Srikanth: ఊహకు ఇష్టం లేకున్నా ఫంక్షన్లకు తీసుకెళుతున్నా.. నటుడు శ్రీకాంత్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

టాలీవుడ్ సీనియర్‌ హీరో, నటుడు శ్రీకాంత్‌ - ఊహ దంపతులు విడాకులు తీసుకుంటున్నారనే ప్రచారం గత కొన్ని రోజులుగా జరుగుతోంది. వీటిపై గతంలోనే స్పందించారు శ్రీకాంత్‌. తమ దాంపత్య జీవితంపై వస్తోన్న రూమర్లను కొట్టిపారేశారు.

Srikanth: ఊహకు ఇష్టం లేకున్నా ఫంక్షన్లకు తీసుకెళుతున్నా.. నటుడు శ్రీకాంత్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
Srikanth Family
Follow us
Basha Shek

|

Updated on: Mar 24, 2023 | 11:56 AM

టాలీవుడ్ సీనియర్‌ హీరో, నటుడు శ్రీకాంత్‌ – ఊహ దంపతులు విడాకులు తీసుకుంటున్నారనే ప్రచారం గత కొన్ని రోజులుగా జరుగుతోంది. వీటిపై గతంలోనే స్పందించారు శ్రీకాంత్‌. తమ దాంపత్య జీవితంపై వస్తోన్న రూమర్లను కొట్టిపారేశారు. తాజాగా మరోసారి విడాకుల ప్రచారంపై స్పందించారు శ్రీకాంత్. తన పుట్టిన రోజు (మార్చి 23) సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన సోషల్‌ మీడియా ప్రచారంపై కాస్త ఘాటుగా రియాక్టయ్యారు. సామాజిక మాధ్యమాల్లో ఎవరికి నచ్చినట్లు వాళ్లు రాస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ‘సెలబ్రిటీల వ్యక్తిగత జీవితాలపై సోషల్‌ మీడియాలో ఎలా పడితే అలా రాసేస్తున్నారు. కొన్ని వార్తలు మరీ దారుణంగా ఉంటున్నాయి. ఒకసారి నేను చనిపోయినట్లు ఫొటో కూడా పెట్టేశారు. అలాంటివి చూసినప్పుడు బాధగా ఉంటుంది. నేను కాబట్టి తట్టుకున్నా.. అదే మా ఫ్యామిలీకి తెలిస్తే అసలు తట్టుకోలేరు. ముఖ్యంగా అమ్మ వాళ్లకు తెలిస్తే చాలా బాధపడడతారు. ఆ షాకింగ్‌లో వారికి ఏమైనా అవ్వొచ్చు. అలా అబద్ధపు వార్తలు రాసే వారిపై ఎలాంటి చర్యలు తీసుకోవాలనుకున్నా ఫలితం ఉండదు. వ్యక్తిగతంగా వారిలోనే మార్పు రావాలి’

‘ ఇక ఊహతో నేను విడాకులు తీసుకుంటున్నట్లు రూమర్లు క్రియేట్‌ చేశారు. వీటి కారణంగానే ఎక్కడికెళ్లినా మేం కలిసి వెళ్తున్నాం (నవ్వుతూ). నిజం చెప్పాలంటే ఏదైనా ఈవెంట్‌కు రావాలంటే నా భార్యకు పెద్దగా ఇష్టముండదు. ఈ విషయం సినిమా ఇండస్ట్రీలో‌ చాలామందికి తెలుసు. ఇక ఇటీవల కోట శ్రీనివాసరావు మరణించారని రూమర్స్‌ చూసి షాక్‌కు గురయ్యా’ అని శ్రీకాంత్ పేర్కొన్నారు. ఇక సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం రామ్‌చరణ్‌ RC 15 తో పాటు పలు సినిమాల్లో నటిస్తున్నారు శ్రీకాంత్‌.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..