Aha Unstoppable: బాలయ్య షోలో మరో క్రేజీ కాంబో.. ఆ యంగ్ డైనమిక్ లీడర్‌తో కలిసి సందడి చేయనున్న రామ్‌చరణ్!
మంత్రి కేటీఆర్ - మెగా హీరోల మధ్య సత్సంబంధాలు ఉన్నాయి. గతంలో మెగా ఫ్యామిలీకి సంబంధించిన పలు ఈవెంట్లకు కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముఖ్యంగా చెర్రీ ధ్రువ సినిమా ఆడియో ఫంక్షన్‌లో కేటీఆర్ ఇచ్చిన ప్రసంగం అప్పట్లో హైలెట్‌గా నిలిచింది.
నందమూరి బాలకృష్ణ హోస్ట్‌గా వ్యవహరిస్తోన్న అన్‌స్టాపబుల్ షో మరో క్రేజీ కాంబినేషన్‌కు వేదిక కానుందా? మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్, యంగ్ అండ్ డైనమిక్ లీడర్ కేటీఆర్ కలిసి ఈ టాక్ షోలో సందడి చేయనున్నారా? ఇందులో నిజమెంతుందో తెలియదు కానీ ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ విషయంపైనే విస్తృతంగా చర్చ సాగుతోంది. అలాగే సినీ – పొలిటికల్ సర్కిల్స్ లోనూ చెర్రీ- కేటీఆర్ కాంబినేషన్‌పై పెద్ద ఎత్తున ఆసక్తి కనిపిస్తోంది. మంత్రి కేటీఆర్ – మెగా హీరోల మధ్య సత్సంబంధాలు ఉన్నాయి. గతంలో మెగా ఫ్యామిలీకి సంబంధించిన పలు ఈవెంట్లకు కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముఖ్యంగా చెర్రీ ధ్రువ సినిమా ఆడియో ఫంక్షన్‌లో కేటీఆర్ ఇచ్చిన ప్రసంగం అప్పట్లో హైలెట్‌గా నిలిచింది. తండ్రి మెగాస్టార్.. బాబాయి పవర్ స్టార్.. అబ్బాయి మెగా పవర్ స్టార్ అంటూ ఆయన చెప్పిన మాటలు మెగా అభిమానులను ఉర్రూతలూగించాయి. ఇక గతేడాది వచ్చిన పవన్ కల్యాణ్ భీమ్లానాయక్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు కూడా వచ్చారు కేటీఆర్. ఈనేపథ్యంలో మంత్రి కేటీఆర్.. హీరో రాంచరణ్ మధ్య ఉన్న దోస్తీని హైలైట్ చేస్తూ అన్‌స్టాపబుల్ ఎపిసోడ్ ను సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది.
దీనికి తగ్గట్లుగానే ఇటీవల రిలీజైన ప్రభాస్ ఎపిసోడ్‌లో బాలయ్య- చెర్రీల మధ్య ఆసక్తికర సంభాషణ జరిగింది. షోలో భాగంగా చెర్రీకి కాల్ చేసి మాట్లాడాడు డార్లిండ్. అందులో భాగంగా ఒక్క పిలుపు దూరంలో ఉన్నాను, పిలిస్తే షోకి వచ్చేస్తానని చరణ్, బాలయ్యతో అన్నాడు. అది సరదాగా అన్నాడో లేదా నిజంగా అన్నాడో తెలియదు కానీ అభిమానులు మాత్రం ఈ క్రేజీ కాంబో గురించి తెగ చర్చించుకుంటున్నారు. సంక్రాంతిలోపే చెర్రీ- కేటీఆర్ ఎపిసోడ్ షూటింగ్‌ను పూర్తి చేసి విడుదల చేసే పనిలో ఆహా యాజమాన్యం ఉన్నట్లు వినికిడి. కాగా ఇప్పుడు అందరి దృష్టి బాలయ్య- పవర్ కల్యాణ్ ఎపిసోడ్‌పైనే ఉంది. ఇప్పటికే షూటింగ్ కూడా పూర్తయినట్లు తెలుస్తోంది. దీంతో ఎప్పుడెప్పుడూ ఈ షో ప్రసారమవుతుందా? అని ఇటు మెగా అభిమానులు, అటు నందమూరి అభిమానులు వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు.
#NandamuriBalakrishna planning to get both #RamCharan & #KTR for an #UnstoppableWithNBKS2 episode
Dates are uncertain for now as RC is having prestigious golden globes event to attend in USA#RC15 pic.twitter.com/u3VHm1Sa7r
— South Cinemas™ (@SouthCinemas_) January 4, 2023
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..