Renu Desai: రాజకీయ నాయకుల గురించి రేణు దేశాయ్ షాకింగ్ పోస్ట్.. ఆలా ఎలా అనేసింది
సినిమాలకు దూరంగా ఉంటోన్న రేణూ దేశాయ్ సామాజిక సేవా కార్యక్రమాల్లో మాత్రం చురుగ్గా ఉంటున్నారు. ముఖ్యంగా మహిళలు, చిన్న పిల్లల పట్ల తన గొంతు విప్పుతుంటారు. అలాగే మూగ జీవాల పట్ల ప్రేమాభిమానులు చూపిస్తుంటారు. అలాగే పలు సామాజిక సమస్యలపై సోషల్ మీడియా వేదికగా ఇన్ స్పైరింగ్ పోస్టులు షేర్ చేస్తుంటారు.
తాజాగా ఈ అందాల తార సోషల్ మీడియాలో ఒక సంచలన పోస్ట్ పెట్టారు. అందులో ఆమె రాజకీయ నాయకులను ఘాటుగా విమర్శించారు. స్టుపిడ్ పొలిటీషియన్స్ – అంటూ రేణూ దేశాయ్ తాజాగా తన ఇన్‌స్టాలో ఓ పోస్ట్ షేర్ చేశారు. ఇప్పుడా పోస్ట్ నెట్టింట హాట్ టాపిక్ గా మారింది. రాజస్థాన్ లోని సరిస్కా టైగర్ రిజర్వ్ లో మైనింగ్ చేయాలని కొంత మంది రాజకీయ నాయకులు ప్రయత్నిస్తున్నారన్నాట. అందుకు ప్రభుత్వం కూడా వత్తాసు పలుకుతోందట. ఈ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ లో ఒకప్పుడు 3 పులులు మాత్రమే ఉండేవట. ఇప్పుడు వాటి సంఖ్య 50కు పైగా చేరిందట. అలాంటి చోట మైనింగ్ ను చేపట్టి మూగ జీవాలను ఎక్కడికి తరిమేస్తారా? లేక చంపేస్తారా? అంటూ జంతు ప్రేమికులు ఆందోళనలు చేపడుతున్నారు. ఈ క్రమంలోనే రేణూ దేశాయ్ కూడా ఇదే అంశంపై కొంచెం ఘాటుగా స్పందించారు. ఈ మేరకు ఇన్ స్టా గ్రామ్ స్టోరీస్ లో ఒక పోస్ట్ పెట్టారు. ‘ఈ రాజకీయ నాయకులను చూస్తుంటే నిజంగా స్టుపిడ్స్ అనిపిస్తుంటుంది. చివరకు వన్య మృగాలను చంపే వరకు కూడా వీళ్లు ఆగేలా కనిపించడం లేదు. చివరి చెట్టును నరికే వరకు నిద్రపోయేలా కనిపించడం లేదు. ఆ పొలిటీషియన్లకు కూడా కొడుకులు, కూతుర్లు, మనవళ్లు, మనవరాళ్లు ఉన్నారని తెలియదా? వారు కూడా ఇదే భూమ్మీద జీవించాల్సి ఉంటుందన్న విషయం అర్థం కావడం లేదా? ‘ అని ఘాటుగా రియాక్ట్ అయ్యారు రేణూ దేశాయ్. ప్రస్తుతం ఈ నటి షేర్ చేసిన పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
OTT ఆశలపై నీళ్లు చల్లిన ప్రొడ్యూసర్.. సక్కగా థియేటర్‌కు నడవాల్సిందే ఇక!
తను చదివించిన డాక్టర్లను చూసి స్టేజ్‌పైనే కన్నీళ్లు పెట్టుకున్న స్టార్ హీరో
Cryonics: మీరు చచ్చినా.. మేం చావనివ్వం..! మళ్ళీ బ్రతికిస్తాం.. కానీ..
ఇక.. 2 గంటల్లోనే హైదరాబాద్ టు విజయవాడ
ఐటీ ఉద్యోగుల్లో తీవ్ర అనారోగ్య సమస్యలు.. 84 % మందికి ఆ డిసీజ్
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్‌గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం

