Meera Mithun: పోలీసులకు చుక్కలు చూపించిన మీరా మిథున్.. టచ్ చేస్తే ఆత్యహత్య చేసుకుంటా.. వీడియో వైరల్..

దళితులపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన తమిళ నటి మీరా మిథున్‏ను ఈరోజు చెన్నై సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.

Meera Mithun: పోలీసులకు చుక్కలు చూపించిన మీరా మిథున్.. టచ్ చేస్తే ఆత్యహత్య చేసుకుంటా.. వీడియో వైరల్..
Meera
Follow us
Rajitha Chanti

| Edited By: Rajeev Rayala

Updated on: Aug 16, 2021 | 10:19 PM

దళితులపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన తమిళ నటి మీరా మిథున్‏ను ఈరోజు చెన్నై సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. పోలీసులు తనను అరెస్ట్ చేయలేరని.. కలలో మాత్రమే అది జరుగుతుందని.. సాధ్యమైతే అరెస్ట్ చేయాలని పోలీసులకు సవాల్ విసిరింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు కేరళలో తనదాచుకున్న మీరాను ఎట్టకేలకు ఈరోజు మధ్యాహ్నం అదుపులోకి తీసుకున్నారు. అయితే తనను అరెస్ట్ చేస్తే కత్తి పొడుతుకుని ఆత్మహత్య చేసుకుంటానని.. కావాలనే తనను టార్గెట్ చేస్తున్నారంటూ మీరా సోషల్ మీడియాలో ఓ వీడియో పోస్ట్ చేసింది. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట్లో తెగ వైరల్ అవుతుంది.

అందులో మీరా మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరు, పోలీసులు నన్ను టార్గెట్ చేస్తున్నారు. నన్ను టచ్ చేస్తే కత్తితో పొడుచుకుని ఆత్మహత్య చేసుకుంటాను అంటూ బెదిరించింది. ముఖ్యమంత్రి.. ఒక అమ్మాయికి ఇలా జరగవచ్చా ? ఒక అమ్మాయికి ఇదే జరుగుతుందా ? అందరిని బయటకు వెళ్లమని చెప్పండి. నన్ను అరెస్ట్ చేస్తే ఇక్కడే కత్తితో పొడుచుకుని చనిపోతాను. ముఖ్యమంత్రి, ప్రధాని మోదీ..ఇది తమిళనాడు పోలీసులు చేస్తున్న హింస అంటూ చెప్పుకొచ్చింది.

వీడియో..

దళితులను సినీ ఇండస్ట్రీ నుంచి బయటకు పంపించాలని.. వారివల్లే తనకు అవకాశాలు రావడం లేదని వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. దీంతో ఆమె పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీతోపాటు.. ఏడు సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. దీనిపై పోలీస్ కమిషనర్ కార్యాలయానికి వచ్చిన వివరణ ఇవ్వాలని మీరాకు పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఇక నోటీసులపై స్పందిస్తూ.. పోలీసులు తనను అరెస్ట్ చేయలేరంటూ సవాల్ విసిరింది. ఈ క్రమంలో ఈరోజు చెన్నై సైబర్ క్రైమ్ పోలీసులు మీరాను కేరళలో అదుపులోకి తీసుకున్నారు.

Also Read: Paagal Movie Review: అమ్మలాంటి ప్రేమ కోసం ‘పాగల్‌’ పాట్లు.. ఇంతకీ లవ్‏లో పాసవుతాడా!

Akkineni Sumanth: విడాకులు తీసుకున్న మోస్ట్ కన్ఫ్యూజ్డ్ మెన్.. మళ్లీ మొదలైందంటున్న సుమంత్..

Evaru Meelo Koteeswarulu: తారక్ వచ్చేస్తున్నాడు.. ‘ఎవరు మీలో కోటీశ్వరులు’ ప్రారంభం ఎప్పుడంటే.

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!