Amy Jackson : పండంటి బిడ్డకు జన్మనిచ్చిన అమీ జాక్సన్.. ఏం పేరు పెట్టారో తెలిస్తే షాక్ అవుతారు..
టాలీవుడ్ ప్రముఖ హీరోయిన్ గుడ్ న్యూస్ చెప్పింది. పండంటి బిడ్డకు జన్మనిచ్చినట్టు సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. ఈ సందర్భంగా ఆమె షేర్ చేసిన ఫొటోలు ఇప్పుడు నెట్టింట వైరలవుతున్నాయి. నెటిజన్లు ఈ అమ్మడికి కంగ్రాట్స్ చెప్తూ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. అలాగే తమ బిడ్డకు ఏం పేరు పెట్టారో తెలుసా.?

అమీ జాక్సన్.. బ్రిటన్ కు చెందిన ఈ హీరోయిన్ తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితమే. ఈ బ్యూటీ పండంటి బిడ్డకు జన్మనించింది. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన ఎవడు చిత్రంలో సెకెండ్ హీరోయిన్ గా నటించింది ఈ భామ. అలాగే విక్రమ్ హీరోగా శంకర్ తెరకెక్కించిన ఐ సినిమాలో మెయిన్ హీరోయిన్ గా ఆకట్టుకుంది. వీటితో పాటు పలు తమిళ్, హిందీ సినిమాల్లోనూ నటించి మెప్పించిందీ అందాల తార. అయితే ఇప్పుడు ఈ బ్రిటిష్ నటి విదేశాల్లో స్థిరపడింది. అమీ జాక్సన్ 2015 నుండి 2021 వరకు హోటల్ వ్యాపారి జార్జ్ పనాయోటౌతో రిలేషన్‌షిప్ కొనసాగించింది. 2019లో నిశ్చితార్థం చేసుకున్నారు. అయితే అదే సంవత్సరం అమీ ఒక ఆడబిడ్డను ప్రసవించింది. అప్పటికింకా వారికి పెళ్లి కాలేదు. కానీ 2021లో అమీ, జార్జ్ మనస్పర్థల కారణంగా విడిపోయారు.
ఇది కూడా చదవండి : బ్యాడ్ లక్ బ్యూటీ..! పుష్పలో సమంత సాంగ్ ఈ అమ్మడే చేయాలంట.. కానీ మిస్ అయ్యింది
ఆ తర్వాత ఆమె ఆంగ్ల నటుడు ఎడ్ వెస్ట్‌విక్‌తో డేటింగ్ ప్రారంభించింది. గతేడాది ఆగస్టులో పెళ్లి కూడా చేసుకుంది. ఆ తర్వాత అక్టోబర్‌లో తాను మరోసారి గర్భం ధరించినట్లు ప్రకటించింది అమీ. అప్పటి నుంచి సోషల్ మీడియాలో బేబీ బంప్ ఫోటోలు షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటుంది. ఏకంగా బికినీలో తన బేబీ బంప్‌ని చూపిస్తూ కొత్త ఫోటోలను షేర్ చేసిందీ అందాల తార. పూల్ ముందు నగ్నంగా నిలబడిన ఫొటోలు కూడా షేర్ చేసిన అమీ జాక్సన్..
ఇది కూడా చదవండి :టాలీవుడ్ విలన్ భార్య జోరు.. ఒకొక్క సినిమాకు కోట్లల్లో రెమ్యునరేషన్.. ఆమె ఎవరంటే
ఇక ఇప్పుడు పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్నీ సోషల్ మీడియా వేదికగా తెలిపింది అమీ జాక్సన్. తనకు కొడుకు పుట్టాడని వెల్లడిస్తూ తన భర్త, కొడుకుతో తీసుకున్న ఫొటోను షేర్ చేసింది. అలాగే తన కొడుకుకు పేరు కూడా పెట్టినట్టు తెలిపింది. తమ కొడుకుకు ఆస్కార్ అలెగ్జాండర్ వెస్ట్‌విక్ అనే పేరు పెట్టినట్టు తెలిపింది అమీ జాక్సన్. ఇప్పుడు ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అభిమానులు అమీ జాక్సన్ కు కంగ్రాట్స్ చెప్తూ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు.
ఇది కూడా చదవండి :మూడు సినిమాలు చేస్తే ఒకే ఒక బ్లాక్ బస్టర్.. కానీ క్రేజ్ మాత్రం స్టార్ హీరోయిన్స్‌కు తీసిపోదు..
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.