Ram Charan: రామ్ చరణ్ సినిమాలో శ్రీకాంత్ రోల్ అదే.. ఆర్సీ 15 గురించి ఇంట్రెస్టింగ్ న్యూస్ చెప్పిన హీరో..

అవుట్ అండ్ అవుట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ గా రూపొందిన వరిసు చిత్రంలో హీరో శ్రీకాంత్ కీలక పాత్ర పోషించారు. ఇప్పటికే విడుదలైన సాంగ్స్, పోస్టర్స్ హైప్ క్రియేట్ చేయగా.. ఇప్పటికే అన్ని పనులు పూర్తిచేసుకున్న ఈ మూవీని సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల చేయనున్నారు

Ram Charan: రామ్ చరణ్ సినిమాలో శ్రీకాంత్ రోల్ అదే.. ఆర్సీ 15 గురించి ఇంట్రెస్టింగ్ న్యూస్ చెప్పిన హీరో..
Srikanth, Ram Charan
Follow us
Rajitha Chanti

|

Updated on: Jan 04, 2023 | 11:00 AM

తమిళ్ స్టార్ దళపతి విజయ్.. సక్సెస్ ఫుల్ డైరెక్టర్ వంశీ పైడిపల్లి కాంబోలో రాబోతున్న సినిమా వరిసు. తెలుగులో ఈ సినిమాను వారసుడు టైటిల్ తో తీసుకురాబోతున్నారు. ఇందులో విజయ్ సరసన రష్మిక మందన్న నటిస్తుండగా.. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్..పివిపి సినిమా బ్యానర్ల పై నిర్మాతలు దిల్ రాజు, శిరీష్, పరమ్ వి పొట్లూరి నిర్మిస్తున్నారు. అవుట్ అండ్ అవుట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ గా రూపొందిన ఈ చిత్రంలో హీరో శ్రీకాంత్ కీలక పాత్ర పోషించారు. ఇప్పటికే విడుదలైన సాంగ్స్, పోస్టర్స్ హైప్ క్రియేట్ చేయగా.. ఇప్పటికే అన్ని పనులు పూర్తిచేసుకున్న ఈ మూవీని సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల చేయనున్నారు. ఈ క్రమంలో చిత్ర ప్రచార కార్యక్రమాల్లో భాగంగా శ్రీకాంత్ పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. అలాగే రామ్ చరణ్, డైరెక్టర్ శంకర్ కాంబోలో రాబోతున్న మూవీ గురించి ఇంట్రెస్టింగ్ అంశాలను బయటపెట్టారు.

వారసుడు చిత్రంలో విజయ్ కు సోదరుడిగా కనిపించబోతున్నాడు శ్రీకాంత్. ఆర్సీ 15 సినిమా గురించి మాట్లాడుతూ.. డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో పనిచేయడం కొత్తగా ఉందన్నారు. మొదటిసారి శంకర్ దర్శకత్వంలో సినిమా చేస్తున్నాను. ఇప్పటివరకు ఎప్పుడూ చూడని ఓ సరికొత్త అనుభూతిని ఆయన షూటింగ్లో చూశాను. అక్కడ వర్క్ చేసే విధానం కూడా చాలా కొత్తగా అనిపించింది. ఈ సినిమాలో నా రోల్ చాలా స్పెషల్ గా ఉండబోతుంది. మీరు ఎప్పుడూ చూడని ఓ శ్రీకాంత్ ను మీరు చూడబోతున్నారు అంటూ చెప్పుకొచ్చారు.

రామ్ చరణ్, శంకర్ కాంబోలో రాబోతున్న ఆర్సీ 15 పొలిటికల్ నేపథ్యంలో రాబోతుంది. ఇందులో చరణ్ ద్విపాత్రాభినయం చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈ చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ, అంజలి హీరోయిన్లుగా నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

నువ్వు గల్లీ క్రికెట్‌ ఆడుతున్నావా? జైస్వాల్‌కు రోహిత్ వార్నింగ్
నువ్వు గల్లీ క్రికెట్‌ ఆడుతున్నావా? జైస్వాల్‌కు రోహిత్ వార్నింగ్
ఇంటి వద్దనే డైట్ చేస్తూ ఏకంగా 18 కేజీల బరువు తగ్గిన లేడీ..
ఇంటి వద్దనే డైట్ చేస్తూ ఏకంగా 18 కేజీల బరువు తగ్గిన లేడీ..
హార్మోన్ ఇన్‌‌బ్యాలెన్స్ వల్లే కంట్రోల్ తప్పాను.. విష్ణుప్రియ
హార్మోన్ ఇన్‌‌బ్యాలెన్స్ వల్లే కంట్రోల్ తప్పాను.. విష్ణుప్రియ
Jio, Airtel నుంచి దిమ్మదిరిగే ప్లాన్‌.. రూ.650తో ఏడాది పాటు డేటా
Jio, Airtel నుంచి దిమ్మదిరిగే ప్లాన్‌.. రూ.650తో ఏడాది పాటు డేటా
యాదాద్రి జిల్లాలో నకిలీ కరెన్సీ కలకలం..కేటుగాళ్ల టార్గెట్‌ ఎవరంటే
యాదాద్రి జిల్లాలో నకిలీ కరెన్సీ కలకలం..కేటుగాళ్ల టార్గెట్‌ ఎవరంటే
అప్పటి వరకు చెప్పులు వేసుకోను.. అన్నామలై సంచలన ప్రకటన
అప్పటి వరకు చెప్పులు వేసుకోను.. అన్నామలై సంచలన ప్రకటన
ఫ్రిజ్ వాడుతున్నారా? అయితే ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!
ఫ్రిజ్ వాడుతున్నారా? అయితే ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!
ఈ పండు క్యాన్సర్‌ని కూడా నయం చేస్తుంది..! రోజుకు రెండు తింటే చాలు
ఈ పండు క్యాన్సర్‌ని కూడా నయం చేస్తుంది..! రోజుకు రెండు తింటే చాలు
గోల్డ్ లోన్ కంపెనీలు మీ బంగారాన్ని ఎందుకు వేలం వేస్తున్నాయి?
గోల్డ్ లోన్ కంపెనీలు మీ బంగారాన్ని ఎందుకు వేలం వేస్తున్నాయి?
పెళ్లిళ్లలో క్యాటరింగ్ గర్ల్.. ఇప్పుడు నెట్టింట ఫేమస్..
పెళ్లిళ్లలో క్యాటరింగ్ గర్ల్.. ఇప్పుడు నెట్టింట ఫేమస్..