Brahmastra: అప్పుడే ఓటీటీలోకి బ్రహ్మాస్త్ర వచ్చేస్తుందా ?.. సినీ ప్రియులకు ఇక పండగే..

బాక్సాఫీస్ వద్ద అతిపెద్ద విజువల్ వండర్‏గా నిలిచింది. ఇక ఇప్పటికీ థియేటర్లలో సక్సెస్ ఫుల్ గా దూసుకుపోతున్న ఈ సినిమా ఎప్పుడెప్పుడు ఓటీటీకి వస్తుందా అని ఎదురుచూస్తున్నారు సినీ ప్రియులు.

Brahmastra: అప్పుడే ఓటీటీలోకి బ్రహ్మాస్త్ర వచ్చేస్తుందా ?.. సినీ ప్రియులకు ఇక పండగే..
Brahmastra
Follow us
Rajitha Chanti

|

Updated on: Sep 28, 2022 | 7:32 PM

బాలీవుడ్ చిత్రపరిశ్రమలో చాలా కాలం తర్వాత బ్లాక్ బస్టర్ హిట్‏గా నిలిచిన చిత్రం బ్రహ్మాస్త్ర. వరుస డిజాస్టర్లతో విలవిలలాడిపోతున్న నిర్మాతలకు ఈ మూవీ కలెక్షన్స్ మళ్లీ కొత్త ఆశలు కల్పించాయి. డైరెక్టర్ అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో రణబీర్ కపూర్, అలియా భట్ నటించిన ఈ సినిమాకు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఇందులో అమితాబ్, నాగార్జున, షారుఖ్ ఖాన్, మౌనీ రాయ్ కీలకపాత్రలలో నటించారు. విడుదలకు ముందే బాయ్ కాట్ సెగ తగలగా.. మొదటి వారం మిశ్రమ స్పందన వచ్చింది. రెండవ వారం నుంచి మెల్లగా పుంజుకున్న ఈ మూవీ రిలీజ్ అయిన 14 రోజుల్లేనే రూ. 400 కోట్ల క్లబ్‏లో చేరింది. బాక్సాఫీస్ వద్ద అతిపెద్ద విజువల్ వండర్‏గా నిలిచింది. ఇక ఇప్పటికీ థియేటర్లలో సక్సెస్ ఫుల్ గా దూసుకుపోతున్న ఈ సినిమా ఎప్పుడెప్పుడు ఓటీటీకి వస్తుందా అని ఎదురుచూస్తున్నారు సినీ ప్రియులు.

తాజాగా బ్రహ్మాస్త్ర ఓటీటీ స్ట్రీమింగ్ గురించి ఇంట్రెస్టింగ్ అప్డే్ట్ నెట్టింట వైరల్ అవుతుంది. ఈ సినిమా వచ్చే నెల అక్టోబర్ రెండవ వారంలో ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫాం డిస్నీ ప్లస్ హాట్‏లో స్ట్రీమింగ్ కానున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను డిస్నీ ప్లస్ హట్ స్టార్ భారీ ధరకు సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ సినిమా ఓటీటీ రిలీజ్ పై ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.

ప్రస్తుతం రణబీర్ కపూర్ యానిమల్ సినిమాలో నటిస్తున్నారు. ఇందులో రష్మిక మందన్న కథానాయికగా నటిస్తోంది. అలాగే త్వరలోనే బ్రహ్మాస్త్ర పార్ట్ 2 షూటింగ్ స్టార్ట్ కాబోతున్నట్లు తెలుస్తోంది. ఇక లేటేస్ట్ అప్డేట్ ప్రకారం ఈ పార్ట్ 2లో హృతిక్ రోషన్ కీలకపాత్రలో కనిపించనున్నాడని టాక్ వినిపిస్తోంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మౌనముని, ఆర్థిక మేధావికి అంతిమ వీడ్కోలు
మౌనముని, ఆర్థిక మేధావికి అంతిమ వీడ్కోలు
పులి రోజుకు ఎన్ని కిలోమీటర్లు పరుగెడుతోందో తెలుసా..?
పులి రోజుకు ఎన్ని కిలోమీటర్లు పరుగెడుతోందో తెలుసా..?
సైనిక లాంఛనాలతో మన్మోహన్ అంత్యక్రియలు
సైనిక లాంఛనాలతో మన్మోహన్ అంత్యక్రియలు