం.
పాములు
శివుడు పామును మెడలో ధరించడం వలెనుక ఒళ్లు గగుర్పాటుకు గురిచేసే ఆధ్యాత్మిక రహస్యాలు ఉన్నాయని చెబుతున్నారు పండితులు. అసలు ఈ రహస్యాలు ఏంటో చూద్దాం.
శివుడి మెడలో పాము
సర్పం విషానికి ప్రతీక, అయితే పాము మెడలో ధరించడం అంటే ప్రతి వ్యక్తి తనలోని కామ, క్రోధ, లోభ మోహాలను అనే విషపూరితమైన ఆలోచనలు అదుపులో ఉంచుకోవాలనే సందేశం అంట.
పాము విషం
అంతే కాకుండా, శివుని మెడలో పాము మూడు చుట్టలు చుట్టుకొని ఉంటుంది. అయితే వర్తమానం, భవిష్యత్తు,గతాన్ని సూచిస్తుందంట.
భవిష్యత్తు, గతం, ఫ్యూచర్
ప్రతి వ్యక్తి వెన్నెముక చివరన కుండలినీ శక్తి అనే అద్భుతమైన శక్తి ఉంటుందంట. ఇది నిద్ర పోతున్న సమయంలో పాములా చుట్టుకొని ఉంటుందంట. అలాగే శివుని మెడలోని పాము కూడా చుట్టులుగా ఉంటుంది.
వెన్నుముక
అయితే శివుడి మెడలోని పాము వెన్నెముక కుండలినీ శక్తిని సూచిస్తుందంట. అయితే శివుడి మెడలో పాము ఉండటం అంటే, ఆయనలో ఆ శక్తి మేల్కొని ఉందని అర్థం అంట.
కుండలినీ శక్తి
పాము తన పాత చర్మాన్ని విడిచిపెట్టి కొత్త చర్మాన్ని పొందడం అనేది జీవన చక్రం, నిరంతర కొనసాగింపునకు ప్రతీక. శివుడిని చుట్టుకుని ఉన్న పాము, సృష్టి, స్థితి, లయ అనే చక్రం నిరంతరం సాగుతుందని తెలియజేస్తుందంట.