AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అబ్బో.. ఆ దర్శకుడు మామూలోడు కాదు..! షూటింగ్‌లో నా వల్ల కాలేదు.. హీరోయిన్ షాకింగ్ కామెంట్స్

కోలీవుడ్ లో ఉన్న ప్రముఖ దర్శకుల్లో సెల్వరాఘవన్ ఒకరు. ఎన్నో సూపర్ హిట్ సినిమాలను తెరకెక్కించి మంచి పేరు తెచ్చుకున్నాడు ఈ దర్శకుడు. 7G బృందావన్ కాలనీలాంటి లవ్ స్టోరీ తెరకెక్కించి సెన్సేషన్ క్రియేట్ చేశారు సెల్వరాఘవన్. ఈ సీమ తమిళ్ లో తెరకెక్కిన ఈ సినిమా తెలుగులో డబ్ అయ్యింది.

అబ్బో.. ఆ దర్శకుడు మామూలోడు కాదు..! షూటింగ్‌లో నా వల్ల కాలేదు.. హీరోయిన్ షాకింగ్ కామెంట్స్
Selvaraghavan
Rajeev Rayala
|

Updated on: Apr 03, 2026 | 11:03 AM

Share

తమిళ్ ఇండస్ట్రీలోనే కాదు తెలుగులో దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు దర్శకుడు సెల్వరాఘవన్. ఆయన దర్శకత్వంలో తెరకెక్కిన సినిమాలు తెలుగులోనూ డబ్ అయ్యి మంచి విజయాలను సాధించిన విషయం తెలిసిందే. ముఖ్యంగా 7/జీ బృందావన్ కాలనీ సినిమా ఎంతో పెద్ద హిట్ అయ్యిందో అందరికి తెలిసిందే. ఈ సినిమా తమిళ్ తోపాటు తెలుగులోనూ మంచి విజయాన్ని అందుకుంది. అలాగే ఆయన దర్శకత్వంలో వచ్చిన యుగానికొక్కడు . కార్తీ హీరోగా నటించిన ఈ సినిమా పెద్ద హిట్ గా నిలిచింది. కాగా తెలుగులో వెంకటేష్ తో కలిసి  ఆడవాళ్ళ మాటలకూ అర్ధాలే వేరులే సినిమాతో మరో సూపర్ హిట్ అందుకున్నారు సెల్వరాఘవన్. కొన్ని సైన్స్ ఫిక్షన్ సినిమాలు కూడా తీశాడు. సెల్వరాఘవన్ సినిమాలు చాలా డిఫరెంట్ గా ఉంటాయి. ఇదిలా ఉంటే సెల్వ రాఘవన్ పై ఓ హీరోయిన్ షాకింగ్ కామెంట్స్ చేసింది.

ప్రస్తుతం యుగానికొక్కడు సినిమా సీక్వెల్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాడు సెల్వ రాఘవన్. ఈ సినిమా పనుల్లో బిజీగా ఉన్నాడు సెల్వ. అయితే ఈ సినిమా మొదటి భాగంలో నటించిన ఆండ్రియా జెరెమియా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. దాదాపు 2 దశాబ్దాలుగా సినీరంగంలో చురుగ్గా ఉన్న హీరోయిన్ ఆండ్రియా జెరెమియా. ఇప్పటివరకు తెలుగు, తమిళం, మలయాళం భాషలలో అనేక హిట్ చిత్రాల్లో నటించారు. అయినప్పటికీ ఎలాంటి గుర్తింపు రాలేదు. నటిగానే కాకుండా ఆమె మంచి సింగర్ సైతం. హస్కీ వాయిస్ తో ఎన్నో పాటలు పాడి అలరించింది.

ప్రస్తుతం ఆమె రెహమాన్ టీంలో సింగర్ గా సెటిల్ అయ్యింది. అలాగే అప్పుడప్పుడు సినిమాల్లోనూ నటిస్తుంది. తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో యుగానికొక్కడు సినిమా సీక్వెల్ గురించి మాట్లాడుతూ.. నేను ఆ సీక్వెల్‌లో నటించను.. అది జరిగే పనే కాదు ఆయన చెప్పే టైమింగ్‌కు, షూటింగ్ లో చేసే పనికి అస్సలు సంబంధం ఉండదు. గతంలో షూటింగ్ సమయంలో నేను పడ్డ ఇబ్బందులు చాలా ఉన్నాయి. మళ్ళీ ఆయనతో సినిమా చేయడం నా వల్ల కాదు అంటూ చెప్పుకొచ్చింది. ఈ కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
ఇరాన్‌పై బాంబు దాడులు నిలిపివేత.. ట్రంప్ నిర్ణయం వెనుక అసలు కారణం
ఇరాన్‌పై బాంబు దాడులు నిలిపివేత.. ట్రంప్ నిర్ణయం వెనుక అసలు కారణం
జన్మ నక్షత్రం వల్లే పిల్లలు టాపర్లవుతారా? అసలు నిజం తెలుసుకోండి!
జన్మ నక్షత్రం వల్లే పిల్లలు టాపర్లవుతారా? అసలు నిజం తెలుసుకోండి!
వజ్రం మీకు అదృష్టమా? దురదృష్టమా? ఏ రాశుల వారికి శుభం, ఎవరు దూరంగా
వజ్రం మీకు అదృష్టమా? దురదృష్టమా? ఏ రాశుల వారికి శుభం, ఎవరు దూరంగా
ప్రధాని మోదీతో సీఎం రేవంత్ రెడ్డి కీలక భేటీ
ప్రధాని మోదీతో సీఎం రేవంత్ రెడ్డి కీలక భేటీ
ఐఆర్‌సీటీసీ కొత్త వెబ్‌సైట్ ప్రారంభం.. ముహూర్తం ఫిక్స్
ఐఆర్‌సీటీసీ కొత్త వెబ్‌సైట్ ప్రారంభం.. ముహూర్తం ఫిక్స్
ఎరుపెక్కిన మిడిలీస్ట్.. సామాన్యుడిపై మళ్లీ యుద్ధ పంజా!
ఎరుపెక్కిన మిడిలీస్ట్.. సామాన్యుడిపై మళ్లీ యుద్ధ పంజా!
రేపే శుక్ర ప్రదోష వ్రతం.. ఈ 6 పొరపాట్లు చేస్తే శివుని అనుగ్రహం..
రేపే శుక్ర ప్రదోష వ్రతం.. ఈ 6 పొరపాట్లు చేస్తే శివుని అనుగ్రహం..
పట్టీలు,గొలుసులు నల్లగా మారాయా? ఇలా క్షణాల్లో కత్తగా మార్చండి
పట్టీలు,గొలుసులు నల్లగా మారాయా? ఇలా క్షణాల్లో కత్తగా మార్చండి
జూన్ నుంచి అమల్లోకి వచ్చిన కొత్త నిబంధనలు ఇవే..
జూన్ నుంచి అమల్లోకి వచ్చిన కొత్త నిబంధనలు ఇవే..
నీతి ఆయోగ్‌ సమావేశంలో ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు
నీతి ఆయోగ్‌ సమావేశంలో ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు