Aishwarya Lekshmi: నటుడితో ప్రేమాయణం రూమర్స్‏కు చెక్.. ఆ క్రికెటర్‏తో ప్రేమలో పడ్డానంటున్న ఐశ్వర్య లక్ష్మి..

యువ నటుడు అర్జున్ దాస్ కు తనకు మధ్య ప్రేమ వ్యవహారం నడుస్తోందనే వార్తలలో ఎలాంటి నిజం లేదని తెలిపింది. ఇద్దరూ క్లోజ్ గా ఉన్న ఫోటోలను వీరు గతంలో సోషల్ మీడియాలో షేర్ చేశారు. దీంతో వీరు ప్రేమలో ఉన్నారనే ప్రచారం జోరుగా సాగింది. ఆయితే తాము మంచి స్నేహితులం మాత్రమేనని.. అంతుకు మించి తమ మధ్య మరేమి లేదని స్పష్టం చేసింది.

Aishwarya Lekshmi: నటుడితో ప్రేమాయణం రూమర్స్‏కు చెక్.. ఆ క్రికెటర్‏తో ప్రేమలో పడ్డానంటున్న ఐశ్వర్య లక్ష్మి..
Aishwarya Lekshmi
Follow us
Rajitha Chanti

| Edited By: seoteam.veegam

Updated on: May 18, 2023 | 6:52 PM

ఐశ్వర్య లక్ష్మి.. ఇప్పుడు సౌత్ ఇండస్ట్రీలో ఎక్కువగా వినిపిస్తున్న పేరు. గాడ్సే సినిమాతో తెలుగు తెరకు పరిచయమైందీ ముద్దుగుమ్మ. అయితే ఈ మూవీ అంతగా హిట్ కాకపోవడంతో ఐశ్వర్యకు అంతగా గుర్తింపు రాలేదు. ఆ తర్వాత తెలుగులోకి డబ్ అయిన తమిళ్ చిత్రం మట్టి కుస్తీ సినిమాకు ఊహించని రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమాతో ఐశ్వర్య క్రేజ్ మారిపోయింది. దీంతో ఆమెకు దక్షిణాదిలో వరుస ఆఫర్స్ క్యూ కడుతున్నాయి. ఈ క్రమంలోనే ఇటీవల డైరెక్టర్ మణిరత్నం తెరకెక్కించిన పొన్నియన్ సెల్వన్ 2 చిత్రంలో నటించింది. డాక్టర్ వృత్తి నుంచి యాక్టర్ గా మారిన ఈ చిన్నది.. ప్రస్తుతం వరుస ఆఫర్లతో బిజీగా ఉంది. కేవలం సినిమా విషయాలే కాకుండా.. వ్యక్తిగత విషయాలతోనూ నిత్యం వార్తలలో నిలిచింది ఐశ్వర్య. గతంలో ఈ ముద్దుగుమ్మ యువ నటుడు అర్జున్ దాస్ తో ప్రేమలో ఉందనే రూమర్స్ చక్కర్లు కొట్టాయి. తాజాగా ఈ విషయంపై క్లారిటీ ఇచ్చింది ఐశ్వర్య లక్ష్మి.

యువ నటుడు అర్జున్ దాస్ కు తనకు మధ్య ప్రేమ వ్యవహారం నడుస్తోందనే వార్తలలో ఎలాంటి నిజం లేదని తెలిపింది. ఇద్దరూ క్లోజ్ గా ఉన్న ఫోటోలను వీరు గతంలో సోషల్ మీడియాలో షేర్ చేశారు. దీంతో వీరు ప్రేమలో ఉన్నారనే ప్రచారం జోరుగా సాగింది. ఆయితే తాము మంచి స్నేహితులం మాత్రమేనని.. అంతుకు మించి తమ మధ్య మరేమి లేదని స్పష్టం చేసింది. అయితే తాను టీనేజ్ లో ఉండగా.. టీమిండియా క్రికెటర్ యువరాజ్ సింగ్ తో ప్రేమలో పడ్డానని వెల్లడించింది. యూవీ అంటే తనకు పిచ్చి అంటూ మనసులోనే ఆయనను ప్రేమించేదాన్నని చెప్పుకొచ్చింది.

