సుధీర్​బాబు​ సిక్స్ ప్యాక్ లుక్

యువ​ హీరో సుధీర్​బాబు.. ఫిట్​నెస్​కు ఇచ్చే చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు. ఆయన ప్రతి సినిమాలో జిమ్ బాడీతోనే కనిపిస్తారు.

సుధీర్​బాబు​ సిక్స్ ప్యాక్ లుక్
Follow us
Ram Naramaneni

|

Updated on: Sep 13, 2020 | 9:01 PM

యువ​ హీరో సుధీర్​బాబు.. ఫిట్​నెస్​కు ఇచ్చే చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు. ఆయన ప్రతి సినిమాలో జిమ్ బాడీతోనే కనిపిస్తారు. ఎప్పుడూ భిన్నమైన, కష్టంగా ఉండే  వర్కువుట్స్ చేసి వాటిని నెటిజన్లతో పంచుకుంటుంటారు. ఇటీవల ‘వి’ సినిమాతో ఆడియెన్స్ ముందుకు వచ్చారు సుధీర్​బాబు. ఈ చిత్రం ఎంట్రీ సీన్​లో​..​ సుధీర్​పై ప్లాన్​ చేసిన యాక్షన్​ సీక్వెన్స్ కు ఫ్యాన్స్ ఫిదా అయ్యారు. సిక్స్​ ప్యాక్​తో చేతిలో తుపాకీ పట్టుకొని రౌడీలను చితక్కొట్టాడు ఈ యంగ్ హీరో.

తాజాగా ఆ సీన్ షూటింగ్ లో రెండు డంబుల్స్​ పట్టుకొని వర్కౌట్​ చేసిన ఫొటోలను.. ట్విట్టర్​ పోస్ట్​ చేశారు సుధీర్​. ప్రజంట్ వైరల్​గా మారిన ఆ స్టిల్స్​… నెటిజన్లను ఓ రేంజ్ లో ఆకట్టుకుంటున్నాయి. కాగా సెప్టెంబర్ 5న అమెజాన్ ప్రైమ్​లో  ‘వి’ సినిమా విడుదలైన సంగతి తెలిసిందే.
Also Read :