Amala Paul: అప్పుడే మాజీ ప్రియుడిని అమలా పాల్ రహస్యంగా పెళ్లి చేసుకుందా ?..
ఈ కేసులో భాగంగా నాలుగు ప్రత్యేక బృందాలు విచారణ జరుపుతున్నాయి. తాజాగా ఈ కేసులో తనకు బెయిల్ మంజూరు చేయాలంటూ భవనీందర్ సింగ్ కోర్టును ఆశ్రయించారు.
హీరోయిన్ అమలాపాల్ (Amala Paul).. సినిమాల కంటే ఎక్కువగా వివాదాలతోనే వార్తల్లో నిలుస్తుంది. కొద్ది రోజుల క్రితం తనను మాజీ ప్రియుడు భవనీందర్ సింగ్ వేధిస్తున్నాడంటూ పోలీసులను ఆశ్రయించిన సంగతి తెలిసిందే. దీంతో అతడిని విల్లుపురం జిల్లా క్రైం బ్రాంచ్ పోలీసులు అరెస్ట్ చేశారు. తనను మోసం చేశాడని.. తన వ్యక్తిగత ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తానని బెదిరిస్తున్నాడంటూ విల్లుపురం పోలీసులకు ఫిర్యాదు చేసింది అమలాపాల్. దీంతో అతడితోపాటు మరో 12 మందిపై కూడా చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొంది. ఈ క్రమంలోనే ఆగస్ట్ 22న భవనీందర్ సింగ్ దత్‌ను తోపాటు మరో 11 మందిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. వీరిని వానూరు కోర్టులో హాజరుపరిచి విల్లుపురం సమీపంలోని వేదంపట్టు జైలులో ఉంచారు. ఈ కేసులో భాగంగా నాలుగు ప్రత్యేక బృందాలు విచారణ జరుపుతున్నాయి. తాజాగా ఈ కేసులో తనకు బెయిల్ మంజూరు చేయాలంటూ భవనీందర్ సింగ్ కోర్టును ఆశ్రయించారు.
హీరోయిన్ అమలాపాల్, భవనీందర్ సింగ్ 2017లో పంజాబీ ఆచారాల ప్రకారం పెళ్లిచేసుకున్నారంటూ అతని తరపు న్యాయవాది కోర్టుకు పలు ఆధారాలను సమర్పించారు. విచారణ జరిపిన అనంతరం నిందితులకు కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. 2020లో అమలాపాల్ ముంబైకి చెందిన సింగర్ భవనీందర్ సింగ్ దత్‌లో ప్రేమలో ఉన్నట్లు వార్తలు వచ్చాయి. వీరిద్దరూ పంజాబీ సంప్రదాయ దుస్తులు ధరించిన ఫోటోస్ నెట్టింట తెగ వైరల్ అయ్యాయి. అంతేకాకుండా అవే ఫోటోలను సింగర్ భవనీందర్ సైతం తన ఇన్ స్టాలో షేరే చేయడంతో వీరిద్దరికి పెళ్లి జరిగిందంటూ గతంలోనే వార్తలు వచ్చాయి. అయితే కొద్దిరోజుల తర్వాత భవనీందర్ సింగ్ అమలాపాల్ ఫోటోస్ తన సోషల్ మీడియా ఖాతా నుంచి డెలిట్ చేశారు.
ఇదిలా ఉంటే.. అమలాపాల్ గతంలో ప్రొడ్యూసర్ ఏఎల్ విజయ్ ను వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. 2014లో పెళ్లి చేసుకున్న వీరిద్దరు 2017లో విడాకులు తీసుకున్నారు. ప్రస్తుతం అమలాపాల్. డైరెక్టర్ అతిరన్ ఫేమ్ వివేక్ తెరకెక్కిస్తున్న సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రం ది టీచర్ లో నటిస్తోంది. ఇందులో మంజు పిళ్లై, చెంబర్ వినోద్ జోస్, హక్కిమ్ షా, ప్రశాంత్ మురళి, నందు కీలకపాత్రలలో నటిస్తున్నారు.
View this post on Instagram
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.