Actor Suman: ఆ స్టార్ హీరోను లైఫ్‌లో మర్చిపోను.. నా కోసం మా ఇంటి గేటు దగ్గర ఎదురుచూశాడు
నటుడు సుమన్ తన జైలు జీవితం, కర్మ సిద్ధాంతం గురించి కీలక విషయాలను పంచుకున్నారు. తన నిర్దోషిత్వాన్ని నమ్ముతూ, మోసం చేసిన వారిని కర్మ చూసుకుంటుందని ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. కష్టకాలంలో మోహన్ బాబు, సుమలత కుటుంబం తనకు అందించిన సాయాన్ని మరువలేనిదిగా చెప్పుకొచ్చారు.

టాలీవుడ్ సీనియర్ నటుడు సుమన్ తన జీవితంలో ఎదుర్కొన్న అత్యంత క్లిష్టమైన పరిస్థితులను, ముఖ్యంగా జైలు జీవితాన్ని, ఆ సమయంలో ఆయనకు లభించిన సాయాన్ని ఓ ఇంటర్వ్యూలో వివరించారు. తనను ఎవరు మోసం చేశారో చెప్పలేనని, కానీ ఎప్పటికైనా కర్మ వారిని చూసుకుంటుందని గట్టిగా నమ్ముతానన్నారు. తన తల్లి పడిన బాధ తనను కలచివేసిందని, అందుకే ఈ మాటలు చెబుతున్నానని అన్నారు. తాను జైలులో ఉన్నప్పుడు.. తన మనస్సాక్షి ఎప్పుడూ తానొక నిర్దోషినని చెప్పేదని తెలిపారు. జైలులో తనకు స్నేహితులు లేరని, ఎవరూ తనతో స్నేహం చేయకుండా తనను రోజుకో సెల్‌కు మార్చేవారని చెప్పారు. క్లోజ్డ్ ప్రిజన్‌లో ఆటో శంకర్ లాంటి పెద్ద నేరస్థులు ఉండేవారని సుమన్ గుర్తుచేసుకున్నారు. ఖైదీలకు సరైన ఆహారం, వైద్య సదుపాయాలు అందేవి కాదని.. నక్సలైట్లు కూడా తన వార్డు పక్కనే ఉండేవారని, వారితో వేరే వ్యక్తులు గోడల మీదుగా ఆహారం నాణ్యత లాంటి విషయాలపై మాట్లాడేవారని చెప్పుకొచ్చారు. కరుణానిధి రాజకీయ ఖైదీగా వచ్చినప్పుడు తన కేసును బయటకు తీయించారని, ఆ తర్వాత సాధారణ సెల్‌కు మార్చారని సుమన్ వివరించారు.
ఇది చదవండి: మటన్ బోటీ ఇలా తింటున్నారా.! అయితే విషంతో సమానం..
జైలు నుంచి బయటకు వచ్చిన రోజు సుమలత కుటుంబం, ఆమె తల్లి, సోదరి వచ్చి తనను జైలు వద్ద స్వాగతించారని సుమన్ తెలిపారు. ఆ మరుసటి రోజు ఉదయాన్నే మోహన్ బాబు తన ఇంటికి వచ్చారని, గేటు వద్దే తన కోసం ఎదురుచూశారని చెప్పారు. ఆయన వచ్చి పూలదండ వేసి, షిరిడీ సాయిబాబా ఆశీర్వాదాలతో మళ్లీ సినిమా ఇండస్ట్రీలోకి వస్తావని, భయపడాల్సిన అవసరం లేదని, నీ స్థానం నీకే వస్తుందని ధైర్యం చెప్పారని సుమన్ పేర్కొన్నారు. ఆ కష్టకాలంలో మోహన్ బాబు లాంటి వ్యక్తి వచ్చి ధైర్యం చెప్పడం తనకెంతో అండగా నిలిచిందని, ఆ సంఘటనను తాను ఎప్పటికీ మర్చిపోలేనని అన్నారు. మోహన్ బాబు ఉన్నది ఉన్నట్టు ముఖంపై మాట్లాడే వ్యక్తి అని, బయట ఆయన కోపిష్టి అని పేరున్నా, ఆయనది గోల్డెన్ హార్ట్ అని సుమన్ తెలిపారు. తన పెళ్లి సమయంలో కూడా మోహన్ బాబు ఉదయం 5:30 గంటలకే వివాహ మండపానికి వచ్చి చందనం, గార్లాండ్స్ ఇచ్చారని, ఆయన హెల్ప్ ఎల్లప్పుడూ తనకు గుర్తుంటుందని చెప్పారు. కండిషనల్ బెయిల్ తర్వాత మదురై, చెంగల్పేటలలో ఉండి.. ఏ.ఎం. స్టూడియోలో షూటింగ్‌లు చేశానని వివరించారు.
ఇది చదవండి: జబర్దస్త్‌లో సుధీర్, హైపర్ ఆది కంటే ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకున్నది అతడే..
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ చూడండి..




