Paagal Movie Review: అమ్మలాంటి ప్రేమ కోసం ‘పాగల్‌’ పాట్లు.. ఇంతకీ లవ్‏లో పాసవుతాడా!

కొన్ని మాటలు కొందరి నుంచి అసలు ఆశించం. అలాంటిది వారంతట వారే చెప్పినా చాలా కొత్తగా ఉంటుంది. ఎప్పుడూ డేరింగ్‌గా, డ్యాషింగ్‌గా

Paagal Movie Review: అమ్మలాంటి ప్రేమ కోసం 'పాగల్‌' పాట్లు.. ఇంతకీ లవ్‏లో పాసవుతాడా!
Paagal
Follow us
Rajitha Chanti

|

Updated on: Aug 14, 2021 | 4:54 PM

కొన్ని మాటలు కొందరి నుంచి అసలు ఆశించం. అలాంటిది వారంతట వారే చెప్పినా చాలా కొత్తగా ఉంటుంది. ఎప్పుడూ డేరింగ్‌గా, డ్యాషింగ్‌గా, సరదాగా మాట్లాడే విశ్వక్‌సేన్‌… ఇదిగో థియేటర్ల గురించి థాట్‌ఫుల్‌ నోట్‌ పెట్టినప్పుడు కూడా అలాగే అనిపించింది. విశ్వక్‌సేన్‌ యాక్ట్ చేసిన పాగల్‌ శనివారం విడుదలైంది. ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్‌ లేని నాకు అండా దండా మీరే… మా ప్రయత్నంలో లోపం ఉంటే విమర్శించండి. దాడి చేయకండి… ఎన్నో వేల మందికి ఉపాధి కలిగించే సినిమా థియేటర్లను కాపాడండి అంటూ ఓపెన్‌ లెటర్‌ రాశారు విశ్వక్‌సేన్‌. ఇంతకీ ఆయన నటించిన పాగల్‌ సినిమా కథాకమామీషు ఏంటి? ఎలా ఉంది? చదివేద్దాం… రండి!

సినిమా: పాగల్‌ బేన‌ర్స్‌: శ్రీ‌వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్‌, ల‌క్కీ మీడియా స‌మ‌ర్ప‌ణ‌: దిల్‌రాజు నిర్మాత‌: బెక్కం వేణుగోపాల్‌ స్టోరీ, స్క్రీన్ ప్లే, ద‌ర్శ‌క‌త్వం: న‌రేష్ కుప్పిలి డిఒపి: ఎస్‌. మ‌ణికంద‌న్‌ సంగీతం: ర‌ధ‌న్‌ ఎడిట‌ర్‌: గ్యారీ బీహెచ్‌ లిరిక్స్‌: రామ‌జోగ‌య్య శాస్త్రి, కెకె, అనంత శ్రీ‌రామ్‌ ఫైట్స్‌‌: దిలీప్‌సుబ్బ‌రాయ‌న్‌, రామ‌కృష్ణ‌ డ్యాన్స్: విజ‌య్ ప్ర‌కాష్‌ ప్రొడ‌క్ష‌న్ డిజైన‌ర్‌: ల‌తా త‌రుణ్

కథ ప్రేమ్‌ (విశ్వక్‌)కి తండ్రి ఉండడు. తల్లి (భూమిక) అల్లారుముద్దుగా పెంచుకుంటుంది. ప్రేమ్‌ చిన్నతనంలోనే ఆమె కేన్సర్‌తో చనిపోతుంది. అమ్మలా తనని ప్రేమించే అమ్మాయి కోసం వెతుకుతుంటాడు. కారణం ఏదైనా ప్రేమించిన ప్రతి అమ్మాయీ అతన్ని రిజెక్ట్ చేస్తుంటుంది. ఇక అమ్మాయిలతో ప్రేమకు కటీఫ్‌ చెప్పి పొలిటీషియన్‌ రాజిరెడ్డి(మురళీశర్మ)తో ప్రేమలో పడతాడు ప్రేమ్‌. అప్పటిదాకా అమ్మాయిల వెంట పడ్డ ప్రేమ్‌లో మార్పు ఎందుకు వచ్చింది? రాజిరెడ్డి ఎవరు? అతనితో ప్రేమ్‌ లవ్‌లో పడటానికి రీజన్‌ ఏంటి? తీరా ప్రేమను ప్రేమ్‌ ఎప్పుడు అర్థం చేసుకున్నాడు? అసలు ఆమె ఎవరు? అన్నిటికీ మించి… అమ్మలా ప్రేమించే అమ్మాయి ప్రేమ్‌కి దొరికిందా? లేదా? అనేది అసలు కథ

