AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Actress: కొరియోగ్రాఫర్ అవమానిస్తే.. దెబ్బకు ఇండస్ట్రీని షేక్ చేసింది.. ఈ హీరోయిన్ రేంజే వేరప్పా..

సాధారణంగా బాలీవుడ్ ఇండస్ట్రీలో సత్తా చాటిన హీరోయిన్స్ చాలా మంది దక్షిణాది చిత్రాలతోనే కెరీర్ ప్రారంభించారు. తెలుగు, తమిళంలో పలు సినిమాల్లో నటించిన ముద్దుగుమ్మలు.. ఆ తర్వాత హిందీలో అవకాశాలు అందుకుని స్టార్ స్టేటస్ సంపాదించుకున్నారు. అందులో ఈ హీరోయిన్ ఒకరు.

Actress: కొరియోగ్రాఫర్ అవమానిస్తే.. దెబ్బకు ఇండస్ట్రీని షేక్ చేసింది.. ఈ హీరోయిన్ రేంజే వేరప్పా..
Isha Koppikar
Rajitha Chanti
|

Updated on: Aug 07, 2025 | 7:17 PM

Share

ఒకప్పుడు బాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్. తెలుగులో చేసింది ఒకటి రెండు సినిమాలే అయినప్పటికీ తనకంటూ మంచి గుర్తింపు సంపాదించుకుంది. కొన్నాళ్లుగా సినిమాలకు దూరంగా ఉంటున్న ఈ భామ.. తాజాగా చేసిన కామెంట్స్ ఇప్పుడు నెట్టింట వైరలవుతున్నాయి. కెరీర్ ప్రారంభంలోనే దక్షిణాదిలో తనకు ఎదురైన అవమానాల గురించి బయటపెట్టింది. ఆమె డ్యాన్స్ గురించి ఓ సౌత్ కొరియోగ్రాఫర్ అందరి ముందు దారుణంగా అవమానించాడని.. అతడి మాటలు తనను ఎంతగానో బాధపెట్టాయని గుర్తుచేసుకుంది. ఆమె మరెవరో కాదు.. హీరోయిన్ ఇషా కొప్పికర్. దక్షిణాది చిత్రాలతోనే నటిగా కెరీర్ స్టార్ట్ చేసింది. ఆ తర్వాత 2000లో ఫిజా అనే సినిమాతో హిందీలోకి అడుగుపెట్టింది. ఫస్ట్ మూవీ తర్వాత వరుస ఆఫర్స్ అందుకున్న ఇషా.. తక్కువ సమయంలోనే స్టార్ స్టేటస్ సంపాదించుకుంది.

ఇవి కూడా చదవండి: Ajith Kumar: అజిత్ పక్కన ఉన్న కుర్రాడు ఎవరో గుర్తుపట్టారా.. ? పాన్ ఇండియా హీరో కమ్ విలన్.. ఎవరంటే..

ఇవి కూడా చదవండి

తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఇషా.. తన కెరీర్ ప్రారంభంలో ఎదురైన అవమానాల గురించి బయటపెట్టింది. ఇషా మాట్లాడుతూ.. “అప్పుడప్పుడే నా కెరీర్ స్టార్ట్ అయ్యింది. దక్షిణాదిలో ఓ సినిమా సెట్ లో నేను ఉన్నప్పుడు ఓ కొరియోగ్రాఫర్ అందరి ముందు నన్ను అవమానించాడు. సౌత్ డ్యాన్స్ స్టైల్స్ కష్టం అనీ మీకు తెలుసా.. నా ఫస్ట్ మూవీకే అతడు నా వద్దకు వచ్చి ఈ బాలీవుడ్ అమ్మాయిలు ఎందుకొస్తారో తెలియదు. వీళ్లకు ఏమీ రాదు అని అన్నాడు. డ్యాన్స్ రాకపోతే ఇక్కడికి ఎందుకు వచ్చావు ? అని క్వశ్చన్ చేశాడు. అందరి ముందు అవమానిస్తూ మాట్లాడాడు” అని గుర్తుచేసుకుంది. ఆ కొరియోగ్రాఫర్ మాటలు విని చాలా బాధపడ్డానని.. ఆ అవమానం భరించలేక మేకప్ రూంలోకి వెళ్లి కన్నీళ్లు పెట్టుకున్నట్లు చెప్పుకొచ్చింది.

ఇవి కూడా చదవండి: Kamal Haasan: అప్పుడు చిన్న హీరోయిన్.. ఇప్పుడు కమల్ హాసన్‏తోనే.. ఎవరో గుర్తుపట్టారా.. ?

ఈ సంఘటన తర్వాత డ్యాన్స్ పై ఎక్కువ శ్రద్ధ పెట్టానని.. ప్రఖ్యాత కొరియోగ్రాఫర్ సరోజ్ ఖాన్ అసిస్టెంట్ దగ్గర డ్యాన్స్ నేర్చుకున్నట్లు తెలిపింది. ఆ తర్వాత కొన్నాళ్లకు కంపెనీ సినిమాలోని ఖల్లాస్ స్పెషల్ పాటకు డ్యాన్స్ ఇరగదీసింది. దీంతో అప్పటి నుంచి ఈ ముద్దుగుమ్మను ఖల్లాస్ గర్ల్ అని పిలవడం స్టార్ట్ చేశారు. చాలా కాలం సినిమాలకు దూరంగా ఉన్న ఇషా.. ఇప్పుడిప్పుడే సినిమాలు, వెబ్ సిరీస్ చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి: Cinema: ఇదెక్కడి సినిమా రా బాబు.. రూ.16 కోట్లు పెడితే 400 కోట్ల కలెక్షన్స్.. బాక్సాఫీస్ ఆగం చేసిన మూవీ..

ఇవి కూడా చదవండి: Actress : బాబోయ్.. సీరియల్లో తల్లి పాత్రలు.. నెట్టింట గ్లామర్ రచ్చ.. సెగలు పుట్టిస్తోన్న వయ్యారి..