Sai Durga Tej: వరద బాధితులకు సాయం ప్రకటించిన మెగా హీరో.. రెండు రాష్ట్రాలకు సాయి దుర్గా తేజ్ విరాళం..

జూనియర్ ఎన్టీఆర్, మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్, బాలకృష్ణ, ప్రభాస్, అల్లు అర్జున్, మహేష్ బాబు, సిద్ధు జొన్నలగడ్డ, విశ్వక్ సేన్, అలీ, సోనూ సూద్, అనన్య నాగళ్ల, త్రివిక్రమ్, నిర్మాతలు భారీ విరాళాలను ప్రకటించారు. రెండు తెలుగు రాష్ట్రాల సీఎం సహయనిధులకు ఈ విరాళాలను అందజేయనున్నట్లు తెలిపారు. తాజాగా మరో మెగా హీరో వరద బాధితులకు అండగా నిలిచారు.

Sai Durga Tej: వరద బాధితులకు సాయం ప్రకటించిన మెగా హీరో.. రెండు రాష్ట్రాలకు సాయి దుర్గా తేజ్ విరాళం..
Sai Dharam Tej
Follow us
Rajitha Chanti

|

Updated on: Sep 04, 2024 | 10:14 PM

కొన్ని రోజులుగా కురిసిన భారీ వర్షాల కారణంగా తెలుగు రాష్ట్రాల్లో వరదలు భీభత్సం సృష్టిస్తున్నాయి. ముఖ్యంగా విజయవాడ, ఖమ్మంలోని చాలా ప్రాంతాలు జలమయమయ్యాయి. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు చేరుస్తూ.. వారికి ఆహారం, వైద్య సదుపాయాలు అందిస్తుంది ప్రభుత్వం. వరద బాధితులకు అండగా నిలిచేందుకు యావత్ సినీ పరిశ్రమ కదిలింది. జూనియర్ ఎన్టీఆర్, మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్, బాలకృష్ణ, ప్రభాస్, అల్లు అర్జున్, మహేష్ బాబు, సిద్ధు జొన్నలగడ్డ, విశ్వక్ సేన్, అలీ, సోనూ సూద్, అనన్య నాగళ్ల, త్రివిక్రమ్, నిర్మాతలు భారీ విరాళాలను ప్రకటించారు. రెండు తెలుగు రాష్ట్రాల సీఎం సహయనిధులకు ఈ విరాళాలను అందజేయనున్నట్లు తెలిపారు. తాజాగా మరో మెగా హీరో వరద బాధితులకు అండగా నిలిచారు. సుప్రీం హీరో సాయి దుర్గా తేజ్ సైతం వరద బాధితులకు విరాళం ప్రకటించారు.

రెండు తెలుగు రాష్ట్రాల సీఎం రిలీఫ్ ఫండ్స్ కు చెరో రూ.10 లక్షలు.. మొత్తం 20 లక్షలు ఇస్తున్నట్లు సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. “రెండు తెలుగు రాష్ట్రాల్లో వరదల కారణంగా ప్రజలు పడుతున్న కష్టాల్ని చూసి నా వంతు బాధ్యతగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సహాయ నిధులకి చెరో 10 లక్షలు.. అదే విధంగా విజయవాడ లో నేను మన మెగా అభిమానులు మరియు జనసైనికులు నడిపిస్తున్న అమ్మ ఆశ్రమం మరియు ఇతర స్వచ్ఛంద సంస్థలకు 5 లక్షలు. (మొత్తం 25 లక్షలు) నా వంతు విరాళం గా ప్రకటిస్తున్నాను. ఈ కష్టాలన్నీ త్వరగా సమసిపోవాలని దేవుడిని మనస్ఫూర్తిగా వేడుకుంటూ..మీ సాయి దుర్గ తేజ్..” అంటూ ట్వీట్ చేశారు.

ఇవి కూడా చదవండి

సాయి దుర్గా తేజ్ ట్వీట్..

మరోవైపు రామ్ చరణ్ సైతం వరద బాధితులకు అండగా నిలబడ్డారు. “వర్షాలు, వరదల వల్ల ఇబ్బందులు పడుతున్న తెలుగు రాష్ట్రాల ప్రజలకు మనం తోడుగా, అండగా ఉన్నామంటూ చేయూత అందించాల్సిన సమయం ఇది. నా వంతు బాధ్యతగా ఏపీ, తెలంగాణ రాష్ట్రాల సీఎం రిలీఫ్ ఫండ్ కు కోటి రూపాయలు ( Rs.1 Crore) విరాళంగా ప్రకటిస్తున్నాను. తెలుగు రాష్ట్రాల ప్రజలు ఈ పరిస్థితి నుంచి త్వరగా బయటపడాలని దేవుడిని ప్రార్థిస్తున్నాను.” అంటూ ట్వీట్ చేశారు.

రామ్ చరణ్ ట్వీట్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.