Actor Sharat Kumar: ప్రముఖ నటుడు శరత్ కుమార్‌కు అస్వస్థత.. అపోలో ఆస్పత్రికి తరలింపు..
ప్రముఖ నటుడు శరత్ కుమార్ అస్వస్థతకు గురయ్యారు. దాంతో ఆయన చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో చేరారు. విషయం తెలుసుకున్న శరత్ కుమార్ భార్య రాధిక, కుమార్తె వరలక్ష్మి ఆస్పత్రికి చేరుకున్నారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ప్రముఖ నటుడు శరత్ కుమార్ అస్వస్థతకు గురయ్యారు. దాంతో ఆయన చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో చేరారు. విషయం తెలుసుకున్న శరత్ కుమార్ భార్య రాధిక, కుమార్తె వరలక్ష్మి ఆస్పత్రికి చేరుకున్నారు. అయితే, శరత్ కుమార్ అస్వస్థతకు డయేరియా, డీహైడ్రేషన్ కారణమని వైద్యులు చెబుతున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్లు తెలుస్తోంది. అయితే, ఇందుకు సంబంధించి అధికారిక సమాచారం తెలియాల్సి ఉంది. ఇక శరత్ కుమార్ అస్వస్థతకు గురయ్యారనే విషయం తెలియడంతో సినీ వర్గాలు, ఆయన అభిమానులు ఆందోళనకు గురయ్యారు. శరత్ కుమార్ త్వరగా కోలుకోవాలని, క్షేమంగా ఇంటికి తిరిగి రావాలని ఆకాంక్షిస్తున్నారు అభిమానులు. ఈ మేరకు ట్వీట్లు చేస్తున్నారు.
ఇదిలాఉంటే.. హీరో శరత్ కుమార్‌కు డిసెంబర్ 2020లో కరోనా పాటిజివ్ తేలిన విషయం తెలిసిందే. ఆ సమయంలో ఎలాంటి లక్షణాలు లేనప్పటికీ.. వైద్యుల పర్యవేక్షణలో చికిత్స తీసుకున్నారు. త్వరగా ఆ మహమ్మారి నుంచి బయటపడ్డారు. ఇప్పుడు మళ్లీ ఆయన అస్వస్థతకు గురవడంతో అభిమానుల్లో ఆందోళన నెలకొంది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..