ఇవి కూడా చదవండి

అంతేకాకుండా.. తాను పుట్టినప్పుడు తన తండ్రి తనకు శ్రీలక్ష్మి అనే పేరు పెట్టారని.. కానీ అమ్మ మాత్రం ఐశ్వర్య అని పిలిచేదన్నారు. దీంతో చివరకు ఐశ్వర్య లక్ష్మిగా పేరు మారిందని.. నటిగా తనకు డ్రీమ్ పాత్ర అంటూ ఏమీ లేదని.. విలన్ రోల్స్ నటించడం అంటే ఇష్టం ఉండదని.. ఎప్పటికీ అలాంటి పాత్రలలో నటించకూడదని నిర్ణయించుకున్నట్లు చెప్పుకొచ్చింది.

View this post on Instagram

A post shared by Aishwarya Lekshmi (@aishu__)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

సీఎం రేవంత్ రెడ్డితో టాలీవుడ్ పెద్దల భేటీ.. దిల్ రాజు ఏమన్నారంటే
సీఎం రేవంత్ రెడ్డితో టాలీవుడ్ పెద్దల భేటీ.. దిల్ రాజు ఏమన్నారంటే
ఇటు సినిమాలు.. అటు వెకేషన్..రెండూ బ్యాలెన్స్ చేస్తున్న హీరోయిన్లు
ఇటు సినిమాలు.. అటు వెకేషన్..రెండూ బ్యాలెన్స్ చేస్తున్న హీరోయిన్లు
ఉదయం అరెస్ట్‌.. సాయంత్రం బెయిల్‌.. ఈ కేసు కీలక అప్‌డేట్స్‌
ఉదయం అరెస్ట్‌.. సాయంత్రం బెయిల్‌.. ఈ కేసు కీలక అప్‌డేట్స్‌
ఈ కొల్లాజెన్ ఫుడ్స్ తిన్నారంటే.. అందం, ఆరోగ్యం మీ సొంతం..
ఈ కొల్లాజెన్ ఫుడ్స్ తిన్నారంటే.. అందం, ఆరోగ్యం మీ సొంతం..
పాపులర్ ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లుయెన్సర్ అనుమానాస్పద మృతి
పాపులర్ ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లుయెన్సర్ అనుమానాస్పద మృతి
ఉద్యోగం కోసం వెతుకుతున్నారా..? మేనేజర్‌ పోస్ట్‌ ఖాళీ.. దరఖాస్తులు
ఉద్యోగం కోసం వెతుకుతున్నారా..? మేనేజర్‌ పోస్ట్‌ ఖాళీ.. దరఖాస్తులు
మీ కారు టైర్లు త్వరగా అగిరిపోతున్నాయా? అసలు కారణాలు ఇవే..!
మీ కారు టైర్లు త్వరగా అగిరిపోతున్నాయా? అసలు కారణాలు ఇవే..!
హలో దీదీ..మీరు సూపరహే..!ఇల్లూడ్చే చీపురుతో ఇలాంటి స్టంట్ చెయొచ్చా
హలో దీదీ..మీరు సూపరహే..!ఇల్లూడ్చే చీపురుతో ఇలాంటి స్టంట్ చెయొచ్చా
ఇది పండు కాదు.. అమృతఫలం.. రోజుకొకటి తింటే.. మీరు సేఫ్ అంతే.!
ఇది పండు కాదు.. అమృతఫలం.. రోజుకొకటి తింటే.. మీరు సేఫ్ అంతే.!
మీ వాహనంపై చలాన్‌ విధించారో.. లేదో తెలుసుకోవడం ఎలా?
మీ వాహనంపై చలాన్‌ విధించారో.. లేదో తెలుసుకోవడం ఎలా?