Raja Saab Teaser: ప్రభాస్ ఫ్యాన్స్‌కు పండగలాంటి వార్త.. రాజాసాబ్ టీజర్ వచ్చేది అప్పుడేనా.. ?
తెలుగులో మోస్ట్ అవైటెడ్ చిత్రం రాజాసాబ్. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న ఈ హారర్ కామెడీ మూవీ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు. చాలా కాలం తర్వాత ప్రభాస్ నుంచి రాబోతున్న కామెడీ మూవీ కావడంతో ఈ సినిమాపై మరింత క్యూరియాసిటి నెలకొంది. ఈ క్రమంలో తాజాగా ఈ మూవీ గురించి ఓ క్రేజీ న్యూస్ నెట్టింట వైరలవుతుంది.

పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ హీరోగా నటిస్తోన్న చిత్రాల్లో రాజాసాబ్ ఒకటి. డైరెక్టర్ మారుతి దర్శకత్వం వహిస్తున్న ఈ హారర్ మూవీ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రభాస్ కెరీర్ లో ఫస్ట్ టైమ్ హారర్ కామెడీ డ్రామాగా రాబోతున్న ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు. ఇందులో మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిద్ధి కుమార్ హీరోయిన్లుగా నటిస్తుండగా.. చాలా కాలం తర్వాత ప్రభాస్ వింటేజ్ లుక్ లో కనిపించనున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్ ఆకట్టుకున్నాయి. ఇక ఈ ప్రాజెక్ట్ నుంచి అప్డేట్స్ వచ్చి చాలా రోజులైంది. దీంతో ఈ మూవీ అప్డేట్స్ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా వెయట్ చేస్తున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ క్రేజీ న్యూస్ ఫిల్మ్ వర్గాల్లో వైరలవుతుంది.
కొన్ని నెలలుగా ఈ మూవీ షూటింగ్ వేగంగా జరుగుతుంది. ప్రస్తుతం డబ్బింగ్ పనులు జరుగుతున్నట్లు సమాచారం. మరోవైపు ఈ సినిమాకు సంబంధించిన అన్ని పనులను త్వరగా పూర్తి చేయాలని భావిస్తుందట చిత్రయూనిట్. ఈ ఏడాది చివరినాటికి ఈ సినిమాను విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారట మేకర్స్. అయితే తాజాగా వినిపిస్తున్న సమాచారం ప్రకారం డబ్బింగ్ పనులు వీలైనంత త్వరగా పూర్తి చేసి ఈ నెలాఖరుకి టీజర్ విడుదల చేయాలని భావిస్తున్నారట మేకర్స్. ఇది నిజమైతే ప్రభాస్ ఫ్యాన్ కు ఇది గుడ్ న్యూస్ అనే చెప్పాలి. ఈ మూవీ సెప్టెంబర్ 24న రిలీజ్ చేయనున్నారనే టాక్ వినిపిస్తుంది. అయితే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
ప్రస్తుతం ది రాజా సాబ్ మూవీ డబ్బింగ్, పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నట్లు సమాచారం. త్వరలోనే ప్రభాస్ సైతం ఈ మూవీ డబ్బింగ్ పనులు షూరు చేయనున్నారట. ఈ సినిమా తర్వాత డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా తెరకెక్కించబోయే స్పిరిట్ మూవీ పట్టాలెక్కనుంది. అలాగే సలార్ 2, కల్కి 2 చిత్రాలు సైతం రెగ్యులర్ షూటింగ్స్ స్టార్ట్ కానున్నాయి.
ఇవి కూడా చదవండి :
Tollywood: వామ్మో.. తిని తిని 108 కిలోలు పెరిగిపోయిందట.. ఈ యాంకరమ్మను గుర్తుపట్టారా.. ?
Tollywood: చైల్డ్ ఆర్టిస్టుగా ఎంట్రీ.. 16 ఏళ్లకే క్రేజీ హీరోయిన్.. హార్మోన్ ఇంజక్షన్స్ తీసుకుందంటూ..
Mahesh Babu: మహేష్ బాబు రిజెక్ట్ చేశాడు.. బ్లాక్ బస్టర్ హిట్టుకొట్టిన ఉదయ్ కిరణ్.. ఏ సినిమా అంటే..
Tollywood: 36 ఏళ్ల హీరోయిన్‌తో 60 ఏళ్ల హీరో లిప్ లాక్ సీన్.. దెబ్బకు కొడుకుతో ఆగిపోయిన పెళ్లి..
