Vaishnav Tej: సాయి ధరమ్ తేజ్ ఆరోగ్యంపై స్పందించిన వైష్ణవ్.. ఏమని చెప్పారంటే..
మెగా యంగ్ హీరో వైష్ణవ్ తేజ్ మొదటి సినిమా ఉప్పెనతో సూపర్ హిట్ అందుకున్నాడు. ఆ తర్వాత క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో
మెగా యంగ్ హీరో వైష్ణవ్ తేజ్ మొదటి సినిమా ఉప్పెనతో సూపర్ హిట్ అందుకున్నాడు. ఆ తర్వాత క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో కొండపొలం సినిమా చేస్తున్నాడు. ఇందులో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్గా నటిస్తోంది. సన్నపురెడ్డి వెంకట రామిరెడ్డి రాసిన ‘కొండపొలం’ నవల ఆధారంగా ఈ సినిమా రూపొందుతుండగా.. ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై సాయిబాబు జాగర్లమూడి, రాజీవ్ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇక ఇప్పటికే షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ మూవీ ఇటీవల సెన్సార్ కార్యక్రమాలను సైతం పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమయ్యింది. అక్టోబర్ 8న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలోనే సినిమా ప్రమోషన్స్ వేగవంతం చేశారు మేకర్స్.
ఇందులో భాగంగా.. వైష్ణవ్.. కొండపొలం ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటున్నాడు. ఈ సందర్భంగా వైష్ణవ్‌ను సాయి ఆరోగ్య పరిస్థితి గురించి చెప్పాలని కోరారు. దీంతో వైష్ణవ్ స్పందిస్తూ.. తేజ్ ఆరోగ్యం బాగుంది.. త్వరగా కోలుకుంటున్నారు. ప్రస్తుతం ఫిజికల్ థెరపీ జరుగుతోంది.. వారం రోజుల్లో ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యే అవకాశాలున్నాయని వివరించారు. గత నెలలో సాయి ధరమ్ తేజ్ తన స్పోర్ట్స్ బైక్ పై కెబుల్ బ్రిడ్డ్ నుంచి ఐకియా వైపు వెళ్తుండగా.. బైక్ స్కిడ్ అయి పడిపోయిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో తేజుకు తీవ్ర గాయాలు కావడంతో.. సమీపంలోని మెడికవర్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. అనంతరం అక్కడి నుంచి జూబ్లి హిల్స్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఇక తేజు నటించిన రిపబ్లిక్ సినిమా అక్టోబర్ 1న విడుదలై సూపర్ హిట్ అందుకుంది.
Also Read: Celebrity Divorce Couples: ఇప్పటివరకు సినీ ఇండస్ట్రీలో విడాకులు తీసుకున్న జంటలు వీళ్లే..
Samantha-NagaChaitanya: ముగిసిన అందమైన ప్రేమకథ.. సమంత-నాగచైతన్య విడాకులపై సురేఖావాణి రియాక్షన్..
Samantha – Naga Chaitanya: బ్యాడ్ న్యూస్‌లోనూ గుడ్ థింగ్.. చైతూ-సమంత మళ్లీ రీల్ మీద కలిసి..
Maa Elections 2021: సినీ పరిశ్రమలో మా ఎన్నికల హీట్.. బరిలో ఉన్న అభ్యుర్థుల జాబితా ఇదే..