Happy BirthDay SonuSood: అమ్మ మాటలే అతని బలం.. ఆ ధైర్యంతోనే ముందుకెళ్తున్న సోనూ సూద్.

తన విలక్షణ నటనతో ప్రేక్షకులను మెప్పించే సోనూసూద్ గురించి ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన ఆవసరం లేదు. తన నటనతో అభిమానులను సొంతం చేసుకున్న సోనూ.. తన సేవాగుణంతో అంతకు మించి అభిమానులను సొంతం చేసుకున్నాడు. కరోనా మహమ్మారి ప్రజల ప్రాణాలు తీస్తున్న సమయంలో.. అందరూ భయపడి బతుకుతున్న సమయంలో నేనున్నా అంటూ బయటకు వచ్చి ఎంతో మందికి సాయం చేశారు.

Happy BirthDay SonuSood: అమ్మ మాటలే అతని బలం.. ఆ ధైర్యంతోనే ముందుకెళ్తున్న సోనూ సూద్.
Sonu Sood
Follow us
Rajeev Rayala

|

Updated on: Jul 30, 2024 | 9:27 AM

రీల్ హీరోలు మనదగ్గర చాలా మంది ఉన్నారు. కానీ రియల్ హీరోలు మాత్రం చాలా అరుదు. సినిమాల్లోనే కాదు రియల్ లైఫ్ లో సేవాకార్యక్రమాలతో ప్రేక్షకుల చేత దేవుడు అని పిలిపించుకున్న వారు చాలా తక్కువ వారిలో ముందు వరసలో ఉంటారు సోనూసూద్. తన విలక్షణ నటనతో ప్రేక్షకులను మెప్పించే సోనూసూద్ గురించి ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన ఆవసరం లేదు. తన నటనతో అభిమానులను సొంతం చేసుకున్న సోనూ.. తన సేవాగుణంతో అంతకు మించి అభిమానులను సొంతం చేసుకున్నాడు. కరోనా మహమ్మారి ప్రజల ప్రాణాలు తీస్తున్న సమయంలో.. అందరూ భయపడి బతుకుతున్న సమయంలో నేనున్నా అంటూ బయటకు వచ్చి ఎంతో మందికి సాయం చేశారు. సరైన సమయంలో ప్రజలను ఆడుకొని దేవుడు అయ్యారు సోనూ సూద్.

ఇది కూడా చదవండి :Tanushree Dutta: వాళ్లు ఆ పని చేయొచ్చు.. కానీ నేను చేస్తే తప్పా..! తను శ్రీ కామెంట్స్ 

నేడు ఈ రియల్ సూపర్ హీరో పుట్టిన రోజు. సోషల్ మీడియా వేదికగా సోనూ సూద్ కు అభిమానులు, సినీ ప్రముఖులు విషెస్ తెలుపుతున్నారు. సోషల్ మీడియాలో సోనూ సూద్ అభిమానులు ఆయన చేసిన మంచి పనుల్ని గుర్తు చేసుకుంటున్నారు. కేవలం కరోనా సమయంలోనే కాదు.. ఇప్పటికి సాయం కోరిన ప్రతిఒక్కరికి లేదనకుండా.. కాదనకుండా సాయం చేస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ సేవాగుణం తనకు తన తల్లి ద్వారా వచ్చిందని తెలిపారు సోనూ సూద్.

ఇది కూడా చదవండి :Shree Rapaka: నేను దుస్తులులేకుండా కనిపిస్తే ఆ దర్శకుడు ఊరుకుంటాడా..? శ్రీ రాపాక సెన్సేషనల్ కామెంట్స్

గతంలో ఓ సందర్భంగా తాను చేసుతున్న సేవ కార్యక్రమాల గురించి మాట్లాడుతూ.. కరోనా సమయంలో వలస కార్మికుల  కష్టాలు చూసి తట్టుకోలేకపోయాను.. ఎలాగైనా వారికి సాయం చేయాలని అనుకున్నాను..అందుకే సొంత ఊర్లకు వెళ్ళాలి అనుకున్నవారికి ప్రత్యేకంగా బస్సులను ఏర్పాటు చేసి ఇళ్లకు చేర్చానని తెలిపాడు సోనూ.. కరోనా సమయంలో ఉద్యోగాలు పోగొట్టుకున్న వారికి సాయం చేసేందుకు కార్పోరేట్ సంస్థలతో సంప్రదించి రెండు లక్షల మందికి ఉద్యోగాలు కల్పించా అని తెలిపారు. అలాగే ఎప్పుడూ తన అమ్మ చెబుతుండేదని.. నువ్వు ఒకరికి సహయం చేస్తే వారి నుంచి వచ్చే దివేనలు నీకు ఇంకా సంతోషాన్ని ఇస్తాయని.. తన అమ్మ చెప్పిన మాటలతో ముందుకు వెళ్తున్నా అని అమ్మమాటాలను గుర్తు చేసుకున్నారు సోనూసూద్. ఇక సినిమాల్లో విలక్షణ పాత్రలు చేస్తూ, మరోవైపు తన సేవా కార్యక్రమాలతో దూసుకుపోతున్నాడు సోనూ..

సోనూసూద్ ఇన్ స్టా గ్రామ్ లేటెస్ట్ పోస్ట్..

View this post on Instagram

A post shared by Sonu Sood (@sonu_sood)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి