AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Anushka Shetty: ఆ అరుదైన వ్యాధి ఉందంటోన్న అనుష్క.. ఇక షూటింగ్‌ ఆపేయాల్సిందేనంటూ షాకింగ్‌ కామెంట్స్‌

ఇటీవల స్టార్‌ హీరోయిన్లు సమంత, మమతమోహన్‌దాస్‌, శ్రుతిహాసన్‌ తమకున్న హెల్త్‌ ఇష్యూస్‌ను బయటపెట్టి షాక్ ఇచ్చారు. అలాగే తాను గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతున్నట్లు సోషల్‌ మీడియా వేదికగా ప్రకటించి షాక్‌ ఇచ్చింది సీనియర్‌ నటి, పవన్‌ కల్యాణ్‌ మాజీ భార్య రేణు దేశాయ్‌.

Anushka Shetty: ఆ అరుదైన వ్యాధి ఉందంటోన్న అనుష్క.. ఇక షూటింగ్‌ ఆపేయాల్సిందేనంటూ షాకింగ్‌ కామెంట్స్‌
Actress Anushka
Basha Shek
|

Updated on: Feb 14, 2023 | 5:43 PM

Share

సిల్వర్‌ స్ర్కీన్‌పై తమ అందం, అభినయంతో అలరిస్తోన్న సినిమా తారలు వరుసగా అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు. ఇటీవల స్టార్‌ హీరోయిన్లు సమంత, మమతమోహన్‌దాస్‌, శ్రుతిహాసన్‌ తమకున్న హెల్త్‌ ఇష్యూస్‌ను బయటపెట్టి షాక్ ఇచ్చారు. అలాగే తాను గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతున్నట్లు సోషల్‌ మీడియా వేదికగా ప్రకటించి షాక్‌ ఇచ్చింది సీనియర్‌ నటి, పవన్‌ కల్యాణ్‌ మాజీ భార్య రేణు దేశాయ్‌. ఇప్పుడీ జాబితాలోకి మరో స్టార్‌ హీరోయిన్‌ చేరింది. ఆమె మరెవరో కాదు అభిమానుల మదిలో స్వీటీగా గుర్తింపు తెచ్చుకున్న అందాల తార  అనుష్కాశెట్టి. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆమె తాను ఓ వింత వ్యాధితో బాధపడుతున్నట్లు బయటపెట్టింది. ఒకసారి నవ్వడం స్టార్ట్‌ చేస్తే ఏకధాటిగా 15 నుంచి 20 నిమిషాల పాటు నవ్వుతూనే ఉంటానంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.

షూటింగ్‌కి ప్యాకప్‌ చెప్పాల్సిందే..

‘నవ్వించే సంఘటన వస్తే పడి పడి నవ్వుతూనే ఉంటాను. అసలు నవ్వుని కంట్రోల్‌ చేసుకోలేను. ఇక షూటింగ్‌ సెట్‌లో నేను నవ్వడం స్టార్ట్‌ చేస్తే ఇక షూటింగ్‌ ప్యాకప్‌ చేసుకోవాల్సిందే. ఒకసారి నవ్వడం ప్రారంభిస్తే సుమారు 15 నుంచి 20 నిమిషాల పాటు నవ్వుతూనే ఉంటాను. ఈ గ్యాప్‌లో ప్రొడక్షన్‌ వాళ్లు టిఫిన్స్‌, స్నాక్స్‌ లాంటివి కంప్లీట్‌ చేసుకుని వస్తారు’ అని తనకున్న అరుదైన వ్యాధి గురించి చెప్పుకొచ్చింది అనుష్క. కాగా అనుష్క ఇది సీరియస్ గా చెప్పుకొచ్చిందా? లేక సరదాగా చెప్పుకొచ్చిందా? అనే విషయంపై మాత్రం క్లారిటీ లేదు. అయితే ‘నవ్వడం ఆరోగ్యానికి మంచిదేగా స్వీటీ. నువ్వు ఎంత సేపు నవ్వినా మాకు ఆనందమే’ అని కామెంట్లు చేస్తున్నారు. ఇక సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం నవీన్‌ పొలిశెట్టితో కలిసి ఓ ప్రేమకథా చిత్రంలో నటిస్తోంది అనుష్క. మైత్రి మూవీ ప్రొడక్షన్స్‌ బ్యానర్‌లో ఈ సినిమా తెరకెక్కనుంది. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు బయటకు రానున్నాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధర పెరిగిందా? తగ్గిందా?తాజా రేట్లు ఇవే
తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధర పెరిగిందా? తగ్గిందా?తాజా రేట్లు ఇవే
ఎప్పుడూ తిండి గోలేనా? ఈ వ్యాధి ఉందేమో చెక్ చేసుకోండి?
ఎప్పుడూ తిండి గోలేనా? ఈ వ్యాధి ఉందేమో చెక్ చేసుకోండి?
హిందుస్థాన్‌ ఏరోనాటిక్స్‌లో ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ 2025 విడుదల
హిందుస్థాన్‌ ఏరోనాటిక్స్‌లో ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ 2025 విడుదల
మీరు కొన్న గుడ్లు తాజాగా ఉన్నాయో.. కుళ్లిపోయాయో తెలుసుకోవాలా?
మీరు కొన్న గుడ్లు తాజాగా ఉన్నాయో.. కుళ్లిపోయాయో తెలుసుకోవాలా?
మీకూ ఉదయం నిద్ర లేచిన వెంటనే తలనొప్పి వస్తుందా?
మీకూ ఉదయం నిద్ర లేచిన వెంటనే తలనొప్పి వస్తుందా?
Horoscope Today: పట్టుదలతో వారు అనుకున్నది పూర్తిచేస్తారు..
Horoscope Today: పట్టుదలతో వారు అనుకున్నది పూర్తిచేస్తారు..
దశాబ్దాల నిరీక్షణకు తెరదించుతూ సిరీస్ కైవసం చేసుకున్న టీమిండియా
దశాబ్దాల నిరీక్షణకు తెరదించుతూ సిరీస్ కైవసం చేసుకున్న టీమిండియా
సీఎం పదవిపై ఎలాంటి సీక్రెట్‌ డీల్‌ లేదు..!
సీఎం పదవిపై ఎలాంటి సీక్రెట్‌ డీల్‌ లేదు..!
కన్నడ స్టార్ కిచ్చా సుదీప్ కూతురిని చూశారా? తండ్రి సినిమా కోసం..
కన్నడ స్టార్ కిచ్చా సుదీప్ కూతురిని చూశారా? తండ్రి సినిమా కోసం..
ఓ వైపు ఏలియన్స్‌, మరో వైపు ముంచుకొస్తున్న AI ..దడ పుట్టిస్తున్న
ఓ వైపు ఏలియన్స్‌, మరో వైపు ముంచుకొస్తున్న AI ..దడ పుట్టిస్తున్న