AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vijay Thalapathy : విజయ్‏ను కలిసేందుకు వచ్చిన అభిమాని.. ముఖంపై గన్ పెట్టిన బాడీగార్డ్..

కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ దళపతి ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల్లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. మరోవైపు ఇప్పటికే ఒప్పుకున్న సినిమాలను పూర్తి చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే కొద్ది రోజులుగా తమిళనాడులో విజయ్ దళపతి తన సినిమా షూటింగ్ లో పాల్గొంటున్న సంగతి తెలిసిందే. తాజాగా ఓ అభిమానిపై విజయ్ బాడీగార్డ్స్ అత్యూత్సాహం ప్రదర్శించారు.

Vijay Thalapathy : విజయ్‏ను కలిసేందుకు వచ్చిన అభిమాని.. ముఖంపై గన్ పెట్టిన బాడీగార్డ్..
Vijay Thalapathy
Rajitha Chanti
|

Updated on: May 06, 2025 | 12:41 PM

Share

ప్రస్తుతం తమిళ్ స్టార్ హీరో విజయ్ దళపతి రాజకీయాల్లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. అటు తన నెక్ట్స్ ప్రాజెక్ట్స్ షూటింగ్స్‏లోనూ పాల్గొంటున్నారు. ఈ క్రమంలోనే విజయ్ ఎక్కడికి వెళ్లినా అభిమానులు భారీగా తరలివస్తున్నారు. పార్టీ ప్రచారాలు కాకపోయినా ఫ్యాన్స్ విజయ్ వెన్నంటే ఉంటున్నారు. ఇటీవలే మధురై అభిమానుల అత్యూత్సాహంతో విజయ్ ఇబ్బందిపడ్డారు. అయితే తాజాగా విజయ్ బాడీగార్డ్స్ ఓ అభిమాని పట్ల ప్రవర్తించిన తీరుపై ఇప్పుడు నెటిజన్స్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటన మధురై వివాంత స్టేషన్‏లో జరిగింది. తాజాగా విజయ్ తన సినిమా షూటింగ్ కోసం మధురై విమానాశ్రయానికి చేరుకున్నారు.

అయితే విజయ్ వస్తున్నాడనే వార్త తెలియడంతో విమానాశ్రయానికి భారీగా అభిమానులు తరలివచ్చారు. ఆ సమయంలో విజయ్ ను కలిసేందుకు ఓ వృద్ధుడు ముందుకు వచ్చాడు. బాడీగార్డ్స్ ఉన్నప్పటికీ అతడు విజయ్ వద్దకు వెళ్లేందుకు ప్రయత్నించగా.. విజయ్ బాడీగార్డ్స్ తుపాకీతో బెదిరిస్తూ అతడిని వెనక్కి వెళ్లిపోమన్నట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట చక్కర్లు కొడుతుంది. దళపతి విజయ్ నటిస్తున్న చిత్రం ‘జన నాయగన్’. ఆ షూటింగ్ కోడెకనల్‌లో జరిగింది. అనంతరం మధురై నుండి చెన్నై చేరుకున్నాడు విజయ్.

అయితే విజయ్ బాడీగార్డ్ ప్రవర్తనపై నెటిజన్స్ విభిన్నంగా స్పందిస్తున్నారు. కొందరు అతడి తీరుకు మద్దతు తెలుపుతుండగా.. మరికొందరు మాత్రం విమర్శిస్తున్నారు. గతంలో చాలా మంది సినీతారలకు ఇలాంటి పరిస్థితులే ఎదురయ్యాయి.

ఇవి కూడా చదవండి :  

Mirchi Movie: ఈ హీరోయిన్ ఇంత మారిపోయిందేంటి ?.. మిర్చి మూవీ బ్యూటీ ఫ్యామిలీని చూశారా.. ?

Tollywood: సినిమాలు వదిలేసి వాచ్‏మెన్‏గా మారిన నటుడు.. ఒకప్పుడు స్టార్ హీరోల సినిమాల్లో తోపు యాక్టర్..

Tollywood: సీనియర్ హీరోలతో నటించేందుకు నాకు ఎలాంటి సమస్య లేదు.. హీరోయిన్ ఓపెన్ కామెంట్స్..

Tollywood: ఒకప్పుడు తినడానికి తిండి లేక నీళ్లు తాగి బతికింది.. ఇప్పుడు ఇండస్ట్రీనే షేక్ చేస్తోన్న హీరోయిన్..