Rashmika Mandanna: వాలంటైన్స్ డే సందర్భంగా ఆసక్తికర పోస్ట్ షేర్ చేసిన రష్మిక..

చలో సినిమాతో పరిచయం అయ్యింది. ఆ తర్వాత గీతగోవిందం సినిమా తో మంచి విజయాన్ని అందుకుంది. ఇక ఈ సినిమా తర్వాత రష్మిక తెలుగులో బిజీ హీరోయిన్ గా మారిపోయింది.

Rashmika Mandanna: వాలంటైన్స్ డే సందర్భంగా ఆసక్తికర పోస్ట్ షేర్ చేసిన రష్మిక..
Rashmika Mandanna
Follow us
Rajeev Rayala

|

Updated on: Feb 14, 2023 | 7:55 PM

రష్మిక మందన్న.. ప్రస్తుతం ఈ అమ్మడికి పాన్ ఇండియా స్టార్ డమ్ ఉంది. కన్నడ ఇండస్ట్రీ నుంచి వచ్చిన ఈ భామ ఇప్పుడు టాలీవుడ్ లో టాప్ ప్లేస్ లో కంటిన్యూ అవుతోంది. కన్నడ ఇండస్త్రీనుంచి తెలుగులోకి అడుగుపెట్టిన ఈ భామ ఇప్పుడు పాన్ ఇండియా హీరోయిన్ గా మారిపోయింది. కిరాక్ పార్టీ సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది రష్మిక. ఆ తర్వాత తెలుగులో చలో సినిమాతో పరిచయం అయ్యింది. ఆ తర్వాత గీతగోవిందం సినిమా తో మంచి విజయాన్ని అందుకుంది. ఇక ఈ సినిమా తర్వాత రష్మిక తెలుగులో బిజీ హీరోయిన్ గా మారిపోయింది. తెలుగుతో పాటు హిందీ, తమిళ్ సినిమాల్లోనూ నటిస్తూ అలరిస్తోంది ఈ బ్యూటీ. ఇటీవలే పుష్ప సినిమాతో పాన్ ఇండియా హీరోయిన్ గా మారిపోయింది. అయితే రష్మిక అందానికి, అభినయానికి పడిపోని కుర్రకారు ఉండరు అనడంలో అతిశయోక్తి లేదనే చెప్పాలి.

తాజాగా ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో షేర్ చేసిన వీడియో వైరల్ అవుతోంది. వాలెంటెన్స్ డే సందర్భంగా రష్మిక ఒక ఆసక్తికర పోస్ట్ చేసింది. రష్మిక మందన్న ఇప్పటికే రిలేషన్ లో ఉందని రూమర్లు చక్కర్లు కొడుతోన్న విషయం తెలిసిందే. క్రేజీ హీరో విజయ్ దేవరకొండతో లవ్ లో ఉంది అంటూ టాక్ వినిపించింది.

ఈ వార్తల్లో నిజం లేదని ఇద్దరం మంచి ఫ్రెండ్స్ అని తేల్చి చెప్పింది రష్మిక. కాగా ఇప్పుడు వాలెంటైన్స్ డే సందర్భంగా.. తన పెట్ డాగ్ తో బెడ్ పైన ఆటలాడుతోన్న వీడియో షేర్ చేసి వాలంటైన్స్ డే విషెస్ చెప్పింది. ఇప్పుడు ఈ ఆసక్తికర పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.