Aditi Rao Hydari: సిద్ధార్థ్‌తో ప్రేమాయణంపై విలేకరి ప్రశ్న.. ఊహించని ఆన్సర్ ఇచ్చిన హీరోయిన్ అదితి..
తాజ్ సక్సెస్ లో భాగంగా ఓ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో.. సిద్ధార్త్ రిలేషన్ గురించి వస్తోన్న రూమర్స్ పై స్పందించాలని విలేకరి కోరగా.. కాస్త విభిన్నంగా బదులిచ్చారు అదితి. ప్రేక్షకులు ఎవరూ తనను ఇలాంటి ప్రశ్నలు అడగలేదని అన్నారు.

తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవసరంలేని పేరు అదితి రావు హైదరీ. అందం, టాలెంట్ ఎంత ఉన్నా.. అవకాశాలు మాత్రం రావడం లేదు ఈ ముద్దుగుమ్మకు. కానీ కొద్ది రోజులుగా అదిత వ్యక్తిగత విషయాలు సోషల్ మీడియాలో వైరలవుతున్న సంగతి తెలిసిందే. హీరో సిద్ధార్థ్‌తో అదితి ప్రేమలో ఉందంటూ కొన్ని నెలలుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ఇటీవల వీరిద్దరు కలిసి బయట కనిపించడం… అదితి గురించి సిద్ధార్థ్ తన సోషల్ మీడియా ఖాతాలలో షేర్ చేయడంతో ఈ వార్తలకు మరింత బలం చేకూరింది. అయితే ఈ రూమర్స్ పై ఇప్పటివరకు వీరిద్దరూ స్పందించలేదు. తాజాగా తన రిలేషన్ షిప్ స్టేటస్ పై వస్తోన్న వార్తల గురించి అదితి రియాక్ట్ అయ్యారు. అలాంటి విషయం ఏదైనా ఉంటే తానే అందరితో చెబుతానని అన్నారు. తాజ్ సక్సెస్ లో భాగంగా ఓ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో.. సిద్ధార్త్ రిలేషన్ గురించి వస్తోన్న రూమర్స్ పై స్పందించాలని విలేకరి కోరగా.. కాస్త విభిన్నంగా బదులిచ్చారు అదితి. ప్రేక్షకులు ఎవరూ తనను ఇలాంటి ప్రశ్నలు అడగలేదని అన్నారు.
“అందరితో చెప్పుకోవాల్సిన విషయం ఏదైనా ఉంటే.. నేను తప్పుకుండా చెబుతాను. ప్రతి ఒక్కరికీ ఏదో ఒకదానిపై ఆసక్తి ఉంటుంది. కొంతమందికి ఇలాంటి విషయాలపై ఉండొచ్చు గానీ.. చాలా మందికి మమ్మల్ని స్క్రీన్ పై చూడటమంటేనే ఇష్టం. అందుకు అనుగుణంగా మేము మరింత కష్టపడి పనిచేయాలి. మా పనిని ప్రేమించాలి. అలా చేసినప్పుడే మీకు మంచి కంటెంట్ అందించగలం. అదే మాకు ముఖ్యం ” అంటూ చెప్పుకొచ్చారు.




ఆ తర్వాత సిద్ధార్థ్ తో ప్రేమాయణం గురించి స్పందించాలని విలేకరి కోరగా.. మీకే ఒక అభిప్రాయం ఉంది.. ఇంకా నేనెమి చెప్పాలి. ఒకవేళ నేను ఏం చెప్పినా మీకు నచ్చిన విధంగా ఊహించుకుంటారు అంటూ అసహనం వ్యక్తం చేసారు. దీంతో ఆడియన్స్ ప్రశ్న మేడమ్ అని అనగా.. అడియన్స్ ఎవరూ ఇలాంటి ప్రశ్న అడగలేదు.. మీరే నన్ను అడిగారు అని అన్నారు అదితి.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
