Samantha: ‘ఆమెకు నువ్వు కావాలి’.. ఆసక్తికర ట్వీట్ చేసిన సమంత.. నెట్టింట వైరల్..

కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో సైలెంట్ గా ఉంటున్న సామ్.. కొత్త ఏడాదిలో ట్విట్టర్ వేదికగా అభిమానులతో ముచ్చటించింది. ఫాలోవర్స్ అడిగిన ప్రశ్నలకు ఓపిగ్గా సమాధానాలు చెప్పింది. ఈ క్రమంలోనే ఓ నెటిజన్ అడిగిన ప్రశ్నకు సామ్ స్పందిస్తూ.. ఆమెకు నువ్వు కావాలి అంటూ చేసిన ట్వీట్ ఇప్పుడు వైరలవుతుంది.

Samantha: 'ఆమెకు నువ్వు కావాలి'.. ఆసక్తికర ట్వీట్ చేసిన సమంత.. నెట్టింట వైరల్..
Samantha
Follow us

|

Updated on: Jan 04, 2023 | 11:26 AM

అతి తక్కువ సమయంలోనే అందం, అభినయంతో దక్షిణాదిలో టాప్ హీరోయిన్‏గా గుర్తింపు తెచ్చుకుంది సమంత. తెలుగుతోపాటు..తమిళంలోనూ పలు హిట్ చిత్రాల్లో నటించి మెప్పించింది. ఏమాయ చేసావే అంటూ తెలుగు తెరకు పరిచయమైన ఈ ముద్దుగుమ్మ..ప్రస్తుతం ఖుషి చిత్రంలో నటిస్తోంది. డైరెక్టర్ శివ నిర్వాణ దర్శకత్వంలో రౌడీ హీరో విజయ్ దేవరకొండ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. అయితే గత కొద్దిరోజులుగా ఈ సినిమా చిత్రీకరణకు దూరంగా ఉంటుంది సామ్. ఇటీవల యశోద సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ ఖాతాలో వేసుకున్న సామ్.. ఈ సినిమా డబ్బింగ్ సమయంలోనే తాను మయోసైటిస్ సమస్యతో బాధపడుతున్నట్లు అనౌన్స్ చేసి షాకిచ్చింది. దీంతో సామ్ త్వరగా కోలుకోవాలంటూ అటు అభిమానులు.. సినీ ప్రముఖులు ఆమె గురించి ప్రార్ధిస్తూ సమంతకు మద్దతు తెలుపుతున్నారు. కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో సైలెంట్ గా ఉంటున్న సామ్.. కొత్త ఏడాదిలో ట్విట్టర్ వేదికగా అభిమానులతో ముచ్చటించింది. ఫాలోవర్స్ అడిగిన ప్రశ్నలకు ఓపిగ్గా సమాధానాలు చెప్పింది. ఈ క్రమంలోనే ఓ నెటిజన్ అడిగిన ప్రశ్నకు సామ్ స్పందిస్తూ.. ఆమెకు నువ్వు కావాలి అంటూ చేసిన ట్వీట్ ఇప్పుడు వైరలవుతుంది. ఇంతకీ ఆ నెటిజన్ ఏం క్వశ్చన్ వేసాడో తెలుసుకుందామా..

సరోగసి నేపథ్యంలో లేడీ ఓరియెంటెడ్ గా వచ్చిన యశోద సినిమాతో సూపర్ హిట్ అందుకుంది సామ్. ఇందులో ఆమె నటనకు ప్రశంసలు అందుకుంది. ఇక ఇదే విషయాన్ని ఇటీవల ఫ్యాన్స్ కూడా ట్వీట్టర్ వేదికగా తెలియజేశారు. ఈ సందర్భంగా ఓ నెటిజన్… “నేను ఇక్కడ ఉన్నాను అని చెబితే మీరు ఏమంటారు.. నేను ఎవరో కూడా తెలియని ఓ అమ్మాయి కోసం రోజూ ప్రార్ధిస్తున్నాను.. ఆ అమ్మాయివి నువ్వే” అంటూ ట్వీట్ చేశాడు. ఇందుకు సామ్ స్పందిస్తూ.. “ఆ అమ్మాయికి నువ్వు కావాలి” అంటూ రిప్లై ఇచ్చింది. ప్రస్తుతం సామ్ చేసిన ట్వీట్ నెట్టింట వైరలవుతుంది.

ఇవి కూడా చదవండి

అలాగే మరో నెటిజన్ జస్ట్ ఉమెన్ రైజ్ జస్ట్ టూ ఫాల్ అంటూ ట్విట్ చేయగా.. మరో నెటిజన్ జస్ట్ పడిపోవడానికే అంటూ ట్రోల్ చేసే ప్రయత్నం చేశారు. ఇందుకు సామ్ స్పందిస్తూ.. బ్యాకప్ చేయడమనేది మరింత మధురంగా మారేందుకు మిత్రమా అంటూ సున్నితంగా రిప్లై ఇచ్చింది. అలాగే సామ్ బాలీవుడ్ ప్రాజెక్ట్స్ నుంచి తప్పుకున్నట్లు వస్తున్న వార్తలలో అస్సలు నిజం లేదని.. ఆమె సినిమాల నుంచి తప్పుకోలేదని.. కేవలం విశ్రాంతి మాత్రమే తీసుకుంటున్నారని.. త్వరలోనే షూటింగ్ లో పాల్గొననున్నట్లు ఆమె పర్సనల్ టీం చెప్పుకొచ్చింది.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.