Takkar Movie Pre Release Event: సిద్ధార్థ్.. దివ్యాంక కౌశిక్.. ‘టక్కర్’ ప్రీ రిలీజ్ ఈవెంట్..
చాలా కాలం తర్వాత సిద్ధార్థ్ ప్రధాన పాత్రలో నటిస్తోన్న చిత్రం టక్కర్. ఈ చిత్రానికి కార్తీక్ జి. క్రిష్ దర్శకత్వం వహిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్, పాషన్ స్టూడియోస్ తో కలిసి టీజీ విశ్వప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇందులో సిద్ధార్థ్ సరసన దివ్యాంక కౌశిక్ కథానాయికగా నటిస్తున్నారు.

ఒకప్పుడు హీరోగా సిద్ధార్థ్ కు మంచి ఫాలోయింగ్ ఉండేది. బొమ్మరిల్లు సినిమాతో ఈ హీరో క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. తెలుగులో ఎక్కువ మంది అభిమానులను సొంతం చేసుకున్న ఈ హీరోకు ఆ తర్వాత వరుస ప్లాపులు వచ్చాయి. దీంతో సినిమాలు తగ్గిపోయాయి. చాలా కాలం తర్వాత సిద్ధార్థ్ ప్రధాన పాత్రలో నటిస్తోన్న చిత్రం టక్కర్. ఈ చిత్రానికి కార్తీక్ జి. క్రిష్ దర్శకత్వం వహిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్, పాషన్ స్టూడియోస్ తో కలిసి టీజీ విశ్వప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇందులో సిద్ధార్థ్ సరసన దివ్యాంక కౌశిక్ కథానాయికగా నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన సాంగ్స్, పోస్టర్స్ ఆకట్టుకున్నాయి. ఇక ఈ మూవీ జూన్ 9న తెలుగుతోపాటు తమిళంలోనూ విడుదల కాబోతుంది. ఈ క్రమంలో ఆదివారం (జూన్ 4న) ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహిస్తున్నారు మేకర్స్. ఈ వేడుకను టీవీ9 తెలుగులో ప్రత్యేక ప్రసారం వీక్షించవచ్చు.




మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.