The Kerala Story: అందుకే కేరళ స్టోరీ ఓటీటీలోకి రాలేదు.. అసలు విషయం చెప్పిన అదా శర్మ
అందాల భామ అదాశర్మ ప్రధాన పాత్రలో నటించిన ఈ మూవీని డైరెక్టర్ సుదీప్తో సేన్ తెరకెక్కించారు. కేవలం 40 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన కేరళ స్టోరీ మూవీ ఏకంగా 350కోట్లకు పైగా వసూల్ చేసి బాక్సాఫీస్ ను షేక్ చేసింది.

కేరళ స్టోరీ.. చిన్న సినిమాగా విడుదలై సంచలన విజయం సాధించిన సినిమా ఇది. కంటెంట్ బాగుంటే చాలు సినిమాలు పాన్ ఇండియా రేంజ్ లో సక్సెస్ అవుతున్నాయి. ఈ క్రమంలోనే కేరళ స్టోరీ సినిమా రికార్డ్ క్రియేట్ చేసింది. అందాల భామ అదాశర్మ ప్రధాన పాత్రలో నటించిన ఈ మూవీని డైరెక్టర్ సుదీప్తో సేన్ తెరకెక్కించారు. కేవలం 40 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన కేరళ స్టోరీ మూవీ ఏకంగా 350కోట్లకు పైగా వసూల్ చేసి బాక్సాఫీస్ ను షేక్ చేసింది. కేరళలోని కొంతమంది యువతులను ఇస్లాం మతంలోకి మార్చి సౌదీకి తరలించే నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కించాడు దర్శకుడు. ఈ సినిమా విడుదల సమయంలో కొన్ని అవాంతరాలు ఎదురైనా .. సినిమా రిలీజ్ అయ్యి మంచి హిట్ గా నిలిచింది. ఈ మూవీపై ప్రముఖులు సైతం ప్రశంసలు కురిపించారు.
ఇదిలా ఉంటే కేరళ స్టోరీ సినిమా రిలీజ్ అయ్యి 50 రోజులైంది. ఇక ఈ సినిమా ఓటీటీలోకి ఎప్పుడెప్పుడొస్తుందా అని ప్రేక్షకులంతా ఆస్కతిగా ఎదురుచూస్తున్నారు. ఈ మధ్య ఓటీటీలో రిలీజ్ అవుతుందని వార్తలు రావడమే కాదు డేట్ కూడా బయటకు రావడం జరిగింది. కానీ సినిమా మాత్రం ఎక్కడ కనిపించలేదు.
నిర్మాతలు కేరళ స్టోరీని ఎందుకు ఓటీటీకి ఇవ్వడం లేదు అనే అనుమానాలు ప్రేక్షకుల్లో మొదలయ్యాయి. తాజాగా ఈ వ్యవహారం పై నటి అదాశర్మ స్పందించింది. కేరళ స్టోరీ అనే సినిమాను ప్రతి ఒక్కరిది. ఇంత మంచి సినిమాను ఏ ఓటీటీ సంస్థకు ఇవ్వాలా అని నిర్మాతలు ఆలోచిస్తున్నారు. మంచి ఓటీటీ ఫ్లాట్ ఫామ్ కు ఇస్తే ప్రేక్షకులకు మరింత రీచ్ అవుతుంది ఈ మూవీ.. అందుకే నిర్మాతలు ఈ మూవీ రిలీజ్ పై ఆలోచిస్తున్నారు అని తెలిపింది అదా శర్మ.
