Vishwak Sen: ‘ఎవరిని మోసం చేయలేదు.. అయినా నిందలు పడ్డాను’.. విశ్వక్ సేన్ పోస్ట్..
విజయం.. పరాజయం.. ప్రశంసలు.. విమర్శలు.. అన్నింటినీ చూశాను.. చేయని తప్పులకు ప్రశ్నలు ఎదుర్కొన్నాను. నిందలు పడ్డాను.. నా హార్డ్ వర్క్ కు పొగడ్తలు అందుకున్నాను.. ఒకవేళ తెలియక చేసిన తప్పుల వల్ల విమర్శలు ఎదుర్కొని ఉండొచ్చు.

ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండానే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి హీరోగా తనకంటూ ఫ్యాన్ బేస్ క్రియేట్ చేసుకున్న యంగ్ హీరోలలో విశ్వక్ సేన్ ఒకరు. ఇటీవల దాస్ కా దమ్కీ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న ఈ హీరో.. ప్రస్తుతం తన కొత్త ప్రాజెక్ట్ చిత్రీకరణలో బిజీగా ఉన్నారు. ఓవైపు బ్యాక్ టూ బ్యాక్ చిత్రాలతో ప్రేక్షకులను అలరిస్తూనే.. మరోవైపు సోషల్ మీడియాలో చాలా చురుగ్గా ఉంటారు. ఎప్పుడూ సరదా పోస్ట్స్, మీమ్స్ షేర్ చేస్తూ సందడి చేస్తుంటారు. తాజాగా విశ్వక్ షేర్ చేసిన ఓ పోస్ట్ నెట్టింట తెగ వైరలవుతుంది. జీవితంలో తాను జయాపజయాలను చూశానని.. అలాగే కొన్నిసార్లు చేయని తప్పులకూ నిందలు పడ్డానని తెలిపారు. తనపై వ్యతిరేకత వచ్చినప్పటికీ తాను ఎవరికి ద్రోహం చేయలేదని తెలిపారు.
“విజయం.. పరాజయం.. ప్రశంసలు.. విమర్శలు.. అన్నింటినీ చూశాను.. చేయని తప్పులకు ప్రశ్నలు ఎదుర్కొన్నాను. నిందలు పడ్డాను.. నా హార్డ్ వర్క్ కు పొగడ్తలు అందుకున్నాను.. ఒకవేళ తెలియక చేసిన తప్పుల వల్ల విమర్శలు ఎదుర్కొని ఉండొచ్చు… కానీ ఎవరికీ హానీ చేయలేదు. పోరాటాలు జరుగుతున్నప్పటికీ నా ప్రయాణాన్ని ముందుకు కొనసాగిస్తున్నాను. ఉద్దేశపూర్వక ప్రతికూలత.. నిన్ను ఒక ఫెయిల్యూర్ గా నిర్వహించడానికి ఛాన్స్ ఇవ్వద్దు. క్లిష్ట సమయాలకు మించి జీవితంలో మరెంతో ఉంటుంది. మానవ జన్మ ఎత్తినందుకు ఆనందించండి. కలలను సాకారం చేసుకునేందుకు కష్టపడ్డండి” అంటూ విశ్వక్ ఇన్ స్టాలో స్టోరీ పెట్టారు. ఎప్పుడూ సరదాగా ఉండే విశ్వక్ ఉన్నట్లుండి ఇలాంటి సందేశం ఎందుకు పెట్టాడా అనే చర్చ మొదలైంది.




ఇక ప్రస్తుతం విశ్వక్ తన కొత్త సినిమాకు సంబంధించిన పోస్టర్ షేర్ చేస్తూ.. గంగామ్మ జాతర మొదలైంది. ఈసారి శివాలెత్తి పోద్ది అంటూ క్యాప్షన్ ఇచ్చారు. అందులో గంగానమ్మ దేవత దగ్గర అగ్గి కాగడను చేతితో పట్టుకున్న విశ్వక్ ఉండడం విశేషం. ఈ పోస్టర్ అభిమానులను ఆకట్టుకుంటుంది.




