AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Shaakuntalam: అభిమాని ప్రశ్నకు అదిరిపోయే ఆన్సర్ ఇచ్చిన మేకర్స్.. శాకుంతలం రిలీజ్ పై క్లారిటీ

బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీ బిజీగా గడిపేస్తోంది. ఇప్పటికే తెలుగులో రెండు సినిమాలు చేస్తోన్న సామ్ .. అటు బాలీవుడ్ లోనూ సినిమాలు చేయడానికి ప్రయత్నిస్తోంది. ఇక తెలుగులో యశోద, శాకుంతలం సినిమాలు చేస్తోంది సామ్.

Shaakuntalam: అభిమాని ప్రశ్నకు అదిరిపోయే ఆన్సర్ ఇచ్చిన మేకర్స్.. శాకుంతలం రిలీజ్ పై క్లారిటీ
Shakunthalam
Rajeev Rayala
|

Updated on: Oct 28, 2022 | 6:41 AM

Share

స్టార్ బ్యూటీ సమంత ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది. నాగచైతన్యతో విడిపోయిన తర్వాత కొంత గ్యాప్ తీసుకున్న సామ్. ఇప్పుడు వరుస సినిమాలతో ఫుల్ బిజీగా మారింది. బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీ బిజీగా గడిపేస్తోంది. ఇప్పటికే తెలుగులో రెండు సినిమాలు చేస్తోన్న సామ్ .. అటు బాలీవుడ్ లోనూ సినిమాలు చేయడానికి ప్రయత్నిస్తోంది. ఇక తెలుగులో యశోద, శాకుంతలం సినిమాలు చేస్తోంది సామ్. వీటిలో శాకుంతలం సినిమా హిస్టారికల్ మూవీగా రానుంది. సంస్కృత‌ నాటకం అభిజ్ఞాన శాకుంతలం.. దీని ఆధారంగా  భారీ బడ్జెట్, హై టెక్నికల్ వేల్యూస్‌తో ర‌స‌ర‌మ్య దృశ్య కావ్యంగా రూపొందిన చిత్రం ‘శాకుతలం’. ఈ చిత్రం ప్ర‌పంచ వ్యాప్తంగా తెలుగు, హిందీ, త‌మిళ‌, క‌న్న‌డ‌, మ‌ల‌యాళ భాష‌ల్లో విడుద‌ల‌కు సిద్ధ‌మైంది.  శాకుంత‌లం కోట్లాదిమంది హృద‌యాల‌ను గెలుచుకున్న శ‌కుంత‌ల‌, దుష్యంత మ‌హారాజు మ‌ధ్య ఉన్న అజ‌రామ‌ర‌మైన ప్ర‌ణ‌య‌గాథ ఇది.

శకుంత‌ల‌గా స‌మంత‌.. దుష్యంతుడిగా దేవ్ మోహ‌న్ న‌టించారు. మొన్నామధ్య ‘శాకుంతలం’ సినిమా ఫ‌స్ట్ పోస్ట‌ర్ విడుదలై ప్రేక్ష‌కులను ఆక‌ట్టుకుంది. దీంతో సినిమాపై ఉన్న ఆస‌క్తి మ‌రో లెవ‌ల్‌కు చేరుకుంది. దుర్వాస మునిగా మంచు మోహన్ బాబు.. అల్లు అర్జున్ తనయ అల్లు అర్ష ప్రిన్స్ భారతగా నటిస్తున్నారు.

ముందుగా నవంబర్ 4న ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నాం అని ప్రకటించారు అయితే ఆ తర్వాత విడుదలను వాయిదా వేసుకున్నారు. ఈ సినిమా త్రీడీలో ప్రేక్షకులను అలరించనుంది అందుకే ఈ ఆలస్యం అని ఆమధ్య మేకర్స్ వివరించారు. ఇదిలా ఉంటే .. ఈ విషయం తెలియని ఓ అభిమాని సోషల్ మీడియాలో మేకర్స్ ను ఇలా ప్రశ్నించాడు.. “శాకుంత మూవీ నవంబర్ 4న వస్తుందని ప్రకటించారు.. ఇంత వరకు ప్రమోషన్స్ మొదలు పెట్టలేదు.. కనీసం టీజర్ కూడా ఇవ్వలేదు..  అంటూ ట్వీట్ చేశాడు. దానికి నీలిమ గుణ స్పందిస్తూ.. సినిమా నవంబర్ఈ 4న రావడం లేదు. సినిమాను మరింత ద్భుతంగా చూపించాలనే ఉద్దేశ్యంతో త్రీడీలో కూడా రూపొందిస్తున్నట్లు తెలిపారు. ఈ పనులు పూర్తయ్యాక సినిమాను ఒకేసారి థియేటర్లలో విడుదల చేస్తామన్నారు. త్వరలోనే కొత్త రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేస్తామని అన్నారు.

ఇవి కూడా చదవండి
Follow Us
ఇద్దరు అమ్మాయిల ప్రాణాలు తీసిన పిల్లులు! అసలు ఏం జరిగిందంటే?
ఇద్దరు అమ్మాయిల ప్రాణాలు తీసిన పిల్లులు! అసలు ఏం జరిగిందంటే?
జుట్టు ఒత్తుగా పెరగాలా.. అమ్మమ్మల కాలం నాటి అద్భుతమైన చిట్కా..
జుట్టు ఒత్తుగా పెరగాలా.. అమ్మమ్మల కాలం నాటి అద్భుతమైన చిట్కా..
ఐపీఎల్ 2026లో కుర్రాళ్లకు చుక్కలు చూపించే టాప్-5 సీనియర్లు వీళ్లే
ఐపీఎల్ 2026లో కుర్రాళ్లకు చుక్కలు చూపించే టాప్-5 సీనియర్లు వీళ్లే
బాలయ్య అంతే మరి.. సినిమా అంటే ప్రాణమిస్తాడు..
బాలయ్య అంతే మరి.. సినిమా అంటే ప్రాణమిస్తాడు..
2 నిమిషాల్లో మెహందీ, గోరింటాకు మచ్చలకు గుడ్‌బై చెప్పేయండి
2 నిమిషాల్లో మెహందీ, గోరింటాకు మచ్చలకు గుడ్‌బై చెప్పేయండి
పీఎఫ్ అకౌంట్ ఉన్నవారికి పండుగే.. కేంద్రం నుంచి కీలక అప్డేట్..
పీఎఫ్ అకౌంట్ ఉన్నవారికి పండుగే.. కేంద్రం నుంచి కీలక అప్డేట్..
ఉల్లిపాయ‌ పొట్టు ప‌డేస్తున్నారా? అందులోని ఆరోగ్య గుట్టు తెలిస్తే
ఉల్లిపాయ‌ పొట్టు ప‌డేస్తున్నారా? అందులోని ఆరోగ్య గుట్టు తెలిస్తే
SRH Vs RCB కాదు.. బెంగళూరు వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ ఇది..
SRH Vs RCB కాదు.. బెంగళూరు వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ ఇది..
సంవత్సరాలు గడిచిన తగ్గని క్రేజ్.. దెబ్బకు ఆ ముగ్గురు హీరోయిన్లు..
సంవత్సరాలు గడిచిన తగ్గని క్రేజ్.. దెబ్బకు ఆ ముగ్గురు హీరోయిన్లు..
మీ కిడ్నీలు పదిలంగా ఉండాలా?అయితే రోజుకు ఎన్ని గ్లాసుల నీరు తాగాలి
మీ కిడ్నీలు పదిలంగా ఉండాలా?అయితే రోజుకు ఎన్ని గ్లాసుల నీరు తాగాలి