Pushpa 2: క్రేజీ న్యూస్.. పుష్ప 2లో మరో స్పెషల్ సాంగ్.. ఈసారి ఆ స్టార్ హీరోయిన్..
సామాన్యులే కాకుండా సెలబ్రెటీలు సైతం పుష్ప పాటలకు స్టెప్పులేశారు. ముఖ్యంగా ఈ సినిమాలోని స్పెషల్ సాంగ్ ఊ అంటావ మావ పాటకు మిలియన్ వ్యూస్ వచ్చాయి. విదేశాల్లోనూ ఈ సాంగ్ క్రేజ్ కొనసాగుతుంది.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.. నేషనల్ క్రష్ రష్మిక మందన్నా జంటగా నటించిన పుష్ప సినిమా సాధించిన విజయం గురించి తెలిసిందే. ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కించిన ఈ మూవీ బాక్సాఫీస్ ను షేక్ చేసింది. ప్రపంచవ్యాప్తంగా భారీ వసూళ్ల సాధించి రికార్డ్ క్రియేట్ చేసింది. ఇందులో బన్నీ ఊర మాస్ లుక్ లో అదరగొట్టారు. పుష్ప మాత్రమే కాకుండా.. ఈ మూవీలోని సాంగ్స్ సైతం హిట్ అయ్యాయి.
సామాన్యులే కాకుండా సెలబ్రెటీలు సైతం పుష్ప పాటలకు స్టెప్పులేశారు. ముఖ్యంగా ఈ సినిమాలోని స్పెషల్ సాంగ్ ఊ అంటావ మావ పాటకు మిలియన్ వ్యూస్ వచ్చాయి. విదేశాల్లోనూ ఈ సాంగ్ క్రేజ్ కొనసాగుతుంది.
ఇక భారీ అంచనాల మధ్య రూపొందుతున్న పుష్ప 2లోనూ మరో స్పెషల్ సాంగ్ ఉంటుందట. తాజా సమాచారం ప్రకారం సెకండ్ పార్ట్ లో హీరోయిన్ కాజల్ స్పెషల్ సాంగ్ చేయబోతుంది. బాబు పుట్టిన నాలుగు నెలల తర్వాత ఇండియన్ 2 సినిమాతో రీఎంట్రీ ఇస్తోన్న కాజల్.. ఇటీవలే చిత్రీకరణలో పాల్గోంటుంది. ఇక ఇప్పుడు మరిన్ని ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తుందట.