Arjun Phalguna Pre Release Event: అర్జున ఫల్గుణ ప్రీరిలీజ్ ఈవెంట్..లైవ్..
విభిన్న నేపథ్యంగల చిత్రాలను ఎంచుకుంటూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు యంగ్ హీరో శ్రీవిష్ణు. విభిన్న మైన కథలను

విభిన్న నేపథ్యంగల చిత్రాలను ఎంచుకుంటూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు యంగ్ హీరో శ్రీవిష్ణు. విభిన్న మైన కథలను ఎంచుకుంటూ.. కెరీర్ పరంగా దూసుకుపోతున్నాడు ఈ కుర్ర హీరో. ప్రస్తుతం ఈ హీరో ప్రధాన పాత్రలో అర్జున ఫల్గుణ సినిమా తెరకెక్కుతుంది. ఎన్ ఎమ్ పాషా కో ప్రొడ్యూసర్‌గా మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ మీద ఈ చిత్రాన్ని నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి నిర్మిస్తున్నారు. ఇందులో శ్రీవిష్ణు జోడిగా అమృత అయ్యర్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ చిత్రానికి కథ, కథనం, దర్శకత్వ బాధ్యతలను తేజ మర్ని నిర్వహిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన సాంగ్స్, టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఈ చిత్రానికి పి. సుధీర్ వర్మ మాటలు అందించారు. పి. జగదీష్ చీకటి.. సినిమాటోగ్రాఫర్‌గా పనిచేశారు. నరేష్, శివాజీ రాజా, సుబ్బ రాజు, దేవీ ప్రసాద్, రంగస్థలం మహేష్, రాజ్ కుమార్ చౌదరి (రాజా వారు రాణి గారు ఫేమ్), చైతన్య (మిడిల్ క్లాస్ మెలోడీస్ ఫేమ్) తదితరులు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.
ఇప్పటికే షూటింగ్ పూర్తైన ఈ మూవీ డిసెంబర్ 31న థియేటర్లలో విడుదల కానుంది. ఈ క్రమంలో ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్‌ను ఈరోజు సాయంత్రం హైద్రాబాద్‌లో ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని టీవీ9 తెలుగులో లైవ్వో చూడొచ్చు.
Manchu Manoj COVID-19 Positive: టాలీవుడ్‌లో మళ్లీ మహమ్మారి కలకలం.. కుర్ర హీరోకు కరోనా పాజిటివ్