Vijay Deverakonda: ఫైటర్ బాడీ కోసం విజయ్ 2 ఏళ్లు శిక్షణ.. మైక్ టైసన్‏తో ఒక్క సీన్ కోసం.. ఆసక్తికర కామెంట్స్ చేసిన ఫిట్‏నెస్ కోచ్..

అంతేకాకుండా మైక్ టైసన్‏తో చేసే సన్నివేశం కోసం తనను తాను పూర్తిగా సిద్ధం చేసుకున్నాడని అతని ఫిట్ నెస్ కోచ్ కుల్ దీప్ సేథీ తెలిపారు.

Vijay Deverakonda: ఫైటర్ బాడీ కోసం విజయ్ 2 ఏళ్లు శిక్షణ.. మైక్ టైసన్‏తో ఒక్క సీన్ కోసం.. ఆసక్తికర కామెంట్స్ చేసిన ఫిట్‏నెస్ కోచ్..
Liger
Follow us

|

Updated on: Aug 23, 2022 | 9:57 AM

దేశవ్యాప్తంగా ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న లైగర్ మూవీ మరో రెండు రోజుల్లో థియేటర్లలో సందడి చేయనుంది. డైరెక్టర్ పూరి జగన్నాథ్, రౌడీ హీరో విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) కాంబోలో రాబోతున్న ఈ సినిమాపై ఇప్పటికే అంచనాలు భారీగా నెలకొన్నాయి. మార్షల్ ఆర్ట్స్ నేపథ్యంలో రూపొందిన ఈ చిత్రంలో విజయ్ బాక్సర్‏గా కనిపించనున్నాడు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్, పోస్టర్స్, సాంగ్స్ సినిమై మరింత హైప్ పెంచాయి. అయితే బాక్సర్ గా కనిపించేందుకు ఫైటర్ బాడీ పొందేందుకు విజయ్ దాదాపు 2 ఏళ్లు శిక్షణ తీసుకున్నాడట. అంతేకాకుండా మైక్ టైసన్‏తో చేసే సన్నివేశం కోసం తనను తాను పూర్తిగా సిద్ధం చేసుకున్నాడని అతని ఫిట్ నెస్ కోచ్ కుల్ దీప్ సేథీ తెలిపారు. ఇటీవల ఇండియన్ ఎక్స్ ప్రెస్ డాట్ కామ్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో విజయ్ ఫిట్ నెస్ కోచ్ కుల్ దీప్ సేథీ పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.

విజయ్ ఎప్పుడూ సరదాగా ఉంటారు. అతను తొందరగా నేర్చుకుంటారు. ఒక సెలబ్రెటీ, స్టార్ హీరో అయిన శిక్షణ విషయంలో చాలా సిన్సియర్‏గా ఉంటాడు. తన పాత్రల కోసం వ్యక్తిగతంగా.. శారీరకంగా మారేందుకు సాహసం చేస్తుంటారు. డిసెంబర్ 2019లో విజయ్ లైగర్ సినిమా కోసం సైన్ చేశాడు. అదే సమయంలో మేము అతని పాత్ర గురించి చర్చించాము. తన రోల్ గురించిన అన్ని విషయాలను చెప్పుకున్నాడు. అంతేకాకుండా డైరెక్టర్ పూరి జగన్నాథ్ సైతం విజయ్ పాత్ర, అతని లుక్ గురించి పూర్తిగా నాతో చెప్పారు. అతను యూఎఫ్సీ ఫైటర్ అని అన్నారు. కాబట్టి అతని శరీరం అలాగే కనిపించాలన్నారు. లాక్ డౌన్ సయమంలో నేను బరువు పెరగడం, తగ్గడం గురించి ఫోకస్ పెట్టాను. లైగర్ పాత్ర కోసం దాదాపు 2 ఏళ్లు కలిసి పనిచేశాము. సినిమా కోసం దాదాపు శారీరాన్ని మార్చేందుకు కేవలం 6 నెలల సమయం పట్టేది అని అన్నారు.

ఇవి కూడా చదవండి

అంతేకాకుండా.. విజయ్ బాడీ బిల్డర్ లా చేతులు, ఛాతీ పెద్దదిగా ఉండాలనుకోలేదు. ఒక పోరాట యోధుడి శరీరం.. బాడీ బిల్డర్ శరీరానికి చాలా భిన్నంగా ఉంటుంది. అతను ఒక అథ్టెట్ లాగా ఉంటారు. యూఎఫ్సీ బాక్సర్స్ చాలా సన్నగా ఉంటారు. లావుగా ఉండరు. అతని బరువు, అతని వ్యక్తిత్వాన్ని బట్టి శరీరాన్ని రూపొందించాము. కేవలం ఒక అథ్లెటిక్‏గా ఉండాల్సి ఉంటుంది. లాక్ డౌన్ సమయంలో మేము పూర్తిగా విజయ్ లుక్ పై శ్రద్ధ చూపించాము. రోజు అతను ఇంట్లో వ్యాయమం చేసేవాడు. అతను చాలా శారీరక, మానసిక ఒత్తిడిని కలిగి ఉన్నాడు. ముఖ్యంగా మైక్ టైసన్ తో సన్నివేశం వచ్చినప్పుడు విజయ్ మానసికంగా దృడంగా ఉండాలని పూరి చెప్పారు. ఈ సినిమా కోసం విజయ్ తనను తాను పూర్తిగా సిద్ధం చేసుకున్నారు అంటూ చెప్పుకొచ్చారు.

View this post on Instagram

A post shared by Kuldep Sethi (@kuldepsethi)

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.