Thaman: ఒక్కఫోటోతో రెండు సినిమాల అప్డేట్స్ ఇచ్చిన తమన్.. అద్భుతమైన రోజంటూ ట్వీట్..

తాజాగా తమన్ తన ట్విట్టర్ వేదికగా ఇంట్రెస్టింగ్ పిక్ షేర్ చేశారు. ఆర్సీ15 మ్యూజిక్ రికార్డింగ్‏లో భాగంగా రామ్ చరణ్‏తో కలిసి ఉన్న ఫోటోను షేర్ చేశారు.

Thaman: ఒక్కఫోటోతో రెండు సినిమాల అప్డేట్స్ ఇచ్చిన తమన్.. అద్భుతమైన రోజంటూ ట్వీట్..
Thaman
Follow us
Rajitha Chanti

|

Updated on: Sep 08, 2022 | 4:25 PM

ఆర్ఆర్ఆర్ తర్వాత చరణ్ నటిస్తోన్న సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి. అది కూడా పాన్ ఇండియా సక్సెస్ ఫుల్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో చరణ్ సినిమా రూపొందుతుండడంతో ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఇందులో బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ కథానాయికగా నటిస్తుండగా.. శ్రీకాంత్ కీలకపాత్రలో కనిపించనున్నారు. ఇక ఈ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్ తమన్ (Thaman) సంగీతం అందిస్తున్నారు. అయితే గత కొద్దిరోజులుగా ఆర్సీ 15 సినిమా విడుదలపై పలు రూమర్స్ వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలో తాజాగా తమన్ తన ట్విట్టర్ వేదికగా ఇంట్రెస్టింగ్ పిక్ షేర్ చేశారు. ఆర్సీ15 మ్యూజిక్ రికార్డింగ్‏లో భాగంగా రామ్ చరణ్‏తో కలిసి ఉన్న ఫోటోను షేర్ చేశారు.

ఆర్సీ 15 పనిలో భాగంగా నా సోదరుడు రామ్ చరణ్‏ను కలవడం అద్భుతమైన రోజు. అలాగే గాడ్ ఫాదర్ అక్టోబర్ 5న వచ్చేస్తున్నాడు అంటూ క్యాప్షన్ ఇచ్చాడు. ఒక్క ట్వీట్‏తో రెండు సినిమాలపై అప్డేట్స్ ఇవ్వడంతో మెగా ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు. అలాగే గాడ్ ఫాదర్ రిలీజ్ వాయిదా పడనున్నట్లు వస్తున్న వార్తలపై కూడా తమన్ క్లారిటీ ఇచ్చేశాడు. ఇక డైరెక్టర్ శంకర్ తెరకెక్కిస్తు్న్న ఆర్సీ 15 పొలిటికల్ నేపథ్యంలో రాబోతున్నట్లుగా తెలుస్తోంది. ఇందులో చరణ్ ద్విపాత్రాభినయం చేయనున్నాడని.. అందులో ఒకటి విద్యార్థిగా.. మరొకటి పోలీసు అధికారిగా అని టాక్ వినపిస్తోంది. శ్రీవెంకటేశ్వర బ్యానర్ పై దిల్ రాజ్ నిర్మిస్తున్నారు. ఇవే కాకుండా చరణ్.. డైరెక్టర్ ప్రశాంత్ నీల్, దర్శకుడు గౌతమ్ తిన్ననూరితో ప్రాజెక్ట్స్ చేయనున్నట్లు తెలుస్తోంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

రూ.5 వేలు ఇన్వెస్ట్ చేస్తే చాలు.. లక్షాధికారి కావచ్చు..!
రూ.5 వేలు ఇన్వెస్ట్ చేస్తే చాలు.. లక్షాధికారి కావచ్చు..!
యూట్యూబ్‏ను షేక్ చేస్తోన్న గోదారి గట్టు సాంగ్..
యూట్యూబ్‏ను షేక్ చేస్తోన్న గోదారి గట్టు సాంగ్..
ఆ బీమా పాలసీతో ఎంతో ధీమా.. కానీ ప్రధాన తేడాలు తెలుసుకోవాల్సిందే.!
ఆ బీమా పాలసీతో ఎంతో ధీమా.. కానీ ప్రధాన తేడాలు తెలుసుకోవాల్సిందే.!
నార్త్ టాప్‌‎ 1లో బన్నీ.. టాప్ 5లో ముగ్గరు సౌత్ కెప్టెన్లు..
నార్త్ టాప్‌‎ 1లో బన్నీ.. టాప్ 5లో ముగ్గరు సౌత్ కెప్టెన్లు..
రోల్స్ రాయిస్ ఈవీ కారు విడుదల.. మొదటి కారు కొనేసిన అంబానీ
రోల్స్ రాయిస్ ఈవీ కారు విడుదల.. మొదటి కారు కొనేసిన అంబానీ
కొడుకు కెరీర్ కోసం నితీశ్ రెడ్డి తండ్రి ఏం త్యాగం చేశాడో తెలుసా?
కొడుకు కెరీర్ కోసం నితీశ్ రెడ్డి తండ్రి ఏం త్యాగం చేశాడో తెలుసా?
రైతులకు శుభవార్త.. పీఎం కిసాన్‌ 19వ విడత వచ్చేది ఎప్పుడో తెలుసా?
రైతులకు శుభవార్త.. పీఎం కిసాన్‌ 19వ విడత వచ్చేది ఎప్పుడో తెలుసా?
తెలుగబ్బాయ్ నితీష్ రెడ్డి ఆస్తులు, సంపాదన ఎంతో తెలుసా..
తెలుగబ్బాయ్ నితీష్ రెడ్డి ఆస్తులు, సంపాదన ఎంతో తెలుసా..
మహేష్ బాబు, రాజమౌళి సినిమాలో ఆ స్టార్ హీరోయిన్..
మహేష్ బాబు, రాజమౌళి సినిమాలో ఆ స్టార్ హీరోయిన్..
సెంచరీతో అదరగొట్టిన నితీష్ రెడ్డి.. సీఎం చంద్రబాబు అభినందనలు
సెంచరీతో అదరగొట్టిన నితీష్ రెడ్డి.. సీఎం చంద్రబాబు అభినందనలు