Karthikeya 2: కార్తికేయ 2 విడుదలకు రంగం సిద్ధం.. అనుపమ క్లోజ్.. నిఖిల్ స్టార్ట్.
గతంలో సూపర్ హిట్ అయిన కార్తికేయ సినిమాకు సిక్వెల్గా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు డైరెక్టర్ చందు మోండేటి. ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ చేసుకొని రిలీజ్ కు రెడీగా ఉన్న
యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో నిఖిల్ సిద్దార్థ్ (Nikhil Siddharth), మలయాళ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్ (Anupama) జంటగా నటిస్తోన్న చిత్రం కార్తికేయ 2 (Karthikeya 2). గతంలో సూపర్ హిట్ అయిన కార్తికేయ సినిమాకు సిక్వెల్గా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు డైరెక్టర్ చందు మోండేటి. ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ చేసుకొని రిలీజ్ కు రెడీగా ఉన్న ఈ మూవీ ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ చిత్రాన్ని 2022 జూలై 22న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నారు. తెలుగుతోపాటు.. హిందీ, మలయాళం, తమిళ్, కన్నడ భాషల్లో ఈ సినిమా విడుదల కానుంది. ప్రస్తుతం ఈ మూవీ డబ్బింగ్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి.
తాజాగా ఈ సినిమా తన పాత్ర మలయాళం డబ్బింగ్ పనులను పూర్తిచేసింది అనుపమ. ఈ విషయాన్ని తన ఇన్ స్టా స్టోరీ ద్వారా తెలియజేసింది. ఇక అలాగే.. మరోవైపు నిఖిల్ తన పాత్రకు హిందీ వెర్షన్ డబ్బింగ్ చెప్పడం స్టార్ట్ చేశారు. హిందీ డబ్బింగ్ ఇన్ ప్రోగ్రేస్ అంటూ నిఖిల్ తన ట్విట్టర్ ఖాతా ద్వారా తెలియజేశారు. ఇక ఎవరికీ వారు కార్తీకేయ 2 సినిమా డబ్బింగ్ పనులను వీలైనంత త్వరగా కంప్లీట్ చేస్తేందుకు కాస్త ఎక్కువగానే కష్టపడుతున్నట్లుగా తెలుస్తోంది.
ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ ఇందులో కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వా్ల్ ఆర్ట్స్ బ్యానర్లపై టీజీ విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన ట్రైలర్, పోస్టర్స్ మరింత ఆసక్తిని క్రియేట్ చేసింది.
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.