Kalpika: నువ్వు జూనియర్ ఆర్టిస్టా ? వ్యభిచారా ? అని అడిగారు.. నటి కల్పిక షాకింగ్ కామెంట్స్..
ఇక తాజాగా ఓ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కల్పిక మాట్లాడుతూ.. తాను కొన్నేళ్లుగా ఎదుర్కొంటున్న వేధింపుల గురించి స్పందించారు.

ఇటీవల నటి కల్పిక పేరు ఎక్కువగా వినిపిస్తోంది. తెలుగులో పలు చిత్రాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటించిన కల్పికా.. రీసెంట్గా సామ్ నటించి యశోద చిత్రంలో కీలకపాత్రలో కనిపించింది. అయితే సినిమాలకంటే ఎక్కువగా వివాదాలతోనే తెరపైకి వస్తుంది.. ఇటీవల యశోద సక్సెస్ మీట్ లో పాల్గోన్న ఆమె.. తను కూడా సమంత లాగా మయోసైటిస్ సమస్యతో బాధపడుతున్నానని.. ప్రస్తుతం ఫస్ట్ స్టేజ్ లో ఉన్నానని… సామ్ థర్డ్ స్టేజ్ లో ఉందని చెప్పుకొచ్చింది. ఇక తాజాగా ఓ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కల్పిక మాట్లాడుతూ.. తాను కొన్నేళ్లుగా ఎదుర్కొంటున్న వేధింపుల గురించి స్పందించారు.
నేను ఇన్ స్టాలో దాదాపు 10 ఏళ్ల నుంచి ఉన్నాను.. కొద్ది కాలంగా నాపై ట్రోలింగ్స్ ఎక్కువయ్యాయి. ఇప్పుడు ఒకటి మాత్రమే హైలేట్ అవుతుంది. అది కొన్ని రోజుల క్రితం ఓ ఇంజనీరింగ్ కాలేజీలో ఈ వెంట్ కు చీఫ్ గెస్ట్ గా పిలిచారు. ఆ క్యాంపస్ లో ఓ గంటన్నర ఉన్నాను.. నాకు నీళ్లు కూడా ఇవ్వలేదు. కాఫీ అడిగితే మిషిన్స్ పనిచేయడం లేదు అన్నారు. నేను సెమినార్ చెబుతున్నపుడు నా ఫొటోలు, వీడియోలు తీస్తానని నన్ను ఈవెంట్‌కు పిలిచినపుడు వాళ్లు చెప్పారు. కానీ, అలా జరగలేదు. అప్‌సెట్ అయ్యాను. కొంతమంది మా పేర్లు, ఫొటోలు మార్ఫింగ్ చేసి వాడుతున్నారు. రష్మీ విషయంలో కూడా ఇలానే జరిగిందని తెలిసింది. రష్మీతో మాట్లాడటానికి ట్రై చేశాను. ఆ విషయం నందుకు చెప్పాను.
కానీ రష్మీ స్పందించటం లేదని తను నాతో చెప్పాడు. నా ఫొటోలు మార్ఫింగ్ చేసి పెట్టే వాళ్లకు డబ్బులు ఎవరైనా ఇస్తున్నారా? మీ ఈగో సంతృప్తి చెందుతోందా? ఏంటి మీ బాధలు. ఆ కాలేజ్ గొడవ వల్లే ఈ ఇష్యూ మొదలైంది. నా ఇన్ స్టా ఒక రీల్‌లో ఓ 15 ఏళ్ల అమ్మాయి ఫోన్ నెంబర్ పెట్టాను. అప్పటినుంచి కొంతమంది నన్ను ట్రోల్ చేయడం స్టార్ట్ చేశారు. నాపై రాయదుర్గం పోలీస్ స్టేషన్‌లో కేసు కూడా పెట్టారు




ఆ 15 ఏళ్ల బాలిక తల్లి నాతో దారుణంగా మాట్లాడింది. ఆమె నాతో ‘‘ నువ్వు అసలు అమ్మాయి వేనా.. కల్పికను పిలవాలని కాలేజ్ వాళ్లు నాతో చెప్పినపుడు వద్దన్నాను. కల్పిక ఎవరు? జూనియర్ ఆర్టిస్టా.. వ్యభిచారా? అని అడిగాను. ఆమెను ఎందుకు పిలవాలి? అని కూడా నేను చెప్పాను. నీకు కొంచెమైనా సిగ్గుందా? బుద్ధి ఉందా’’ అంటూ నన్ను తిట్టింది. ’’ అంటూ చెప్పుకొచ్చింది.




