AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Actress: క్యూట్‌ స్మైల్‌తో కట్టిపడేస్తోన్న ఈ స్టార్‌ హీరోయిన్‌ను గుర్తుపట్టారా? హిందీతో సహా సౌత్‌లోనూ సూపర్‌ క్రేజ్‌

ఈ ఫొటోలో చాలా క్యూట్ గా కనిపిస్తున్న చిన్నారి ఇప్పుడు.. బాలీవుడ్‌తో సహా సౌత్ సినిమాల్లో కూడా మంచి గుర్తింపు తెచ్చుకుంది. తనదైన అందం, అభినయంతో సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది.

Actress: క్యూట్‌ స్మైల్‌తో కట్టిపడేస్తోన్న ఈ స్టార్‌ హీరోయిన్‌ను గుర్తుపట్టారా? హిందీతో సహా సౌత్‌లోనూ సూపర్‌ క్రేజ్‌
Actress
Basha Shek
|

Updated on: Oct 28, 2022 | 7:09 AM

Share

ఇంటర్నెట్ వినియోగం పెరగడంతో సెలబ్రిటీలు, అభిమానులకు మధ్య దూరం చాలా తగ్గింది. స్టార్స్ కూడా తమ సినిమా అప్‌డేట్‌లను షేర్ చేస్తూ లైవ్ చాట్‌లతో అభిమానులను అలరిస్తున్నారు. అలాగే తమ వ్యక్తి, వృత్తిగత విషయాలను పంచుకుంటున్నారు. ఇక సోషల్ మీడియాలో ‘త్రోబ్యాక్ పిక్స్’ ట్రెండ్ కొనసాగుతోంది. హీరో, హీరోయిన్లు తమ చిన్ననాటి ఫొటోలను వీలైనప్పుడల్లా అభిమానులతో పంచుకుంటున్నారు. అలాగే అభిమానులు కూడా హీరో, హీరోయిన్ల పుట్టిన రోజు నాడు వారి త్రో బ్యాక్‌ ఫొటోలను నెట్టింట షేర్‌ చేస్తూ వైరల్‌ చేస్తున్నారు. అలా తాజాగా ఓ స్టార్ హీరోయిన్ ఫొటో ఆన్‌లైన్‌లో ట్రెండ్ అవుతోంది. ఈ ఫొటోలో చాలా క్యూట్ గా కనిపిస్తున్న చిన్నారి ఇప్పుడు.. బాలీవుడ్‌తో సహా సౌత్ సినిమాల్లో కూడా మంచి గుర్తింపు తెచ్చుకుంది. తనదైన అందం, అభినయంతో సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. అన్నట్లు ఆమెది మన తెలంగాణే నండి.. మరి ఇప్పటికైనా ఆమె ఎవరో మీరు గుర్తుపట్టారా?

ఇవి కూడా చదవండి
View this post on Instagram

A post shared by Aditi Rao Hydari (@aditiraohydari)

పై ఫొటోలో ఉన్న చిన్నారి మరెవరో కాదు.. అదితీ రావ్‌ హైదరి. మణిరత్నం ‘చెలియా’ సినిమాతో తెలుగు వారికి పరిచయమైన ఈ భామ. సమ్మోహనం సినిమాతో అందరి దృష్టిని ఆకర్షించింది. ఆ తర్వాత వరుణ్ తేజ్ సరసన అంతరిక్షం, నానితో వి సినిమాలో మెరిసింది. గతేడాది శర్వానంద్‌, సిద్ధార్థ్‌తో కలిసి మహాసముద్రం సినిమాలో సందడి చేసింది. కొన్ని నెలల క్రితం దుల్కర్‌ సల్మాన్‌, కాజల్‌ అగర్వాల్‌లతో కలిసి హే సినామిక సినిమాలో నటించింది. కెరీర్‌ ప్రారంభంలోనే హిందీ సినిమాల్లో నటించిన ఈ ముద్దుగుమ్మ ఆతర్వాత తెలుగు, తమిళ్‌, కన్నడ, మలయాళ సినిమాల్లోనూ నటించి మెప్పించింది. అన్నట్లు అదితీరావు హైదరీ హైదరాబాద్‌లో జన్మించింది. ఆమె పూర్వీకులు ఒకప్పుడు వనపర్తి సంస్థానాన్ని పాలించారట. మరి ఈ రోజు పుట్టిన రోజు జరుపుకుంటోన్న ఈ ముద్దుగుమ్మకు మనమూ పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుదాం.. హ్యాపీ బర్త్‌డే అదితి..

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..