Toxic Movie: ఎట్టకేలకు యశ్ ‘టాక్సిక్’ సెట్‌లోకి అడుగు పెట్టిన స్టార్ హీరోయిన్.. చెప్పిన డేట్‌కే మూవీ రిలీజ్‌!

కేజీఎఫ్ ఫేమ్ రాకింగ్ స్టార్ యశ్ నటిస్తున్న తాజా చిత్రం 'టాక్సిక్'. ఈ సినిమా షూటింగ్ బెంగళూరులో గ్రాండ్‌గా జరుగుతోంది. ఈ మూవీని మలయాళ దర్శకురాలు గీతా మోహన్ దాస్ తెరకెక్కిస్తున్నారు. కేవీఎన్ ప్రొడక్షన్ సంస్థ భారీ బడ్జెట్ తో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా ఈ మూవీని నిర్మిస్తోంది.

Toxic Movie: ఎట్టకేలకు యశ్ 'టాక్సిక్' సెట్‌లోకి అడుగు పెట్టిన స్టార్ హీరోయిన్.. చెప్పిన డేట్‌కే మూవీ రిలీజ్‌!
Toxic Movie
Follow us
Basha Shek

|

Updated on: Feb 05, 2025 | 8:54 AM

కన్నడ చిత్ర పరిశ్రమను మరో స్థాయికి తీసుకెళ్లిన ఘనత హీరో యశ్‌ కు దక్కుతుంది. అతను హీరోగ ‘కేజీఎఫ్: చాప్టర్ 1’, ‘కేజీఎఫ్: చాప్టర్ 2’ చిత్రాలు పాన్ ఇండియా రేంజ్ లో విజయం సాధించాయి. ఇప్పుడీ సక్సెస్ ను కొనసాగించేందుకు మరో డిఫరెంట్ మూవీతో మన ముందుకు వస్తున్నాడు రాఖీ భాయ్. భారీ అంచనాలతో తెరకెక్కుతోన్న ‘టాక్సిక్’ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. యశ్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో చాలా మంది స్టార్ ఆర్టిస్టులు నటిస్తున్నారు. ఈ సినిమాలో నయనతార, హుమా ఖురేషి, కియారా అద్వానీ, తారా సుతారియా వంటి స్టార్ హీరోయిన్లు నటిస్తున్నారు. ఇప్పటికే వీళ్ళందరూ షూటింగ్ లో పాల్గొంటున్నారు. ప్రస్తుతం బెంగళూరులో ఈ సినిమా చిత్రీకరణ జరుగుతుండగా, నటి నయన తార కూడా సెట్ లోకి అడుగు పెట్టింది. ప్రముఖ మలయాళ చిత్ర దర్శకురాలు గీతు మోహన్‌దాస్ ‘టాక్సిక్’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ సంవత్సరం యష్ పుట్టినరోజు సందర్భంగా ‘టాక్సిక్’ సినిమా టీజర్ విడుదలైంది. అందులో యష్ రగ్డ్ లుక్ అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ సినిమా గురించి మరిన్ని అప్‌డేట్‌లు తెలుసుకోవడానికి అభిమానులు ఎదురుచూస్తున్నారు. ‘కెవిఎన్ ప్రొడక్షన్స్’ ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మిస్తోంది. ‘కేజీఎఫ్ 2’ తర్వాత యష్ నటిస్తున్న సినిమా ‘టాక్సిక్’ కాబట్టి, ‘టాక్సిక్’ పై భారీ అంచనాలు ఉన్నాయి.

టాక్సిక్ సినిమాకు ప్రముఖ హాలీవుడ్ టెక్నీషియన్లు పని చేస్తున్నారు. ముంబైలో ఉంటున్న ప్రముఖ బ్రిటీష్ నటుడు బెనెడిక్ట్ గారెట్ కూడా ఈ సినిమాలో ఓ కీలక పాత్ర పోషిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక భారతదేశంలోనే కాకుండా విదేశాలలో కూడా టాక్సిక సినిమాను భారీగా విడుదల చేయాలనుకుంటున్నాడు యశ్. ఈ క్రమంలోనే 915 నుండి చలనచిత్ర నిర్మాణంలో నిమగ్నమై ఉన్న ప్రపంచంలోని పురాతన, అత్యుత్తమ స్టూడియోలలో ఒకటైన 20వ సెంచరీ ఫాక్స్‌తో యశ్ చర్చలు జరుపుతున్నాడు. కాగా ‘టాక్సిక్’ సినిమా డిసెంబర్ 2025లో విడుదల కానుందని ప్రచారం జరుగుతోంది.

ఇవి కూడా చదవండి

టాక్సిక్ సినిమాలో యశ్..

నయనతార రాకతో..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.