Lucky Lakshman OTT: ఓటీటీలోకి సొహెల్ ‘లక్కీ లక్ష్మణ్’.. స్ట్రీమింగ్ ఎప్పుడు, ఎక్కడంటే?
బిగ్ బాస్ షోతో మంచి గుర్తింపు తెచ్చుకున్న నటుల్లో సొహైల్ ఒకరు. హౌస్‌లో తన ఆటతీరుతో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్న ఈ ట్యాలెంటెడ్ యాక్టర్ షో నుంచి బయటకు వచ్చాక హీరోగా మంచి ఛాన్సులు పొందాడు.
బిగ్ బాస్ షోతో మంచి గుర్తింపు తెచ్చుకున్న నటుల్లో సొహైల్ ఒకరు. హౌస్‌లో తన ఆటతీరుతో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్న ఈ ట్యాలెంటెడ్ యాక్టర్ షో నుంచి బయటకు వచ్చాక హీరోగా మంచి ఛాన్సులు పొందాడు. అలా అతను హీరోగా నటించి, గతేడాది ఆఖరులో విడుదలైన చిత్రం ‘లక్కీలక్ష్మణ్’. ఎ.ఆర్. అభి డైరెక్షన్‌లో తెరకెక్కిన ఈ సినిమాలో మోక్ష హీరోయిన్‌గా నటించింది. . దేవీ ప్రసాద్, రాజా రవీంద్ర, సమీర్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. కొత్త సంవత్సరం కానుకగా డిసెంబర్ 30న విడుదలైన ఈ ఫన్నీ ఎంటర్‌టైనర్ యావరేజ్ టాక్‌తో సరిపెట్టుకుంది. అయితే సొహెల్ నటన, సినిమాలో కామెడీ సీన్లు చాలామందిని ఆకట్టుకున్నాయి. ఈనేపథ్యంలో లక్కీ లక్ష్మణ్ ఓటీటీ ఎంట్రీ కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పుడీ నిరక్షణకు తెరపడింది. ఇప్పుడు ఈ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్‌కు సిద్ధమైపోయింది. లక్కీ లక్ష్మణ్ డిజిటల్ రైట్స్‌ను ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఆహా సొంతం చేసుకుంది.
లక్కీ లక్ష్మణ్ సినిమా ఫిబ్రవరి 17 నుంచి ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. ‘జీవితంలో తగిలిన ఎదురుదెబ్బలతో సక్సెస్‌ఫుల్‌గా మారిన ఒక లక్ష్మణుడి కథ’ అని ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు ఆహా మేకర్స్. కాగా ఇదే రోజున సుడిగాలి సుధీర్ గాలోడు, సంతోష్ శోభన్ కల్యాణం కమీనయం సినిమాలు కూడా ఆహాలో విడుదల కానున్నాయి. సో.. ఈ వారం ఆహా వీక్షకులకు పండగే పండగ.
Jeevitham lo thagilina eduru debbalatho successful ga marina oka lakshmanudi katha #LuckyLakshmanOnAHA Premieres Feb 17th.@Ryansohel @Mokksha06 @DattatreyaMedia@GogineniHaritha @Anuprubens @PrawinPudi@iandrewdop @tipsmusicsouth pic.twitter.com/1Gr46fgds0
— ahavideoin (@ahavideoIN) February 14, 2023
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..