Anjali Nair: పెళ్లైన ఐదునెలలకే బిడ్డకు జన్మనించిన నటి.. షాక్ అవుతోన్న ఫ్యాన్స్
ఇటీవల సినిమా తరాల వైవాహిక జీవితాలు భలే విచిత్రంగా ఉంటున్నాయి. కొన్నాళ్ళు ప్రేమ అంటున్నారు, మరికొన్ని రాజులు సహజీవనం అంటున్న.. ఆ తర్వాత పెళ్లి, ఆ వెంటనే విడాకులు.. మళ్ళీ రెండో పెళ్లి.. ఇలా చిత్రవిచిత్రంగా ఉంటున్నాయి.
ఇటీవల సినిమా తరాల వైవాహిక జీవితాలు భలే విచిత్రంగా ఉంటున్నాయి. కొన్నాళ్ళు ప్రేమ అంటున్నారు, మరికొన్ని రాజులు సహజీవనం అంటున్న.. ఆ తర్వాత పెళ్లి, ఆ వెంటనే విడాకులు.. మళ్ళీ రెండో పెళ్లి.. ఇలా చిత్రవిచిత్రంగా ఉంటున్నాయి. ఇప్పటికే చాలా మంది సినిమా తారలు పెళ్ళై విడాకులు తీసుకొని మరో పెళ్లి చేసుకున్నవాళ్ళు ఉన్నారు. ఆ మధ్య నటి వనితా విజయ్ కుమార్ ఏకంగా నాలుగు పెళ్లిళ్లు చేసుకొని పెద్ద చర్చకే తెరలేప్పింది. వనిత మాత్రమే కాదు ఇలా చాలా మంది పెళ్ళాడి విడాకులు తీసుకున్న వారు చాలా మంది ఉన్నారు. ఇక రెండో పెళ్లి చేసుకొని జీవితాన్ని ఎంజాయ్ చేస్తున్న వారు కూడా చాలా మంది ఉన్నారు. తాజాగా ఓ హీరోయిన్ పెళ్లైన 5 నెలలకే పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. అదికూడా ఆ అమ్మడికి రెండో పెళ్లి కావడం విశేషం..
అంజలి నాయర్.. చాలా సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించి ఆకట్టుకుంది ఈ చిన్నది. ఆ తర్వాత చాలా సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించి మెప్పించింది. అలాగే రీసెంట్ గా వచ్చిన సూపర్ స్టార్ రజినీకాంత్ అన్నత్తే (పెద్దన్న) సినిమాలో రజినీకాంత్ సిస్టర్ గా నటించింది. తమిళ్ మలయాళ భాషల్లో పలు సినిమాల్లో నటించిన అంజలి. ఇటీవలే రెండో పెళ్లి చేసుకుంది. అంజలి ఫిబ్రవరిలో పెళ్లి చేసుకుంది. పెళ్ళైన ఐదు నెలలకే ఈ అమ్మడు ఆడ బిడ్డకు జన్మనిచ్చింది. దాంతో అందరు షాక్ అవుతున్నారు. అంజలి మలయాళీ ఫిల్మ్ మేకర్ అనీష్ ఉపాసన మొదట వివాహం చేసుకుంది. ఆతర్వాత మనస్పర్ధల కారణంగా విడిపోయారు. వీరికి ఒక కూతురు కూడా ఉంది. ఆ తర్వాత అసిస్టెంట్ డైరెక్టర్ అజిత్ రాజుతో ప్రేమలో పడి పెళ్లాడింది.