Kajal: ఉపాధి అవకాశాలు కల్పనలో బీపీపీ యూనివర్సిటీది అగ్రస్థానం.. మీట్ అండ్ గ్రీట్ ఈవెంట్‌లో కాజల్
BPP యూనివర్సిటీలో ఎమ్మెస్సీ, ఇంజనీరింగ్, మేనేజ్మెంట్ కోర్సులపై హైదరాబాద్‌లో సావరియా ఎడ్యుకేషన్ కన్సుల్టెన్సీ ద్వారా విద్యార్థులకు అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో మఖ్య అతిథిగా పాల్గొన్న కాజల్ అగర్వాల్.. యూనివర్సిటీ అడ్మిషన్స్, ఉపాధి అవకాశాలపై మాట్లాడారు.
ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ తర్వాత ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన యూనివర్సిటీల్లో BPP యూనివర్సిటీ మొదటి స్థానంలో నిలిచిందన్నారు ప్రముఖ టాలీవుడ్ హీరోయిన్ కాజల్ అగర్వాల్. BPP యూనివర్సిటీలో ఎమ్మెస్సీ, ఇంజనీరింగ్, మేనేజ్మెంట్ కోర్సులపై హైదరాబాద్‌లో సావరియా ఎడ్యుకేషన్ కన్సుల్టెన్సీ ద్వారా విద్యార్థులకు అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో మఖ్య అతిథిగా పాల్గొన్న కాజల్ అగర్వాల్.. యూనివర్సిటీ అడ్మిషన్స్, ఉపాధి అవకాశాలపై మాట్లాడారు. లండన్‌లో విద్యార్థులకు ఉపాధి కల్పించడంలో BPP యూనివర్సిటీ మొదటి స్థానంలో ఉందన్నారు. 7 బ్రాంచుల్లో 15వేల మంది విద్యార్థులు చదువుతున్నారని ఆమె తెలిపారు. ఇదే కార్యక్రమంలో యూనివర్సిటీ డీన్ సారా మెయి మాట్లాడుతూ తమ యూనివర్సిటీలో 70శాతం విద్యార్థులు ఫుల్ టైమ్ కాగా.. 80శాతం విద్యార్థులు పోస్టు గ్రాడ్యుయేషన్ చదువుతున్నట్టు తెలిపారు . ఏటా ప్రపంచ నలుమూలల నుంచి 10వేల మంది విద్యార్థులు ఈ యూనివర్శిటీలో ప్రవేశాలు పొందుతున్నారన్నారు. ఉపాధి అవకాశాలు సాధించడంలో BPP యూనివర్శిటీ విద్యార్థులు దేశంలోనే నాలుగో స్థానంలో ఉన్నారని ఆమె పేర్కొన్నారు. డిమాండ్‌కు తగిన విధంగా కోర్సులను అందిస్తూ….విద్యార్థులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలను కల్పిస్తున్నట్లు ఆమె వివరించారు. మొదటి ప్రవేశాలు పొందిన వారికి 250 ఫౌండ్లు ప్రత్యేక తగ్గింపు ఇస్తున్నామన్నారు
ఇక సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం బాలకృష్ణ, అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న ‘ఎన్‌బీకే 108’ (వర్కింగ్ టైటిల్) అనే సినిమాలో నటిస్తోంది. ఇందులో శ్రీలీల బాలయ్య కూతురిగా నటిస్తోంది. అలాగే కమల్ హాసన్, శంకర్ కాంబోలో వస్తోన్న ఇండియన్ 2 సినిమాలోనూ కాజల్ హీరోయిన్‌గా కనిపించనుంది. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
Queen @MsKajalAggarwal with bpp University Delegates #KajalAggarwal ??? pic.twitter.com/vUaV2ZPHZG
— Mani_kajalfan (@Mani_Kajalfan) May 24, 2023
Queen @MsKajalAggarwal at BPP University grand course launch event ???#KajalAggarwal https://t.co/DTHN9P2npP pic.twitter.com/fM867drkFt
— Angel Kajal FC (@AngelKajalFC) May 24, 2023
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..