ఎవరెలా చేశారు? టఫ్‌ రోల్స్ మాత్రమే కాదు, లవర్‌ బోయ్‌ కైండ్‌ కేరక్టర్లను కూడా విశ్వక్‌సేన్‌ ఈజ్‌గా చేయగలడని ఈ మూవీతో మరోసారి ప్రూవ్‌ అయింది. తల్లి క్యారెక్టర్‌లో భూమిక కొద్దిసమయమే కనిపించినా అట్రాక్టివ్‌గా ఉంది. సినిమా మొత్తానికి హైలైట్‌ మురళీశర్మ – విశ్వక్‌ లవ్‌ సీన్స్. ఆలోచించడానికి కాస్త ఎబ్బెట్టుగా అనిపించినా… మురళీశర్మ సిట్చువేషన్‌ థియేటర్లో కాస్త రిలీఫ్‌నిస్తుంది. వైజాగ్‌లో ఫ్రెండ్స్ గ్యాంగ్‌ నలుగురు, రౌడీ గ్యాంగ్‌లో రాహుల్‌ రామకృష్ణ అండ్‌ అదర్స్‏తో వచ్చే సీన్లు రొటీన్‌గా అనిపిస్తాయి. ప్రేమ్‌ చూపించిన ప్రేమను రిజక్ట్ చేసిన అమ్మాయిలుగా మేఘలేఖ, సిమ్రన్‌ చౌదరి తమ క్యారెక్టర్లలో మెప్పించారు. పెర్ఫార్మెన్స్‏కి స్కోప్‌ ఉన్న క్యారెక్టర్స్‏కి తాను పర్ఫెక్ట్‏గా సూటవుతానని ఇంకోసారి ప్రూవ్‌ చేశారు నివేదా పేతురాజ్‌. ఈ ముద్దుగుమ్మ కనిపించే సీన్లు ఆకట్టుకున్నాయి.

నరేష్‌ కుప్పిలి రాసుకున్న కథ దగ్గరే అసలు పేచీ. సినిమాకు తగ్గట్టు మౌల్డ్ అయ్యే నటీనటులను పిక్‌ చేసుకోవడంలో ఉన్న చలాకీతనం, సినిమా కథను రాసుకోవడంలో చూపించలేకపోయారేమోనని అనిపిస్తుంది. ఫస్టాఫ్‌ కంప్లీట్‌ అవుతున్నప్పటికీ… అస్సలు హీరోయిన్‌ కనిపించదు. సరే.. ఇంటర్వెల్‌ థ్రిల్‌ కోసం అలా స్క్రీన్‌ప్లే డిజైన్‌ చేశారని అనుకున్నా… అంతకు ముందు వచ్చే సన్నివేశాలు కూడా రిపీట్‌ మోడ్‌లో ఉంటాయి. కథ అక్కడక్కడే తిరుగుతూ ఉంటుంది. ఎక్కడా కొత్తగా, థ్రిల్లింగ్‌గా అనిపించదు. సెకండ్‌ ఆఫ్‌ కాస్త బాగానే సాగుతోందనుకుంటున్న తరుణంలో వచ్చే కొన్ని సీన్లు అసలు మింగుడుపడవు. అందులో హీరో ట్రైన్‌ నుంచి దూకే సీన్‌ కూడా ఒకటి. క్లైమాక్స్ కూడా కన్విన్సింగ్‌గా అనిపించదు. యాక్సిడెంట్‌కి గురయిన హీరోయిన్‌… ఇంట్లో వాళ్లకి దూరంగా ఎందుకు ఉంటుంది? ఎందుకు ఉండాలి… వంటి ప్రశ్నలకు ఆన్సర్లు దొరకవు. ఎడిటర్‌ కత్తెరకు ఇంకాస్త పదును పెట్టాల్సింది. పాటలు కొన్ని మళ్లీ మళ్లీ వినాలనిపించేలా ఉన్నాయి.

బజ్‌ ఏంటంటే… ఈ మధ్య కాలంలో ఏ సినిమాకీ రానంత బజ్‌ వచ్చింది పాగల్‌కి. థియేటర్ల ముందు కూడా గత కొన్ని వారాలుగా లేని సందడైతే కనిపించింది. ఈ సమయంలో థియేట్రికల్‌ రిలీజ్‌ చేసి మంచే పనే చేసింది టీమ్‌. అయితే ఫైనల్‌ ఔట్‌పుట్‌ మీద ఇంకాస్త దృష్టి పెట్టి ఉంటే బావుండేదేమో!

సింగిల్‌ లైన్: తల్లి లాంటి అమ్మాయి ప్రేమ కోసం… పాగల్‌ పాట్లు

– డా. చల్లా భాగ్యలక్ష్మి

Also Read: Akkineni Sumanth: విడాకులు తీసుకున్న మోస్ట్ కన్ఫ్యూజ్డ్ మెన్.. మళ్లీ మొదలైందంటున్న సుమంత్..

Evaru Meelo Koteeswarulu: తారక్ వచ్చేస్తున్నాడు.. ‘ఎవరు మీలో కోటీశ్వరులు’ ప్రారంభం ఎప్పుడంటే.

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!