Satyadev: సూసైడ్ బాంబర్ అనుకొని అరెస్ట్ చేశారు.. ఎయిర్‏పోర్ట్ ఘటన పై హీరో సత్యదేవ్ కామెంట్స్ ..

గుర్తుందా శీతాకాలం ప్రమోషన్లలో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సత్యదేవ్.. ఫిల్మ్ కెరీర్... వ్యక్తిగత విషయాల గురించి ఆసక్తికర విషయాలను బయటపెట్టారు. ఈ క్రమంలోనే ఎయిర్ పోర్టులో ఎదురైన ఓ చేదు అనుభవం గురించి చెప్పుకొచ్చారు.

Satyadev: సూసైడ్ బాంబర్ అనుకొని అరెస్ట్ చేశారు.. ఎయిర్‏పోర్ట్ ఘటన పై హీరో సత్యదేవ్  కామెంట్స్ ..
Sathyadev
Follow us

|

Updated on: Dec 09, 2022 | 3:07 PM

వైవిధ్యమైన సినిమాలతో తెలుగు చిత్ర పరిశ్రమలో ప్రత్యేక స్థానం సంపాదించుకున్నాడు యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో సత్యదేవ్. ఇప్పటివరకు హీరోగా మెప్పించిన సత్యదేవ్.. ఇటీవల గాడ్ ఫాదర్ సినిమాతో విలన్‏గానూ అదరగొట్టాడు. ప్రతి నాయకుడిగా ఈ హీరో నటనకు ప్రశంసలు అందుకున్నాడు. తాజాగా ఆయన ప్రధాన పాత్రలో నటించిన గుర్తుందా శీతాకాలం ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇందులో మిల్కీ బ్యూటీ తమన్నా, మేఘా ఆకాష్ కీలకపాత్రలలో నటించారు. ఈ మూవీ ప్రమోషన్లలో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సత్యదేవ్.. ఫిల్మ్ కెరీర్… వ్యక్తిగత విషయాల గురించి ఆసక్తికర విషయాలను బయటపెట్టారు. ఈ క్రమంలోనే ఎయిర్ పోర్టులో ఎదురైన ఓ చేదు అనుభవం గురించి చెప్పుకొచ్చారు.

తనపై తన భార్యకు ఎక్కువగా నమ్మకం ఉంటుందని.. సినిమాల్లోకి వచ్చేందుకు ఆమె అడ్డు చెప్పలేదని.. తనకు ఎల్లప్పుడూ మద్దతు ఇస్తుందని అన్నారు. అలాగే తాను మెగాస్టార్ చిరంజీవికి ఏకలవ్య శిష్యూడిని అని.. కొదమ సింహం సినిమా చూసి ఫైట్ ఇంట్లో ప్రాక్టీస్ చేస్తే పడిపోయానని.. దీంతో ముఖంపై మచ్చగా ఆ దెబ్బ ఉండిపోయిందన్నారు. గాడ్ ఫాదర్ సినిమా కోసం వెళ్లి కలిసినప్పుడు చిరంజీవి చాలా సేపు మాట్లాడరని.. టిఫిన్ కూడా పెట్టారని.. ఆ ఫీలింగ్ మాటల్లో చెప్పలేని అంటూ చెప్పుకొచ్చారు.

ఇవి కూడా చదవండి

అలాగే సత్యదేవ్ మాట్లాడుతూ.. “ఒకసారి ఆఫ్గానిస్తాన్ వెళ్లాను. అక్కడ ఒకమ్మాయి వాట్ ఈజ్ ద పర్పస్ ఆఫ్ ది విజిట్ అంది. నేనేమో షూటింగ్ అన్నాను. అలా నా ముఖం వంక చూసింది. ఓ సారీ.. ఈ షూటింగ్ కాదు.. ఫిల్మ్ షూటింగ్ అన్నాను. ప్రపంచంలో ఇన్ని దేశాలు పెట్టుకుని.. ఆఫ్ఘనిస్తాన్‌ వచ్చావా.. ఆల్ ద బెస్ట్ అంది. నేను సూసైడ్ బాంబర్ అనుకుని.. నన్ను అరెస్ట్ చేసి తీసుకెళ్లిపోయారు. వాళ్ళు ట్రిగ్గర్ షూస్‌లో పెట్టుకుంటారట. పాస్ పోర్ట్ సాక్స్‌లో పెట్టాడు.. అంతే నా కర్మ కాలిపోయింది. సౌండ్స్ ఏమైనా వినిపించినప్పుడు వెనక్కి, ముందుకు కదిలేవాడిని. ఒకవేళ టార్గెట్ మిస్ అవ్వుద్దేమో అని ” అంటూ చెప్పుకొచ్చారు.