న్యాయపోరాటంలో గెలిచా.. కానీ అమ్మను కోల్పోయా.. కన్నీళ్లు పెట్టుకున్న హేమ
క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా తనకంటూ మంచి క్రేజ్ తెచ్చుకున్న నటి హేమ. హేమ తన నటనతో టాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఆమె చాలా సినిమాలు చేసి మెప్పించారు. ముఖ్యంగా ప్రముఖ కమెడియన్ బ్రహ్మనందం కాంబినేషన్‌లో ఆమె చేసే సినిమాల్లోని సీన్స్ విపరీతంగా ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

వెంకటేష్ క్షణ క్షణం సినిమా నుంచి మొన్నటి దాకా సినిమాలు చేస్తూనే ఉందీ అందాల తార హేమ. దాదాపు 250కు పైగా సినిమాల్లో లేడీ కమెడియన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా అద్భుతంగా నటించింది హేమ. అయితే సినిమాలతో పాటు వివాదాల్లోనూ హేమ పేరు తరచూ వినిపించింది. ముఖ్యంగా మా ఎలక్షన్స్ సమయంలో హేమ ప్రెస్ మీట్స్‌తో హొరెత్తిస్తుంది. తోటీ నటీనటుల గురించి సంచలన కామెంట్స్, ఆరోపణలు చేసింది. ఇక గతేడాది సంచలనం సృష్టించిన బెంగళూరు రేవ్ పార్టీ హేమ ఇమేజ్ ను డ్యామేజ్ చేసిందని చెప్పుకోవచ్చు. ఈ పార్టీలో హేమ పాల్గొందని, డ్రగ్స్ కూడా తీసుకుందని ఆరోపణలు వచ్చాయి.
ఇక ఇప్పుడు హేమ సినిమాలకు దూరంగా ఉంటున్నారు. ఇదిలా ఉంటే బెంగళూరు రేవ్ పార్టీ కేసులో నటి హేమకు ఊరట లభించింది. రేవు పార్టీ కేసు కోర్టు వరకు వెళ్లింది హేమ. అయితే, ఆ రేవు పార్టీలో తాను లేనని, అనవసరంగా తనను ఇరికించారని హేమ పలు సందర్భాల్లో చెప్పుకొచ్చారు. తాజాగా హేమ ఇంట విషాదం చోటు చేసుకుంది. హేమ తల్లి ఇటీవలే కన్నుమూశారు. అనారోగ్యం కారణంగా హేమ తల్లి కన్నుమూశారు. ఇదిలా ఉంటే తాజాగా హేమపై నమోదైన కేసును కర్ణాటక హైకోర్టు పూర్తిగా కొట్టివేసింది.
దాంతో న్యాయం గెలిచింది అంటూ హేమ కన్నీళ్లు పెట్టుకున్నారు. ఈ న్యాయపోరాటంలో గెలిచినా.. నా జీవితంలో తీరని విషాదం మిగిలిపోయిందని హేమ ఎమోషనల్ అయ్యింది. ఈ కేసు కారణంగా తన పై జరిగిన ట్రోలింగ్ కారణంగా తన తల్లి అనారోగ్యం బారిన పడిందని ఆ బాధతోనే తన తల్లి మరణించారని హేమ కన్నీళ్లు పెట్టుకుంది. “ఫేక్ న్యూస్, ట్రోలింగ్ మా అమ్మను చంపేశాయి. నాపై వచ్చిన నిందలను ఆమె తట్టుకోలేకపోయారు. తీవ్ర మనస్తాపానికి గురై స్ట్రోక్‌తో చనిపోయారు” అంటూ కన్నీటి పర్యంతం అయ్యింది హేమ.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




