Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ram Charan: సముద్రతీరాన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.. సెల్ఫీల కోసం పోటీ పడ్డ ఫ్యాన్స్‌

రామ్ చరణ్, బాలీవుడ్ బ్యూటీ కియారా జంటగా నటిస్తున్న ఈ చిత్రాన్ని పాన్ ఇండియా లెవల్లో భారీగా స్థాయిలో నిర్మిస్తున్నారు. ఆర్ సి 15 అనే వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతోన్న

Ram Charan: సముద్రతీరాన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.. సెల్ఫీల కోసం పోటీ పడ్డ ఫ్యాన్స్‌
Ram Charan
Follow us
Rajitha Chanti

|

Updated on: May 10, 2022 | 8:21 AM

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) ప్రస్తుతం ఫుల్ బిజీగా ఉన్నాడు. ఇటీవలే ఆచార్య సినిమాతో ప్రేక్షకుల ముందుకు చరణ్.. ఇప్పుడు డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. రామ్ చరణ్, బాలీవుడ్ బ్యూటీ కియారా జంటగా నటిస్తున్న ఈ చిత్రాన్ని పాన్ ఇండియా లెవల్లో భారీగా స్థాయిలో నిర్మిస్తున్నారు. ఆర్ సి 15 అనే వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతోన్న ఈ మూవీ గురించి ఇప్పటికే చాలా వార్తలు ఫిలిం సర్కిల్స్ లో చక్కర్లు కొడుతున్నాయి. ఈ సినిమా పొలిటికల్ డ్రామాగా తెరకెక్కుతోందని కొందరు అంటుంటే మరికొందరు ఈ సినిమా సోషల్ మెసేజ్ ఇచ్చే మూవీ అంటూ చెప్పుకొచ్చారు. అయితే ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ విశాఖపట్నంలో జరుగుతుంది. ఆర్కే బీచ్ లో చరణ్ కి పోలీసులతో గొడవ జరిగే సీన్ ను షూట్ చేసినట్టు తెలుస్తుంది.

ఈ మూవీ షూటింగ్‌ కోసం ఈ నెల 4న విశాఖకొచ్చాడు చెర్రీ. అప్పటి నుంచి మధురవాడ, ఆర్కే బీచ్‌ రోడ్, తొట్లకొండ, రుషికొండ, అరకు ఫారెస్ట్ పరిసర ప్రాంతాలలో షూటింగ్ కొనసాగుతోంది. ప్రస్తుతం వైజాగ్‌లో కాలేజ్‌కి సంబంధించిన సన్నివేశాలు, ఆర్కే బీచ్ నేపథ్యంలో వచ్చే సీన్స్‌ను వైజాగ్‌లో చిత్రీకరించినట్టు తెలుస్తోంది. మరికొన్ని రోజుల పాటు ఈ షెడ్యూల్ వైజాగ్ లోనే కొనసాగనున్నట్టుగా సమాచారం. రామ్‌చరణ్‌ మధురవాడ వచ్చారనే విషయం తెలియడంతో అభిమానులు భారీగా తరిలివచ్చారు. హీరోతో ఫొటోలు తీసుకునేందుకు ఎగబడ్డారు. షూటింగ్‌ అనంతరం ఇక్కడకు వచ్చిన అభిమానులతో రామ్‌చరణ్‌ కాసేపు ముచ్చటించారు. ఐతే జనాన్ని కంట్రోల్ చేయడానికి టీమ్ చాలా ఇబ్బంది పడాల్సి వచ్చింది. దిల్‌ రాజు నిర్మిస్తున్న ఈ మూవీని త్వరగా కంప్లీట్‌ చేయాలనే ప్లాన్‌లో ఉంది మూవీ టీమ్‌. ఇప్పటికే ముంబై, పూణే, రాజమండ్రి, పంజాబ్‌లలో మేజర్‌ షెడ్యూళ్ళను పూర్తి చేశారు. తాజాగా వైజాగ్ లో మరో షెడ్యూల్ షూటింగ్‌ను కంప్లీట్‌ చేసే పనిలో పడ్డారు. ముందుగా ప్లాన్ చేసుకున్న ప్రకారం చకచకా కానిచ్చేస్తున్నారు. తమన్ సంగీతాన్ని అందిస్తున్న ఈసినిమాలో కియార అద్వాని హీరోయిన్‌గా నటిస్తోంది. చరణ్- కియారా కంబినేషన్ లో గతంలో వినయ విధేయ రామ సినిమా రూపొందింది. ఈ ఇద్దరి కాంబినేషన్లో వస్తున్న రెండో సినిమా ఇది. శ్రీకాంత్, సునీల్, అంజలి లాంటి స్టార్స్ ఈ సినిమాలో ముఖ్యమైన పాత్రల్లో కనిపించనున్నారు.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఇవి కూడా చదవండి

Also Read: Keerthy Suresh: షూటింగ్ టైంలో ఎప్పుడూ చూసిన రష్మిక పేరుతో పిలిచేవారు.. ఆసక్తికర కామెంట్స్ చేసిన కీర్తి సురేష్..

Mahesh Babu: ఆ సమయంలో నా గొంతు తడారిపోయింది.. ఆ తర్వాత మౌనంగా ఉండిపోయాను.. మహేష్ బాబు ఎమోషనల్ కామెంట్స్..

Sarkaru Vaari Paata: బయటికి కనిపించని పోలీస్ కథ.. సర్కారు వారి పాట కథపై డైరెక్టర్ క్లారిటీ..

Ante Sundaraniki: అంటే సుందరానికి నుంచి అందమైన మెలోడీ.. ఆకట్టుకుంటున్న ‘ఎంత చిత్రం’ పాట