Dhamaka: ‘రౌడీ అల్లుడు’కి మరో వెర్షన్‌లా ఉంటుందట మాస్ మహరాజా మూవీ..
ఇప్పటికే విడుదలైన ధమాకా పాటలు, టీజర్ అద్భుతమైన రెస్పాన్స్ తో సినిమాపై భారీ అంచనాలు పెంచాయి. రీసెంట్ గా రిలీజ్ అయిన దండకాడియాల్ సాంగ్ ప్రస్తుతం ట్రెండింగ్ లో ఉంది.

రవితేజ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ధమాకా.. కమర్షియల్ మేకర్ త్రినాథరావు నక్కిన మాస్ అండ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ గా ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు. రవితేజ సరసన టాలీవుడ్ ఫేవరేట్ హీరోయిన్ శ్రీలీల హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రాన్ని టిజి విశ్వ ప్రసాద్ భారీగా నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ధమాకా పాటలు, టీజర్ అద్భుతమైన రెస్పాన్స్ తో సినిమాపై భారీ అంచనాలు పెంచాయి. రీసెంట్ గా రిలీజ్ అయిన దండకాడియాల్ సాంగ్ ప్రస్తుతం ట్రెండింగ్ లో ఉంది. ఈ సినిమాతో మాస్ రాజా సూపర్ హిట్ అందుకోవడం పక్కా అంటున్నారు ఫ్యాన్స్. చిత్రయూనిట్ కూడా ఈ సినిమా పై ధీమాతో ఉన్నారు. డిసెంబర్ 23న ‘ధమాకా’ ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లో విడుదలౌతున్న నేపథ్యంలో ఈ చిత్రానికి కథ, స్క్రీన్‌ప్లే, సంభాషణలు అందించిన ప్రసన్న కుమార్ బెజవాడ ఈ సినిమా గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ప్రసన్న కుమార్ మాట్లాడుతూ.. రవితేజ గారిని ద్రుష్టిపెట్టుకొని ఆయన కోసమే రాసుకున్న కథ ఇది. ఆయన నుండి వరుసగా సీరియస్ సినిమాలు వస్తున్నాయి. రవితేజ గారి బలం ఎంటర్ టైన్ మెంట్. మా బలం కూడా అదే. ఇద్దరం కలసి మంచి ఎంటర్ టైనర్ చేయాలని ధమాకా చేశాం అన్నారు.
ఈ సినిమాలో రవితేజ డ్యూయల్ రోల్ చేస్తున్నారు. ఒక రిచ్ క్యారెక్టర్, ఒక పూర్ క్యారెక్టర్ వుంటుంది. ఒక ఇన్సిడెంట్ రెండు డిఫరెంట్ క్యారెక్టర్లు ఎలా చూస్తారనేదానిపై భేస్ అయిన సినిమా. రౌడీ అల్లుడికి మరో వెర్షన్ అనుకుంటున్నాను. ఇందులో రావు రమేష్ గారు హైపర్ ఆది కాంబినేషన్ అవుట్ స్టాండింగ్ గా వుంటుంది. వాళ్ళు కనిపిస్తే చాలు నవ్వుతారు. కొంతమందికి సినిమా చూపించాం. చూసిన వారంతా అవుట్ స్టాండింగ్ అంటున్నారు. అలీ గారి పాత్ర కూడా బావుటుంది. మచ్చ రవి గారు, సత్యం రాజేష్ గారి ఎపిసోడ్లు కూడా బావుంటాయి. హీరో హీరోయిన్ మధ్య సీక్వెన్స్ లు, ఆఫీస్ సీన్స్ హిలేరియస్ గా వుంటాయి. ఇంటర్వెల్ కి ముందు వచ్చే ఐదు నిమిషాల ఎపిసోడ్ సినిమా రేంజ్ ని డిసైడ్ చేసే ఎంటర్ టైన్ మెంట్ సీక్వెన్స్ అని చెప్పుకొచ్చారు ప్రసన్న.








